Wednesday, March 25, 2020

ఆగ‌ని బుల్ చిందు

రెండో రోజు కూడా కొన‌సాగిన జోరు
2011 త‌ర్వాత అతి పెద్ద లాభం న‌మోదు

భార‌త స్టాక్ మార్కెట్ వ‌రుస‌గా రెండో రోజున కూడా జోరు ఆప‌లేదు. బుల్స్ రెచ్చిపోయి చిందులు తొక్కాయి. క‌రోనాను అదుపు చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా ప్ర‌ధాని 21 రోజుల పాటు దేశ‌వ్యాప్తంగా లాకౌట్ ప్ర‌క‌టించ‌డం, ఆ మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డుతున్న భారీ న‌ష్టాన్ని త‌ట్టుకునేందుకు అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్ స‌హా ప‌లు కేంద్ర బ్యాంకులు ఉద్దీప‌న ప్యాకేజిలు ప్ర‌క‌టించ‌డం, ఉద్దీప‌న ప్యాకేజి సిద్ధం అవుతున్న‌ద‌ని ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించ‌డం మార్కెట్ల‌లో బుల్స్ కు ప్రాణం పోసింది. మార్కెట్ లో కీల‌క ఇండెక్స్ సెన్సెక్స్ 1862 పాయింట్లు (6.98 %) లాభ‌ప‌డి 28536 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 497 పాయింట్లు లాభ‌ప‌డి 8298 వ‌ద్ద ముగిసింది. 2011 త‌ర్వాత ఇండెక్స్ లు ఒక రోజులో ఇంత భారీగా వృద్ధిని న‌మోదు చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం. కాగా మంగ‌ళ‌వారం సాధించిన వృద్ధి 693 పాయింట్ల‌తో క‌లిపితే రెండు సెష‌న్ల‌లో లాభం 2555 పాయింట్లు కాగా నిఫ్టీ 688 పాయింట్లు లాభ‌ప‌డింది. మంగ‌ళ‌వారం అమెరిక‌న్ మార్కెట్ ఆర్జించిన లాభంతో పాటు ఇత‌ర మార్కెట్ల‌లో కూడా ఏర్ప‌డిన లాభాలు అందించిన ఉత్తేజం కూడా భార‌త మార్కెట్ చిందులు తొక్క‌డానికి దారి తీసింది.   

ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.4.7 ల‌క్ష‌ల కోట్లు వృద్ధి
బుధ‌వారం ఒక్క రోజులోనే ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.4.7 ల‌క్ష‌ల కోట్లు వృద్ధి చెందింది. మంగ‌ళ‌వారం పెరిగిన సంప‌ద విలువ రూ.1.82 ల‌క్ష‌ల కోట్లు. దీంతో రెండు రోజుల వ్య‌వ‌ధిలో మొత్తం సంప‌ద రూ.6.52 ల‌క్ష‌ల కోట్లు పెరిగి రూ.1,08,40,165.20 కోట్ల‌కు చేరింది.

ర్యాలీ కొన‌సాగుతుందా...?
స్టాక్ మార్కెట్ లో ఏర్ప‌డిన ఈ ర్యాలీ నిల‌దొక్కుకుంటుందా లేక ఇది తాత్కాలిక‌మేనా అనే ప్ర‌శ్న‌లు ప‌లువురిలో త‌లెత్తుతున్నాయి. డెయిలీ చార్టుల ప్ర‌కారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ డైవ‌ర్జెన్స్ సాధించాయ‌ని, రిక‌వ‌రీ అవ‌కాశాలున్నాయ‌నేందుకు ఇది తొలి సంకేత‌మ‌ని విశ్లేష‌కులంటున్నారు. ప్ర‌స్తుతం నిఫ్టీకి మ‌ద్ద‌తు స్థాయిల ప‌రిధి 7600-7650 కాగా నిరోధ స్థాయిల ప‌రిధి 8050-8200 వ‌ద్ద ఉన్న‌ట్టు ఎల్ కెపి సెక్యూరిటీస్ సీనియ‌ర్ అన‌లిస్ట్ రోహిత్ షింగ్రే చెబుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో నిఫ్టీలో రిలీఫ్ ర్యాలీ 9000 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చున‌ని అంచ‌నా.

