ఆ నివేదికలోని ముఖ్యాంశాలు
- భారత కన్స్యూమర్ ఎలక్ర్టికల్స్ పరిశ్రమ 2030 నాటికి 185 కోట్ల డాలర్లకు (రూ.16,280 కోట్లు) చేరవచ్చు.
- ఇంధన సామర్థ్యం గల ఉత్పత్తుల వినియోగ ధోరణులు, విధానపరమైన మద్దతు ఈ మద్దతును కొనసాగిస్తుంది. ప్రధానంగా రెసిడెన్షియల్ వైర్లు, కేబుళ్లు, ఫ్యాన్లు, లైటింగ్, స్విచ్లు, ఫ్యూజ్లు, స్విచ్ గేర్లు ఇందులో ఉన్నాయి.
వివిధ విభాగాల వృద్ధి అంచనాలు...
- కన్స్యూమర్ ఎలక్ర్టికల్స్ పరిశ్రమలో బ్రాండెడ్ ఉత్పత్తుల వాటా 2023లో 76% ఉండగా 2027 నాటికి 82 శాతానికి చేరుతుందని అంచనా.
- హోమ్ ఫర్నిచర్, డెకార్ మార్కెట్ ప్రస్తుతం 3800 కోట్ల డాలర్లుండగా (రూ.3.34 లక్షల కోట్లు) 6200 కోట్ల డాలర్లకు (రూ.5.46 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా.
- సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ లాక్లు, డోర్ ఫోన్లు, డోర్బెల్ కెమెరాలు, మోషన్ సెన్సర్లు, ప్రమాదాలను నివారించే డివైస్లు వంటి హోమ్ సెక్యూరిటీ మార్కెట్ 2030 సంవత్సరం నాటికి 18% సగటు వార్షిక సమీకృత వృద్ధితో 440 కోట్ల డాలర్లకు (రూ.38,720 కోట్లు) చేరుతుందని అంచనా.
- పెయింట్లు, నిర్మాణ రంగంలో ఉపయోగించే రసాయనాల పరిశ్రమ 20230 నాటికి 153 కోట్ల డాలర్లకు (రూ.13,464 కోట్లు) చేరుతుందని అంచనా.
- సిరామిక్ టైల్స్, విట్రిఫైడ్/ పోర్సెక్లైన్ టైల్స్, వినైల్ ఫ్లోరింగ్, మార్బుల్స్ అండ్ రగ్స్ పరిశ్రమ కూడా ప్రస్తుతం 107 కోట్ల డాలర్ల (రూ.9,416 కోట్లు) నుంచి 162 కోట్ల డాలర్లకు (రూ.14,256 కోట్లు) చేరుతుందని అంచనా.