Monday, January 6, 2025

ఈ వారంలో 24300 పైన బుల్లిష్

జనవరి 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   


నిఫ్టీ   :  24005 (+192
) 
   
గత వారంలో నిఫ్టీ 24226 - 23460 పాయింట్ల మధ్యన కదలాడి 192 పాయింట్ల లాభంతో 24005 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 24300  కన్నా  పైన  ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 23948, 23821, 23959, 24189 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 24300      బ్రేక్ డౌన్ స్థాయి : 23600

నిరోధ స్థాయిలు : 24200, 24300, 24400 (24100 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 23800, 23700, 23600 (23900 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
ü  మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 3 నుంచి వృషభంలోని  రోహిణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
ü  ధనుస్సులోని  పూర్వాషాఢ పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü   ధనుస్సులోని  మూల పాదం 1-3  మధ్యలో  బుధ సంచారం
ü కుంభంలోని శతభిషం పాదం 1-3  మధ్యలో శుక్ర సంచారం
ü కర్కాటకంలోని  పుష్యమి పాదం 1లో వక్రగతిలో కుజ సంచారం
ü వృషభంలోని  రోహిణి పాదం 3లో మిథున నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1లో మేష నవాంశలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 2లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం     

--------------------------------- 

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

కుంభ‌మేళాలో ఆర్తి సంగ్ర‌హ్ ఉచిత పంపిణీ

చేతులు క‌లిపిన అదానీ గ్రూప్‌, గీతా ప్రెస్‌ గీతా ప్రెస్ స‌హ‌కారంలో అదానీ గ్రూప్ కుంభ‌మేళాలో "ఆర్తి సంగ్ర‌హ్" ప్ర‌తుల‌ని భ‌క్తుల‌కి ...