నెల రోజుల్లో క‌నివిని ఎరుగ‌ని న‌ష్టం
భార‌త స్టాక్ మార్కెట్ కోవిడ్-19 మ‌హ‌మ్మారి ప్ర‌భావం వ‌ల్ల గ‌త నెల రోజుల్లో క‌నివిని ఎరుగ‌నంత భారీ క‌ల్లోలానికి గుర‌యింది. అస‌లు మార్కెట్ ప‌య‌నం ఏ దిశ‌గా సాగుతుంద‌న్న‌ది అన‌లిస్టుల ఊహాగానాల‌కు అంద‌నంత‌గా న‌ష్టాలు ఏర్ప‌డ్డాయి. గ‌త నెల రోజుల్లో మార్కెట్ న‌డ‌క ఒక వైకుంఠ‌పాళిని గుర్తుకి తెచ్చింది. ఒక చిన్న నిచ్చెన దొరికి కాస్తంత లాభ‌ప‌డింద‌న్న స‌మ‌యంలో ఒక పెద్ద పాము నోటికి చిక్కి పాతాళానికి ప‌డిపోయే విధంగా ఈ ప‌య‌నం సాగింది. సెన్సెక్స్, మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ల‌న్నీ 35 శాతం మేర‌కు న‌ష్ట‌పోయాయి. ప్ర‌స్తుత వాతావ‌ర‌ణంలో ఇన్వెస్ట‌ర్లు పెట్టుబ‌డి విష‌యంలో దీర్ఘ‌కాలిక దృక్ప‌థం అనుస‌రించ‌డ‌మే మంచిద‌ని, తాత్కాలిక ఎగుడుదిగుడుల ప్ర‌భావానికి లోను కారాద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 

Tuesday, March 24, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

మిడ్ సెషన్ నిస్తేజం 
తిథి :  చైత్ర శుద్ధ పాడ్యమి 
న‌క్ష‌త్రం : రేవతి 
అప్ర‌మ‌త్తం :  కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, మేష, సింహ  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 7801.05 (+190.80) 
ట్రెండ్ మారే వేళ : 11.02
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 వ‌ర‌కు నిలకడగా ట్రేడవుతూ  తదుపరి 11.20 వరకు మెరుగ్గా  ట్రేడయ్యే స్కారం ఉంది. ఆ తర్వాత 1.40 వరకు నిస్తేజంగా నిలిచి తదుపరి  చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  11.15  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిష‌న్లు తీసుకుని 1.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 1.45 తర్వాత  ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు..   
 
నిరోధ స్థాయిలు :  7900, 7950, 8025
మ‌ద్ద‌తు స్థాయిలు : 7700, 7650, 7550
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Monday, March 23, 2020

చారిత్ర‌క మ‌హాప‌త‌నం

క‌రోనా సునామీ - 8  
భార‌త స్టాక్ మార్కెట్ మ‌రో మ‌హాప‌త‌నాన్ని న‌మోదు చేసింది. ఇది ఇంత‌వ‌ర‌కు భార‌త మార్కెట్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ప‌త‌నం. కోవిడ్‌-19 ప్ర‌భావానికి 2020 మార్చి 12వ తేదీ న‌మోదైన భారీ ప‌త‌నం ఈ దెబ్బ‌తో రెండో స్థానానికి దిగ‌జారిపోయింది. కోవిడ్‌-19ని అదుపు చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా భార‌త్ స‌హా భిన్న దేశాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డం, ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఇప్ప‌టికే తిరోగ‌మ‌నంలోకి జారుకోవ‌డం మార్కెట్ వ‌ర్గాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాయి. దీనికి తోడు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ప్రారంభం కాబోయే కొత్త ఆర్థిక సంవ‌త్స‌రానికి కూడా ప‌లు అంత‌ర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వృద్ధిరేటు అంచ‌నాను గ‌ణ‌నీయంగా కుదించ‌డం ప‌రిస్థితిని మ‌రింత తీవ్రం చేసింది. బిఎస్ఇ సెన్సెక్స్ 3935 పాయింట్లు (13.15%) న‌ష్ట‌పోయి 25981.24 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ సూచీ నిఫ్టీ 1135.20 పాయింట్లు (12.98%) దిగ‌జారి 7610.25 వ‌ద్ద ముగిసింది. వైర‌స్ విస్త‌ర‌ణ విష‌యంలో తీవ్ర అనిశ్చితి నెల‌కొన‌డంతో జ‌రిగిన ఈ క‌ల్లోలం తీవ్ర‌త చాలా అధికంగా ఉంది. ఆసియా, యూరోపియ‌న్ మార్కెట్ల‌లో ఏర్ప‌డిన ప‌త‌నాల క‌న్నా భార‌త మార్కెట్ ప‌త‌నంలో శాతం అధికంగా ఉంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 25880.83 పాయింట్ల క‌నిష్ఠ స్థాయిని తాకింది.

