Friday, March 20, 2020

హ‌మ్మ‌య్య‌..వేడి చ‌ల్లారింది

4 రోజుల ప‌త‌నాల అనంత‌రం తొలి లాభం

స్టాక్ మార్కెట్ లో నాలుగు రోజులుగా సాగుతున్న భారీ న‌ష్టాల‌కు ఎట్ట‌కేల‌కు తెర ప‌డింది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఏర్ప‌డ‌బోయే ప‌రిస్థితుల‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ప‌లు దేశాలు విప్ల‌వాత్మ‌క‌మైన చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించ‌డం స్టాక్ మార్కెట్ల‌కు ఊపిరి పోసింది. ఫ‌లితంగా శుక్ర‌వారం ప్ర‌పంచ మార్కెట్లు కోలుకున్నాయి. ఆ స్ఫూర్తితో భార‌త మార్కెట్ లో కూడా సెంటిమెంట్ పాజిటివ్ గా మారింది. కోవిడ్‌-19 ప్ర‌భావానికి దెబ్బ తినే రంగాల‌కు ఉద్దీప‌నలు అందించేందుకు ఒక ఫైనాన్షియ‌ల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని చేసిన ప్ర‌క‌ట‌న కూడా మార్కెట్ల‌లో ఆశావ‌హ స్థితి నెల‌కొల్పింది. అయిన‌ప్ప‌టికీ ఉద‌యం మార్కెట్ ఆటుపోట్ల‌తోనే ప్రారంభ‌మై ఇంట్రాడేలో 2485 పాయింట్ల మేర‌కు భారీ ఎగుడుదిగుడులు చ‌వి చూసింది. అయితే  త‌దుప‌రి ద‌శ‌లో మార్కెట్ నిల‌దొక్కుకోవ‌డంతో చివ‌రికి 1627.73 పాయింట్ల లాభంతో 29215.96 పాయింట్ల వ‌ద్ద సెన్సెక్స్ ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 482 పాయింట్లు లాభ‌ప‌డి 8745.45 వ‌ద్ద ముగిసింది. సుదీర్ఘ విరామం త‌ర్వాత అన్ని సెక్టోర‌ల్ సూచీలు లాభాల్లో ముగిశాయి.

సంప‌ద పెరిగింది...
వారాంతం రోజున మార్కెట్ అద్భుత‌మైన రిక‌వ‌రీ సాధించ‌డంతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.6,32,362.29 కోట్ల మేర‌కు పెరిగింది.శుక్ర‌వారం మార్కెట్ ముగిసే స‌మ‌యానికి ఆ విలువ రూ1,16,09,143.29 కోట్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. 

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...