9050 పైన ముగిస్తే బుల్లిష్
(తేదీలు మార్చి 23-మార్చి 27, 2020 మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ ముగింపు : 8745 (-1210)
నిఫ్టీ గత వారం 9602-7833 పాయింట్ల మధ్యన విస్తృత పరిధిలో కదలాడి చివరికి 1210 పాయింట్ల నష్టంతో 8745 వద్ద నెగిటివ్ గా ముగిసింది.
- మార్చి 23 నుంచి 25 వరకు కొత్త ఆస్ట్రో మాసం ప్రారంభం అవుతోంది. ఈ కాలంలో ఏర్పడే పరిధి 3 వారాలకు కీలకం. గరిష్ఠ స్థాయికి పైన బుల్లిష్ గాను, కనిష్ఠ స్థాయికి దిగువన బేరిష్ గాను భావించాలి
- 20, 50, 100, 200 చలన సగటు (డిఎంఏ) స్థాయిలు 10513, 11479, 11760, 11574. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
- నిఫ్టీ ప్రస్తుతం అన్ని డిఎంఏల కన్నా దిగువన ఉంది. కాని 50 డిఎంఏ, 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ చెక్కు చెదరలేదనడానికి సంకేతం. వారాంతానికి 9050 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్ బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి : 9050 బ్రేక్ డౌన్ స్థాయి : 8450
నిరోధ స్థాయిలు : 8890, 8975, 9050 (8815 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 8600, 8225, 8450 (8675 దిగువన బేరిష్)
ఇన్వెస్టర్లకు సూచన...
వారం ప్రారంభ స్థాయి అత్యంత కీలకం. అంత కన్నా పైన మాత్రమే లాంగ్ పొజిషన్లు శ్రేయస్కరం.
----------------------------------------------
గ్రహగతులివే...
- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2 నుంచి మేషంలోని భరణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 2-3 మధ్యలో రవి సంచారం
- కుంభంలోని శతభిషం పాదం 2-3 మధ్యలో బుధ సంచారం
- మేషంలోని భరణి పాదం 4 నుంచి కృత్తిక పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
- మకరంలోని ఉత్తరాషాఢ పాదం2లో కుజ సంచారం
- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 3లో కుంభ నవాంశలో శని సంచారం
- ధనుస్సులోని ఉత్తరాషాఢ పాదం 1లో ధనుస్సు నవాంశలో బృహస్పతి సంచారం
- మిథునంలోని ఆర్ద్ర పాదం 1లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 3లో కేతువు సంచారం
----------------------------------------------
సాధారణంగా మెరుగు (సోమవారానికి)
తిథి : ఫాల్గుణ బహుళ చతుర్దశి
నక్షత్రం : పూర్వాభాద్ర
అప్రమత్తం :
అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులు, మీన, కర్కాటక రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.
నిఫ్టీ : 82463.45 (-205.35)
ట్రెండ్ మారే వేళ : ఉదయం : 11.52
ధోరణి : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.30 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 12.45 వరకు నిలకడ/నిస్తేజంగా నిలిచి తదుపరి 3 గంటల వరకు మెరుగ్గాను ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగాను ట్రేడ్ కావచ్చు.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం
10.45 సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. ఒంటి గంట తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు
నిరోధ స్థాయిలు : 8800, 8850, 8925
మద్దతు స్థాయిలు : 8675, 8625, 8550
గమనిక : ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నికల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన మాత్రమే. మార్కెట్ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.
------------------------------ ------------------------
సూచన...
సూచన...
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి లేదా ఇతర మద్దతు స్థాయిల వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కాని సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచనను టెక్నికల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ర్టో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభనష్టాలు ఆధారపడి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవలం ఏమి జరవచ్చుననేది సూచనగా చెబుతాడు. పై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి...
- భువనగిరి అమరనాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నికల్ అనలిస్ట్
No comments:
Post a Comment