ఉద‌యం 45 నిముషాలు ట్రేడింగ్ హాల్ట్

సోమ‌వారం ఉద‌యం ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 10 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. దీంతో స‌ర్క్యూట్ బ్రేక‌ర్లు అప్లై చేయ‌క త‌ప్ప‌లేదు. ఫ‌లితంగా 45 నిముషాల పాటు ట్రేడింగ్ నిలిచిపోయింది. విరామం త‌ర్వాత మార్కెట్ తిరిగి తెరుచుకున్నా మార్కెట్ ఎక్క‌డా కోలుకునే సూచ‌న ఇవ్వ‌లేదు.

ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు ఫ‌ట్
ఈ మ‌హాప‌త‌నంలో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఫ‌లితంగా బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,01,86,936.28 కోట్ల‌కు దిగ‌జారింది.
- సెన్సెక్స్ లో న‌ష్ట‌పోయిన కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్ 28 శాతం న‌ష్టంతో అగ్ర‌గామిగా నిలిచింది. బ‌జాజ్ ఫైనాన్స్, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, మారుతి, ఎల్ అండ్ టి అన్నీ భారీ న‌ష్టాలు న‌మోదు చేశాయి.

రూపాయి చారిత్ర‌క ప‌త‌నం
ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి కూడా చారిత్ర‌క ప‌త‌నం న‌మోదు చేసింది. ఒక్క‌రోజులోనే అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి 102 పైస‌లు దిగ‌జారి 76.22 వ‌ద్ద ముగిసింది. రూపాయి చ‌రిత్ర‌లో ఇదే అతి పెద్ద ప‌త‌నం. ఇంట్రాడేలో రూపాయి గ‌రిష్ఠ స్థాయి 75.86, క‌నిష్ఠ స్థాయి 76.30 న‌మోదు చేసింది. 

7 సెష‌న్ల‌లో ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
(గ‌త రెండు వారాల్లో 6 రోజులు + ఈ వారంలో 1)
 ------------------------------------------------------------------------- 
                   సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
-------------------------------------------------------------------------   

మార్చి   9       1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12       2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16       2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17         811         231        రూ. 2.12 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 18       1709         495         రూ. 5.98 ల‌క్ష‌ల కోట్లు 
 మార్చి 19         581        206        రూ. 3.74 ల‌క్ష‌ల కోట్లు
మార్చి  23       3935        1135        రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు       
మొత్తం నష్టం  14039       4025       రూ.71.47 ల‌క్ష‌ల కోట్లు   
------------------------------------------------------------------------- 

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

సాధారణ నిస్తేజం 
తిథి :  ఫాల్గుణ బహుళ అమావాస్య   
న‌క్ష‌త్రం : ఉత్తరాభాద్ర   
అప్ర‌మ‌త్తం :   భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, మేష, సింహ  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 7610.25 (-1135.20) 
ట్రెండ్ మారే వేళ : 2.48
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 11.30 వ‌ర‌కు నిలకడ/నిస్తేజంగా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 1.30 వరకు నిస్తేజంగా నిలిచి తదుపరి  చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  11.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిష‌న్లు తీసుకుని 1.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 
నిరోధ స్థాయిలు :  7700, 7850, 7925
మ‌ద్ద‌తు స్థాయిలు : 7500, 7400, 7300
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Sunday, March 22, 2020

