Thursday, January 2, 2025

మార్కెట్ ప‌రుగు

నూత‌న సంవ‌త్స‌రానికి శుభారంభం ప‌లికిన సెన్సెక్స్ రెండో రోజు మ‌రింత మెరుగైన ర్యాలీని సాధించింది. ఫైనాన్షియ‌ల్‌, ఆటో, ఐటి రంగ షేర్ల‌లో జ‌రిగిన కొనుగోళ్ల‌తో పాటు సానుకూల ఆర్థిక సంకేతాలు మార్కెట్‌ను ప‌రుగులు తీయించాయి. ఇంట్రాడేలో 1525.46 పాయింట్లు లాభ‌ప‌డి 80,032.87 స్థాయికి చేరిన సెన్సెక్స్ చివ‌రికి 1436.30 పాయింట్ల లాభంతో 79,943.71 వ‌ద్ద ముగిసింది. నెల రోజుల కాలంలో ఒక్క రోజులో సెన్సెక్స్ సాధించిన పెద్ద లాభం ఇదే. నిఫ్టీ 445.75 పాయింట్లు లాభ‌ప‌డి 24,188,65 వ‌ద్ద ముగిసింది. రెండేళ్ల ర్యాలీలో స్టాక్ మార్కెట్ సంప‌ద రూ.8,52,239.27 కోట్లు పుంజుకుని రూ.4,50,47,345.71 కోట్ల‌కు (5.25 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు) చేరింది. గ‌త రెండు వారాల్లో మార్కెట్ క్రిస్మ‌స్ ర్యాలీ సాధించ‌డంలో విఫ‌ల‌మైనా నూత‌న సంవ‌త్స‌రం మాత్రం అత్యంత ప్రోత్సాహ‌క‌రంగా ప్రారంభ‌మ‌యింది. 

సెన్సెక్స్‌లోని 30 షేర్ల‌లో బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ 8 శాతం, బ‌జాజ్ ఫైనాన్స్ 6 శాతం లాభంతో టాప్ 5లో ఉన్నాయి. భారీగా లాభ‌ప‌డిన షేర్ల‌లో మారుతి, టైట‌న్‌, మ‌హీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్ టెక్‌, జొమాటో, అల్ర్టాటెక్‌, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ ఉన్నాయి. స‌న్ ఫార్మా ఒక్క‌టే న‌ష్ట‌పోయింది. బిఎస్ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్  కూడా లాభ‌ప‌డ్డాయి.

No comments:

Post a Comment

మార్కెట్ ప‌రుగు

నూత‌న సంవ‌త్స‌రానికి శుభారంభం ప‌లికిన సెన్సెక్స్ రెండో రోజు మ‌రింత మెరుగైన ర్యాలీని సాధించింది. ఫైనాన్షియ‌ల్‌, ఆటో, ఐటి రంగ షేర్ల‌లో జ‌రిగిన...