Thursday, January 9, 2025

40 కోట్ల పైబ‌డిన ఇళ్ల‌కు భ‌లే గిరాకీ

దేశంలో ల‌గ్జ‌రీ గృహాల‌కు డిమాండు పెరిగిపోతోంది. రూ.40 కోట్ల ధ‌ర పైబ‌డిన ఇళ్ల డిమాండు 2024 సంవ‌త్స‌రంలో చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిలో పెరిగిపోయిన‌ట్టు రియ‌ల్ ఎస్టేట్ క‌న్స‌ల్టింగ్ కంపెనీ అన‌రాక్ గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. దేశంలోని ఏడు ప్ర‌ధాన న‌గ‌రాల్లో 59 గృహ‌లైతే రూ.4794 కోట్ల‌కి అమ్ముడు పోయాయ‌ట‌. అంటే ఒక్కో ఇల్లు స‌గ‌టు ధ‌ర 81 ల‌క్ష‌ల‌కు పైబ‌డే ఉంది.  ఆ 59 ఇళ్ల‌లో 53 అపార్ట్‌మెంట్లు కాగా మిగిలిన ఆరు విల్లాల‌ని అన‌రాక్  తాజా నివేదిక‌లో తెలిపింది. ఒక ప‌క్క ఇళ్ల ధ‌ర‌లు అనూహ్యంగా పెరిగిపోతున్నా ఈ ఏడు న‌గ‌రాల్లోనూ అల్ట్రా ల‌గ్జ‌రీ గృహాల కొనుగోలుకు జ‌నం ప‌రుగులు తీశార‌ని  తెలియ‌చేసింది. ఆ ఏడు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌, ముంబై మెట్రోపాలిట‌న్ రీజిన్‌, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, పూణె, చెన్నై, కోల్క‌తా ఉన్నాయి. డీల్స్ సంఖ్య‌, వాటి అమ్మ‌క‌పు విలువ రెండూ ముందు సంవ‌త్స‌రంతో పోల్చితే గ‌ణ‌నీయంగా పెర‌గ‌డాన్ని బ‌ట్టి వాటికి ఎంత‌గా డిమాండు ఉన్న‌ది అర్ధం అవుతుంద‌ని అన‌రాక్ చైర్మ‌న్ అనుజ్ పురి అన్నారు. ఏడు న‌గ‌రాల్లో అమ్ముడుపోయిన 59 అల్ర్టా ల‌గ్జ‌రీ ఇళ్లలో 52 ఇళ్లు ఒక్క ముంబైలోనే అమ్ముడుపోయాయి. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో మూడు ఇళ్లు అమ్ముడుపోగా బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ల‌లో రెండేసి డీల్స్  చోటు చేసుకున్నాయి.  అప‌ర కుబేరులు, కుబేరులు వ్య‌క్తిగ‌త వినియోగం, పెట్టుబ‌డి అవ‌స‌రాల‌కి లేదా రెండింటి కోసం ఈ ఇళ్లు కొనుగోలు చేశారు. సంఖ్యాప‌రంగా చూస్తే 2023 సంవ‌త్స‌రంతో పోల్చితే అమ్ముడుపోయిన గృహాల సంఖ్య కేవ‌లం ఒక్క‌టి ఎక్కువ‌గా ఉంది. కాని విలువ మాత్రం 17 శాతం పెరిగింది అని పురి చెప్పారు. 

No comments:

Post a Comment

కుంభ‌మేళాలో ఆర్తి సంగ్ర‌హ్ ఉచిత పంపిణీ

చేతులు క‌లిపిన అదానీ గ్రూప్‌, గీతా ప్రెస్‌ గీతా ప్రెస్ స‌హ‌కారంలో అదానీ గ్రూప్ కుంభ‌మేళాలో "ఆర్తి సంగ్ర‌హ్" ప్ర‌తుల‌ని భ‌క్తుల‌కి ...