వారానికి ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌

9050 పైన ముగిస్తే బుల్లిష్‌
(తేదీలు మార్చి 23-మార్చి 27, 2020 మ‌ధ్య వారానికి)
గ‌త వారం నిఫ్టీ ముగింపు :  8745 (-1210)
నిఫ్టీ గ‌త వారం 9602-7833 పాయింట్ల మ‌ధ్య‌న విస్తృత ప‌రిధిలో క‌ద‌లాడి చివ‌రికి 1210 పాయింట్ల న‌ష్టంతో 8745 వ‌ద్ద నెగిటివ్ గా ముగిసింది.
- మార్చి 23 నుంచి 25 వరకు కొత్త ఆస్ట్రో మాసం ప్రారంభం అవుతోంది. ఈ కాలంలో ఏర్పడే పరిధి 3 వారాలకు కీలకం. గరిష్ఠ స్థాయికి పైన బుల్లిష్ గాను, కనిష్ఠ స్థాయికి దిగువన బేరిష్ గాను భావించాలి
- 20, 50, 100, 200 చ‌ల‌న స‌గ‌టు (డిఎంఏ) స్థాయిలు 10513, 11479, 11760, 11574. ఇవి నిరోధ‌, మ‌ద్ద‌తు స్థాయిలుగా నిలుస్తాయి.
- నిఫ్టీ ప్ర‌స్తుతం అన్ని డిఎంఏల క‌న్నా దిగువ‌న ఉంది. కాని 50 డిఎంఏ, 200 డిఎంఏ క‌న్నా పైనే ఉండ‌డం దీర్ఘ‌కాలిక బుల్లిష్ ట్రెండ్ చెక్కు చెద‌ర‌లేద‌న‌డానికి సంకేతం. వారాంతానికి 9050 క‌న్నా పైన ముగిస్తే స్వ‌ల్ప‌కాలిక ట్రెండ్ బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి : 9050    బ్రేక్ డౌన్ స్థాయి : 8450
నిరోధ స్థాయిలు : 8890, 8975, 9050 (8815 పైన బుల్లిష్‌)
మ‌ద్ద‌తు స్థాయిలు : 8600, 8225, 8450 (8675 దిగువ‌న బేరిష్‌) 
ఇన్వెస్ట‌ర్ల‌కు సూచ‌న...
వారం ప్రారంభ స్థాయి అత్యంత కీల‌కం. అంత కన్నా పైన మాత్రమే లాంగ్ పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------------------- 
గ్ర‌హ‌గ‌తులివే...
- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2 నుంచి మేషంలోని భరణి పాదం 1 మ‌ధ్య‌లో చంద్ర సంచారం
- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 2-3 మ‌ధ్య‌లో ర‌వి సంచారం
- కుంభంలోని శతభిషం పాదం 2-3 మ‌ధ్య‌లో బుధ సంచారం
- మేషంలోని భరణి  పాదం 4 నుంచి కృత్తిక పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
- మకరంలోని ఉత్తరాషాఢ పాదం2లో కుజ సంచారం
- మకరంలోని ఉత్త‌రాషాఢ పాదం 3లో కుంభ న‌వాంశ‌లో శ‌ని సంచారం
- ధ‌నుస్సులోని ఉత్తరాషాఢ పాదం 1లో ధ‌నుస్సు న‌వాంశ‌లో బృహ‌స్ప‌తి సంచారం
- మిథునంలోని ఆర్ద్ర పాదం 1లో రాహువు, ధ‌నుస్సులోని మూల పాదం 3లో కేతువు సంచారం
---------------------------------------------- 
సాధారణంగా మెరుగు  (సోమవారానికి)
తిథి :  ఫాల్గుణ బహుళ చతుర్దశి  
న‌క్ష‌త్రం : పూర్వాభాద్ర   
అప్ర‌మ‌త్తం :  అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులు, మీన, కర్కాటక    రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 82463.45 (-205.35) 
ట్రెండ్ మారే వేళ : ఉద‌యం : 11.52
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.30 వ‌ర‌కు మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 12.45 వరకు నిలకడ/నిస్తేజంగా నిలిచి తదుపరి 3 గంటల వరకు మెరుగ్గాను ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగాను ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  10.45  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిష‌న్లు తీసుకుని 12.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. ఒంటి గంట తర్వాత ఎటిపి క‌న్నా పైకి వస్తే లాంగ్  పొజిషన్లు తీసుకుని 3 గంటల  సమయంలో క్లోజ్  చేసుకోవచ్చు  
నిరోధ స్థాయిలు :  8800, 8850, 8925
మ‌ద్ద‌తు స్థాయిలు : 8675, 8625, 8550
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Saturday, March 21, 2020

