Thursday, January 9, 2025

కుంభ‌మేళాలో అదానీ, ఇస్కాన్ "మ‌హాప్ర‌సాద సేవ‌"

ప్ర‌
యాగ్‌రాజ్‌లో వచ్చే సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న కుంభ‌మేళాలో భ‌క్తుల‌కు  మ‌హాప్ర‌సాద సేవ నిర్వ‌హించేందుకు ప్ర‌ముఖ పారిశ్రామిక గ్రూప్ అదానీ, ఇస్కాన్ చేతులు క‌లిపాయి. కుంభ‌మేళా జ‌రిగే కాలం జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ వ‌ర‌కు అన్ని రోజులూ ఈ మ‌హాప్ర‌సాద సేవ నిరంత‌రాయంగా నిర్వ‌హిస్తారు. అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ గురువారం ఇస్కాన్ పాల‌క మండ‌లి (జిబిసి) చైర్మ‌న్ గురుప్ర‌సాద్ స్వామితో స‌మావేశ‌మ‌య్యారు.  కుంభ‌మేళా అనేది సేవ చేసేందుకు ఒక ప‌విత్ర స్థ‌లం. "ప్ర‌తీ భ‌క్తుడు కూడా భ‌గ‌వంతుని సేవ‌లో పాల్గొని త‌రిస్తూ ఉంటాడు. అలాంటి భ‌క్తుల కోసం ఇస్కాన్‌తో క‌లిసి మ‌హాప్ర‌సాద సేవ ప్రారంభించ‌డం నా అదృష్టం" అని అదానీ అన్నారు. అన్న‌పూర్ణాదేవి ఆశీస్సుల‌తో ల‌క్ష‌లాది మందికి ఈ స‌మ‌యంలో ఉచితంగా ఆహారం అందిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. త‌న దృష్టిలో సేవ అనేది దేశ‌భ‌క్తికి అత్యున్న‌త రూప‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ కాలంలో  50 ల‌క్ష‌ల మంది పైగా భ‌క్తుల‌కు ఆహారం అంద‌చేస్తారు. ఆహారాన్ని కుంభ‌మేళా జ‌రిగే ప్రాంతంలోను, వెలుప‌ల ఏర్పాటు చేసిన రెండు వంట‌శాల‌ల్లో త‌యారుచేస్తారు.  40కి పైగా ప్ర‌దేశాల్లో ఆహారం పంపిణీ చేస్తారు. 2500 మంది పైగా వ‌లంటీర్లు ఆహారం పంపిణీలో పాల్గొంటారు. ఇక అంగ‌విక‌లురు, వృద్ధులు, పిల్ల‌ల త‌ల్లుల కోసం గోల్ఫ్  కార్ట్‌లు ఏర్పాటు చేయ‌నున్నారు. గీతా సార్ ఐదు ల‌క్ష‌ల కాపీలు కూడా పంపిణీ చేస్తారు.
"అదానీ గ్రూప్ అనేది కార్పొరేట్ సామాజిక బాధ్య‌త‌లు, సామాజిక సేవ‌కు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. గౌత‌మ్ అదానీ విన‌మ్ర‌త‌కు మారుపేరు. నిస్వార్ధ సేవ అందించే విష‌యంలో ముంద‌డుగేసేందుకు ఎవ‌రి ఆహ్వానం కోస‌మో ఎదురు చూసే మ‌నిషి కాదు. ఆయ‌న అందిస్తున్న స‌హాయానికి నేనెంతో ఆనందిస్తున్నాను. త‌న‌ను ఈ స్థాయికి తెచ్చిన స‌మాజానికి తిరిగి ఇవ్వాల‌న్న ఆయ‌న అంకిత భావం అంద‌రికీ స్ఫూర్తిదాయ‌కం". అని స్వామీజీ అన్నారు. 

No comments:

Post a Comment

కుంభ‌మేళాలో ఆర్తి సంగ్ర‌హ్ ఉచిత పంపిణీ

చేతులు క‌లిపిన అదానీ గ్రూప్‌, గీతా ప్రెస్‌ గీతా ప్రెస్ స‌హ‌కారంలో అదానీ గ్రూప్ కుంభ‌మేళాలో "ఆర్తి సంగ్ర‌హ్" ప్ర‌తుల‌ని భ‌క్తుల‌కి ...