చేతులు కలిపిన అదానీ గ్రూప్, గీతా ప్రెస్
గీతా ప్రెస్ సహకారంలో అదానీ గ్రూప్ కుంభమేళాలో "ఆర్తి సంగ్రహ్" ప్రతులని భక్తులకి ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇది గీతా ప్రెస్ ప్రచురించిన ఆధ్యాత్మిక మంత్రాలు, ఆరతుల సంగ్రహం. "సనాతన్ సాహిత్య సేవ"లో భాగంగా ఈ పుస్తకాల పంపిణీ జరుగుతుంది. భారత సంస్కృతిని సంరక్షించి, ప్రోత్సహించి, వ్యాప్తి చేయడానికి అంకితమైన గీతా ప్రెస్ ప్రతినిధులు శుక్రవారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు. "భారత సంస్కృతి, మత విశ్వాసాలకు సంబంధించిన అతి పెద్ద యజ్ఞం మహా కుంభ్. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థ గీతా ప్రెస్‌తో కలిసి ఈ మహాయజ్ఞంలో భాగస్వామి కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో భాగంగా మహాకుంభ్‌కు వస్తున్న భక్తులకు కోటి ఆర్తి సంగ్రహ్ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయనున్నాం" అని అదానీ ఒక ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. నిస్వార్ధ సేవ, మతం, సంస్కృతి పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించడం కూడా ఒక రకమైన దేశభక్తిగానే భావించాలని; అందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. "సేవయే ధ్యానం, సేవయే ప్రార్థన, సేవయే భగవంతుడు" అని ఆయన వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మ సేవకు కట్టుబడిన గీతా ప్రెస్ 2023 సంవత్సరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పవిత్రమైన ఆలోచనా ధోరణితో పని చేసే ప్రతీ సంస్థను తాము గౌరవిస్తామని, అందుకే అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని గీతా ప్రెస్ ప్రతినిధులన్నారు. "సనాతన స్ఫూర్తితో గౌతమ్ అదానీ ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రయాణంలో భాగస్వామి కావడం అత్యంత ఆనందదాయకం. దీర్ఘకాలిక సహకారం, సమన్వయం, విశ్వాసంతో చేపట్టిన ఈ కార్యక్రమం సనాతన ధర్మ వ్యాప్తి, ప్రచారంలోను; విశ్వగురు భారత్ నిర్మాణంలోను ఎంతో కీలకంగా నిలుస్తుందన్న విశ్వాసం గీతా ప్రెస్‌కుంది" అని గీతా ప్రెస్ ప్రధాన కార్యదర్శి నీల్‌రతన్ చంద్గోతియా అన్నారు. అదానీని కలిసిన వారిలో గీతా ప్రెస్ ట్రస్టీ దేవీ దయాళ్ అగర్వాల్, ట్రస్ట్ బోర్డు సభ్యుడు రామ్ నాయక్ చందక్, మేనేజర్ మణి తివారీ, ఆచార్య సంజయ్ తివారీ ఉన్నారు.
No comments:
Post a Comment