వారం మొత్తంలో క‌ల్లోల‌మే

స్టాక్ మార్కెట్ వారం మొత్తంలో తీవ్ర క‌ల్లోలాన్ని చ‌వి చూసింది. ఐదు రోజుల ట్రేడింగ్ లో నాలుగు రోజులు బేర్స్ తో బుల్స్ పోరాట స్ఫూర్తిని ఏ మాత్రం చూప‌లేక‌పోయాయి. బేర్ ధాటికి చ‌తికిల‌బ‌డిపోయి లేవ‌లేని స్థితిలో ఉన్న బుల్స్ శుక్ర‌వారం ఉన్న‌ట్టుండి విశ్వ‌రూపం చూపించాయి. నాలుగు రోజుల విశ్రాంతికి ప్ర‌తీకారం చూపించాయి. ఒక్క రోజులోనే సెన్సెక్స్ 1628 పాయింట్లు, నిఫ్టీ 482 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి. కాని వారం మొత్తం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మాత్రం బుల్స్ భారీ ఓట‌మిని అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు. వారం మొత్తం మీద సెన్సెక్స్ 4188 పాయింట్లు,నిఫ్టీ 1203 పాయింట్ల భారీ న‌ష్టం మూట‌గ‌ట్టుకున్నాయి. ఇంత‌కు ముందు వారంలో సోమ‌, గురు వారాల్లో ఏర్ప‌డిన న‌ష్టాల‌ను కూడా క‌లిపితే మొత్తం ఆరు రోజులుగా ఏర్ప‌డిన క‌ల్లోలంలో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.57.25 ల‌క్ష‌ల కోట్లు క్షీణించినా చివ‌రి రోజున సాధించిన లాభంతో ఆ న‌ష్టం రూ.50.93 ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌రిమితం అయింది. కోవిడ్‌-19 వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు ఏర్ప‌డ‌నున్న న‌ష్టం నుంచి భిన్న రంగాల‌ను కాపాడేందుకు ప‌లు దేశాలు ఉద్దీప‌న ప్యాకేజిలు ప్ర‌క‌టించ‌డం, ఎక‌నామిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించ‌డం మార్కెట్ కు ఊపిరులు పోసింది. అయితే శుక్ర‌వారం నాడు క‌నిష్ఠ స్థాయిల నుంచి కోలుకోవ‌డం వ‌చ్చే వారం సూచీలు కాస్తంత రిక‌వ‌రీ బాట ప‌ట్టే ఆశ‌ల‌ను రేకెత్తించింద‌ని ప‌రిశీల‌కులంటున్నారు.

Friday, March 20, 2020

హ‌మ్మ‌య్య‌..వేడి చ‌ల్లారింది

4 రోజుల ప‌త‌నాల అనంత‌రం తొలి లాభం

స్టాక్ మార్కెట్ లో నాలుగు రోజులుగా సాగుతున్న భారీ న‌ష్టాల‌కు ఎట్ట‌కేల‌కు తెర ప‌డింది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఏర్ప‌డ‌బోయే ప‌రిస్థితుల‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ప‌లు దేశాలు విప్ల‌వాత్మ‌క‌మైన చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించ‌డం స్టాక్ మార్కెట్ల‌కు ఊపిరి పోసింది. ఫ‌లితంగా శుక్ర‌వారం ప్ర‌పంచ మార్కెట్లు కోలుకున్నాయి. ఆ స్ఫూర్తితో భార‌త మార్కెట్ లో కూడా సెంటిమెంట్ పాజిటివ్ గా మారింది. కోవిడ్‌-19 ప్ర‌భావానికి దెబ్బ తినే రంగాల‌కు ఉద్దీప‌నలు అందించేందుకు ఒక ఫైనాన్షియ‌ల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని చేసిన ప్ర‌క‌ట‌న కూడా మార్కెట్ల‌లో ఆశావ‌హ స్థితి నెల‌కొల్పింది. అయిన‌ప్ప‌టికీ ఉద‌యం మార్కెట్ ఆటుపోట్ల‌తోనే ప్రారంభ‌మై ఇంట్రాడేలో 2485 పాయింట్ల మేర‌కు భారీ ఎగుడుదిగుడులు చ‌వి చూసింది. అయితే  త‌దుప‌రి ద‌శ‌లో మార్కెట్ నిల‌దొక్కుకోవ‌డంతో చివ‌రికి 1627.73 పాయింట్ల లాభంతో 29215.96 పాయింట్ల వ‌ద్ద సెన్సెక్స్ ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 482 పాయింట్లు లాభ‌ప‌డి 8745.45 వ‌ద్ద ముగిసింది. సుదీర్ఘ విరామం త‌ర్వాత అన్ని సెక్టోర‌ల్ సూచీలు లాభాల్లో ముగిశాయి.

సంప‌ద పెరిగింది...
వారాంతం రోజున మార్కెట్ అద్భుత‌మైన రిక‌వ‌రీ సాధించ‌డంతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.6,32,362.29 కోట్ల మేర‌కు పెరిగింది.శుక్ర‌వారం మార్కెట్ ముగిసే స‌మ‌యానికి ఆ విలువ రూ1,16,09,143.29 కోట్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. 

Thursday, March 19, 2020

నాలుగో రోజూ ఆగ‌లేదు...

