కేసులు 17,00,350 | మరణాలు 1,00,467 |
కరోనా కారణంగా ప్రపంచంలో లక్ష మరణాలు సంభవించిన తొలి దేశంగా అమెరికా నమోదయింది. గత ఏడాదిలోనే తొలి కరోనా కేసును నమోదు చేసిన చైనాలో కూడా 4638 మరణాలనే నమోదు చేసింది. కేసుల సంఖ్యను కూడా విజయవంతంగా 84,106కే పరిమితం చేయగలిగింది. కాని అమెరికాలో మే 28వ తేదీ నాటికి కేసుల సంఖ్య 17 లక్షల 350కి చేరగా వారిలో 1 లక్ష 467 మంది మృత్యువాత పడ్డారు. అలా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రెండింటిలోనూ అమెరికా అగ్రరాజ్యంగానే నిలిచింది. కేసుల్లో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ లో నమోదైన కేసులు 4,11,821 కాగా మరణాలు 25,598. రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ తర్వాతి స్థానల్లో ఉన్నాయి.
భారత్ నంబర్ 10
భారత్ 1,58,333 కేసులు, 4531 మరణాలతో పదో స్థానంలో నిలిచింది. 56,948 కేసులు, 1897 మరణాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో నిలిచాయి. 3171 కేసులు, 58 మరణాలతో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలోను, 2098 కేసులు, 63 మరణాలతో తెలంగాణ 13వ స్థానంలోను ఉన్నాయి. ఇంతవరకు ఒక్క మరణం కూడా నమోదు కాని రాష్ర్టాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో చత్తీస్ గఢ్, త్రిపుర, లదాఖ్, పుదుచ్చేరి, మణిపూర్, అండమాన్-నికోబార్, నాగాలాండ్, దాద్రా నగర్-హవేలి, అరుణాచలప్రదేశ్, మిజోరం, సిక్కిం, లక్షదీవులు, డామన్-డయ్యూ ఉన్నాయి. లక్షదీవులు, డామన్-డయ్యూల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గుర్తించదగిన అంశం. నాగాలాండ్, దాద్రానగర్-హవేలి, అరుణాచలప్రదేశ్, మిజోరంలలో కేసుల సంఖ్య కూడా 1 నుంచి 4 లోపులోనే ఉంది.
No comments:
Post a Comment