Thursday, May 28, 2020

భార‌త్ కు విదేశీ పెట్టుబ‌డుల వెల్లువ‌

దేశంలోకి విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల జోరు 2019-20లో కొన‌సాగింది. 2018-19తో పోల్చితే ఎఫ్‌డిఐలు 13 శాతం పెరిగి 4436 కోట్ల డాల‌ర్ల నుంచి 4997 కోట్ల డాల‌ర్ల‌కు చేరాయి. వృద్ధిలో జోరు పెంచ‌డానికి మౌలిక వ‌స‌తుల రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన కార‌ణంగా దేశానికి ఎఫ్‌డిఐ పెట్టుబ‌డులు అత్యంత కీల‌కం. 

2019-20లో అత్య‌ధికంగా ఎఫ్ డిఐలు వ‌చ్చిన రంగాల వివ‌రాలు...
 సేవ‌ల రంగం 785 కోట్ల డాల‌ర్లు 
 కంప్యూట‌ర్ సాఫ్ట్ వేర్ అండ్ హార్డ్ వేర్ 767 కోట్ల డాల‌ర్లు
 టెలీ క‌మ్యూనికేష‌న్లు  444 కోట్ల డాల‌ర్లు
 ట్రేడింగ్ 457 కోట్ల డాల‌ర్లు
 ఆటోమొబైల్  282 కోట్ల డాల‌ర్లు
 నిర్మాణం 200 కోట్ల డాల‌ర్లు
 ర‌సాయ‌నాలు 100 కోట్ల డాల‌ర్లు

అత్య‌ధికంగా ఎఫ్‌డిఐలు అందించిన దేశాలు...
సింగ‌పూర్‌  1467 కోట్ల డాల‌ర్లు
 మారిష‌స్ 824 కోట్ల డాల‌ర్లు
 నెద‌ర్లాండ్స్  650 కోట్ల డాల‌ర్లు
 అమెరికా  422 కోట్ల డాల‌ర్లు
 కేమ‌న్ ఐలండ్స్ 370 కోట్ల డాల‌ర్లు
 జ‌పాన్  322 కోట్ల డాల‌ర్లు
 ఫ్రాన్స్ 189 కోట్ల డాల‌ర్లు


No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...