కొన‌సాగిన స్టాక్ మార్కెట్ల న‌ష్టాలు
క‌రోనా సునామీ - 6
కోవిడ్‌-19 ప్ర‌భావానికి భార‌త ఈక్విటీ మార్కెట్ వ‌రుస‌గా నాలుగో రోజు కూడా ప‌తనం న‌మోదు చేసింది. ఉద‌యం స‌మ‌యంలో కొంత సేపు పాజిటివ్ ధోర‌ణిలోనే ట్రేడ‌యినా అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో తిరోగ‌మ‌నం భ‌యాల‌తో ప్ర‌పంచ మార్కెట్ల‌లో అమ్మ‌కాలు పోటెత్తిన ప్ర‌భావం దేశీయ ఇన్వెస్ట‌ర్ల‌పై కూడా ప‌డింది. మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి రిటైల్ ఇన్వెస్ట‌ర్లు భారీ ఎత్తున అమ్మ‌కాల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో రోజు మొత్తంలో 2650 పాయింట్ల‌కు పైబ‌డి ఎగుడుదిగుడులు సాధించిన సెన్సెక్స్ చివ‌రికి 581.28 పాయింట్ల న‌ష్టంతో 28288.23 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఒక ద‌శ‌లో కీల‌క మాన‌సిక అవ‌ధి 7900 క‌న్నా దిగ‌జారినా చివ‌రికి 205.35 పాయింట్ల న‌ష్టంతో 8263.45 వ‌ద్ద ముగిసింది. అయితే మ‌ధ్యాహ్నం సెష‌న్ లో మార్కెట్లు ఒక మోస్త‌రు పుల్ బ్యాక్ సాధించ‌డం కాస్తంత ఊర‌ట క‌లిగించింది. కాని ఆ ఆనందం ఎంతో స‌మ‌యం నిల‌వ‌లేదు.
మ‌రో రూ.3.74 ల‌క్ష‌ల కోట్లు ఢ‌మాల్‌
గురువారం మార్కెట్ లో ఏర్ప‌డిన న‌ష్టం ప్ర‌భావం వ‌ల్ల ఇన్వెస్ట‌ర్ల సంప‌ద మ‌రో్ రూ.3.74 ల‌క్షల కోట్లు ఆవిరైపోయింది.దీంతో వ‌రుస‌గా నాలుగు రోజులుగా తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ప‌రిమాణం రూ.19.49 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.19,49,461.82 కోట్లు దిగ‌జారి రూ.1,09,76,781 కోట్ల‌కు చేరింది. 
6 సెష‌న్ల‌లో ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
(గ‌త వారం రెండు రోజులు స‌హా)
------------------------------------------------------------------------- 
                   సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
------------------------------------------------------------------------- 

మార్చి   9      1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12       2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16       2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17         811         231        రూ. 2.12 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 18      1709         495         రూ. 5.98 ల‌క్ష‌ల కోట్లు 
 మార్చి 19        581         206         రూ. 3.74 ల‌క్ష‌ల కోట్లు      
మొత్తం నష్టం  10104       2890         రూ.57.25 ల‌క్ష‌ల కోట్లు   
------------------------------------------------------------------------- 

ప్ర‌పంచ మార్కెట్లూ న‌ష్టాల బాట‌లోనే...
కోవిడ్‌-19 భ‌యాల కార‌ణంగా ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ వ‌రుస న‌ష్టాల్లోనే ట్రేడ‌వుతున్నాయి. ప‌లు దేశాలు ఉద్దీప‌న‌లు ప్ర‌క‌టించినా ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ ను పెంచ‌లేక‌పోయాయి. ఆసియా దేశాల స్టాక్ ఎక్స్ఛేంజిల‌న్నీ భారీ ప‌త‌నాలు న‌మోదు చేశాయి. ద‌క్షిణ కొరియాకు చెందిన కోస్పి 8 శాతం న‌ష్ట‌పోయి దారుణంగా దిగ‌జారిన సూచీగా నిలిచింది. హాంగ్ సెంగ్‌, నిక్కీ, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ తో పాటు యూరో్పియ‌న్ దేశాల సూచీలు కూడా భారీ న‌ష్టాల‌నే న‌మోదు చేశాయి.
రూపాయి మ‌రింత బ‌ల‌హీనం
అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి మ‌రింత‌గా దిగ‌జారింది. ఒక ద‌శ‌లో జీవిత కాల క‌నిష్ఠ స్థాయి 75.30 వ‌ర‌కు దిగ‌జారి గుబులు పుట్టించింది. చివ‌రికి 86 పైస‌లు దిగ‌జారి 75.12 వ‌ద్ద క్లోజ‌యింది. 2019 సెప్టెంబ‌ర్ 3వ తేదీ త‌ర్వాత రూపాయి ఒక రోజులో ఇంత భారీగా న‌ష్ట‌పోవ‌డం ఇదే ప్ర‌థ‌మం. దీంతో ఈ నెల మొత్తం మీద రూపాయి విలువ 4 శాతం క్షీణించిన‌ట్ట‌యింది. 
- సోమ‌-గురు వారాల మ‌ధ్య‌న‌ 4 రోజుల్లో భార‌త స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్లు న‌ష్టపోయిన సంప‌ద విలువ‌ రూ.19.49 ల‌క్ష‌ల కోట్లు. స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,09,76,781 కోట్ల‌కు దిగ‌జారింది. గ‌త వారంలో సోమ‌, గురు వారాల్లో (9,12 తేదీలు) ఏర్ప‌డిన భారీ న‌ష్టాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మొత్తం సంప‌ద న‌ష్టం రూ.57.25 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది.
- ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 173కి చేర‌గా మృతుల సంఖ్య 4కి పెరిగింది. పంజాబ్ కు చెందిన 70 సంవ‌త్స‌రాల వృద్ధుడు క‌రోనా వ్యాధి కార‌ణంగా గురువారం మ‌ర‌ణించాడు.
- క్రూడాయిల్ ధ‌ర‌ల త‌గ్గుద‌ల వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.1.40 ల‌క్ష‌ల కోట్లు ఆదా     

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

మిడ్  సెషన్  నిస్తేజం 
తిథి :  ఫాల్గుణ బహుళ ద్వాదశి  
న‌క్ష‌త్రం : శ్రవణం    
అప్ర‌మ‌త్తం :  పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, కుంభ, మిథున రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 82463.45 (-205.35) 
ట్రెండ్ మారే వేళ : ఉద‌యం : 10.28
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 12.10 వ‌ర‌కు నిలకడ/మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత  2.20 వరకు నిలకడనూ, తదుపరి చివరి వరకు మెరుగ్గాను ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  12.15  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిష‌న్లు తీసుకుని 2.15 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 2.30 తర్వాత ఎటిపి క‌న్నా పైకి వస్తే లాంగ్  పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోల్ చేసుకోవచ్చు  
నిరోధ స్థాయిలు :  8325, 8400, 8450
మ‌ద్ద‌తు స్థాయిలు : 8150, 8200, 8125
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Wednesday, March 18, 2020

క‌రోనా సునామీ

మూడో రోజూ న‌ష్టాల్లో మార్కెట్‌

29 వేల దిగువ‌కు సెన్సెక్స్ 

కోవిడ్‌-19 ప్ర‌భావం స్టాక్ మార్కెట్ ను పీడ‌క‌ల‌లా వెన్నాడుతోంది. ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ భారీ ప‌త‌నాలు చ‌వి చూసిన ప్ర‌భావంతో భార‌త స్టాక్ ఇండెక్స్ లు వ‌రుస‌గా మూడో రోజూ న‌ష్టాల్లో న‌డిచాయి. ఉద‌యం స్వ‌ల్ప‌లాభాల్లో ఉన్న‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ రోజు గ‌డుస్తున్న కొద్దీ న‌ష్టాల్లోకి జారుకున్నాయి. ప్ర‌పంచ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు మార్కెట్ ఊపిరి తీసుకోగ‌లిగే ప‌రిస్థితి ఏ మాత్రం అందించ‌లేదు. దీనికి తోడు ఎస్ అండ్ పి సంస్థ భార‌త వృద్ధి అంచ‌నాను మ‌రింత‌గా త‌గ్గించ‌డం, టెలికాం ఎజిఆర్ బ‌కాయిల విష‌యంలో టెల్కోలు, ప్ర‌భుత్వ వైఖ‌రిని సుప్రీం కోర్టు త‌ప్పు ప‌ట్ట‌డం వంటి ప‌రిణామాలు మార్కెట్ కోలుకోలేని విఘాతం క‌లిగించాయి. రోజు మొత్తంలో సుమారు 2500 పాయింట్ల మేర ఊగిసలాడిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి 1709.58 పాయింట్ల న‌ష్టంతో 28869.51 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. 2017 జ‌న‌వ‌రి త‌ర్వాత ఇండెక్స్ 29000 క‌న్నా దిగ‌జార‌డం ఇదే ప్ర‌థ‌మం. నిఫ్టీ 498.25 పాయింట్ల న‌ష్టంతో 8468.80 వ‌ద్ద ముగిసింది. ఇండెక్స్ లు వ‌రుస‌గా మ‌ద్ద‌తు స్థాయిల‌న్నింటినీ కోల్పోతున్నాయి. ఈ ప‌త‌నం ఎంత‌వ‌ర‌కు సాగుతుందో అంచ‌నా వేయ‌డం మార్కెట్ పండితుల‌కు కూడా సాధ్యం కావ‌డంలేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తుంటే నిఫ్టీ మ‌రో 1000 పాయింట్ల వ‌ర‌కు న‌ష్ట‌పోయి 7500 వ‌ద్ద స్థిర‌ప‌డ‌వ‌చ్చునంటున్నారు.
- సెన్సెక్స్ లో ఒఎస్ జిసి, ఐటిసి మిన‌హా అన్ని షేర్లు న‌ష్టాల్లోనే ట్రేడ‌య్యాయి. 23.90 శాతం న‌ష్టంతో ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ అగ్ర‌గామిగా ఉంది.

- మూడు రోజుల్లో భార‌త స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్లు న‌ష్టపోయిన సంప‌ద విలువ‌ రూ.15.72 ల‌క్ష‌ల కోట్లు. స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,13,53,329.30 కోట్ల‌కు దిగ‌జారింది.

- 1056 క‌న్నా ఎక్కువ‌ కంపెనీల షేర్ల ధ‌ర‌లు ఏడాది క‌నిష్ఠ స్థాయికి దిగ‌జారిపోయాయి.
5 సెష‌న్ల‌లో ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
 ------------------------------------------------------------------------- 
                   సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
 -------------------------------------------------------------------------   

మార్చి   9      1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12       2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16       2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17         811         231        రూ.  2.12 ల‌క్ష‌ల కోట్లు
 మార్చి 18      1709         495         రూ.5.98 ల‌క్ష‌ల కోట్లు   
మొత్తం నష్టం  10104       2890         రూ.37.76 ల‌క్ష‌ల కోట్లు   
-------------------------------------------------------------------------       

భారీ న‌ష్టాల్లో ప్ర‌పంచ మార్కెట్లు
ప‌లు దేశాలు కోవిడ్‌-19 వ‌ల్ల ఏర్ప‌డిన న‌ష్టాల నుంచి కోలుకునేందుకు ప్ర‌క‌టించిన ఉద్దీప‌న చ‌ర్య‌లు కూడా ప్ర‌పంచ మార్కెట్ల‌ను ఆదుకోలేదు. ఫ్రాంక్ ఫ‌ర్ట్, లండ‌న్‌, పారిస్ ఇండెక్స్ లు 5 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. ఆసియాలో టోక్యో (1.7%), సిడ్నీ (6%), హాంకాంగ్ (4%) షాంఘై (1.8%) ఇండెక్స్ లు భారీగా న‌ష్ట‌పోయాయి. 

17 సంవ‌త్స‌రాల క‌నిష్ఠానికి క్రూడాయిల్ ధ‌ర
అంత‌ర్జాతీయ విప‌ణిలో క్రూడాయిల్ ధ‌ర‌లు 17 సంవ‌త్స‌రాల క‌నిష్ట స్థాయికి దిగ‌జారాయి. న్యూయార్క్ మార్కెట్ లో డ‌బ్ల్యుటిఐ క్రూడాయిల్ ధ‌ర బ్యారెల్ 25.08 డాల‌ర్లు ప‌లికింది.   

1985 క‌నిష్ఠ స్థాయికి స్టెర్లింగ్‌
బ్రిట‌న్ క‌రెన్సీ స్టెర్లింగ్ పౌండ్ డాల‌ర్ మార‌కంలో 1985 క‌నిష్ఠ స్థాయిల‌కు ప‌డిపోయింది.బుధ‌వారం 1.9 శాతం దిగ‌జారి 1.1828కి ప‌డిపోయి చివ‌రికి 1.1861 వ‌ద్ద ముగిసింది.           

రెపోరేటు య‌థాత‌థం

ప‌శ్చిమాసియా సంక్షోభం ప్ర‌త్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్ర‌పంచ ఆర్థిక వ్యవ‌స్థ‌ల‌ను భ‌య కంపితుల్ని చేస్తున్న వాతావ‌ర‌ణంలో భార‌త రిజ‌ర్వ్ బ...