Tuesday, December 15, 2020

2021 చివ‌రికి సెన్సెక్స్ 50500

 బిఎన్ పి పారిబా అంచ‌నా



ఈక్విటీ మార్కెట్ల‌కు, వాస్తవ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య అనుసంధాన‌త పోయింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నప్ప‌టికీ 2021 సంవ‌త్సరం చివ‌రి నాటికి బిఎస్ఇ సెన్సెక్స్ 50500కి చేరగ‌ల‌ద‌ని బిఎన్ పి పారిబా అంచ‌నా వేసింది. భార‌త ఈక్విటీల‌కు ఓవ‌ర్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది. క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో ప్ర‌వేశించిన తొలి నెల‌ల్లో స్టాక్ ఇండెక్స్ లు 30 శాతం మేర‌కు ప‌త‌న‌మైన‌ప్ప‌టికీ ఏప్రిల్ లో మార్కెట్ల‌లో పున‌రుజ్జీవం అనంత‌రం 70 శాతం మేర‌కు దూసుకుపోయాయి. అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో నెల‌కొన్న "అధిక లిక్విడిటీ ", వృద్ధి అవ‌కాశాలు మెరుగ్గా ఉన్న మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఇన్వెస్ట‌ర్ల ప‌రుగులు ఈ ర్యాలీకి కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌కులు విశ్లేషించారు. అయితే కొన్ని షేర్ల వైపే అంద‌రూ ప‌రుగులు తీస్తూ ఉండ‌డం ఆందోళ‌న‌క‌ర‌మైన అంశ‌మ‌ని కొంద‌రు విమ‌ర్శ‌కులంటున్నారు. 

"షేర్ల ఎంపిక వ‌ర‌కు వ‌స్తే రెండు అంశాలు ప్ర‌ధానం. పెద్ద షేర్ల వాటా అధికంగా ఉండడం, ఆసియా దేశాల‌తో పోల్చితే భార‌త ఈక్విటీల్లో నాణ్య‌త గ‌ల షేర్లు అధికంగా ఉండ‌డం" అని బిఎన్ పి పారిబా విశ్లేష‌కులు తెలిపారు. "భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో త్వ‌రిత రిక‌వ‌రీ క‌నిపిస్తోంది. ఆటో అమ్మ‌కాలు, ఉక్కు, సిమెంట్ వినియోగం, రైల్వే స‌ర‌కు ర‌వాణా అన్నీ క‌రోనా ముందు కాలం నాటికి చేర‌డం భార‌త్ కు క‌లిసి వ‌చ్చే అంశం. కొన్ని ప్రాంతాల్లో విచ‌క్ష‌ణాత్మ‌క వ్య‌యాలు పెరుగుతున్నాయి. రిటైల్ డిమాండు పెరిగిన‌ట్టు కూడా త‌యారీ సంస్థ‌లు తెలుపుతున్నాయి. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ మార్కెట్ చ‌ట్టాలు, కార్మిక చ‌ట్టాలు, 10 రంగాల‌కు ఉత్ప‌త్తి అనుసంధానిత ప్రోత్సాహ‌కాల ప‌థ‌కం వంటివి వ్య‌వ‌సాయ రంగాన్ని, ఎగుమ‌తి అవ‌కాశాలు అధికంగా ఉన్న రంగాల్లోకి పెట్టుబ‌డుల‌ను ఉత్తేజితం చేయ‌డానికి ఉద్దేశించిన‌వే. ఇవ‌న్నీ దీర్ఘ‌కాలం పాటు ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు స‌హాయ‌ప‌డే అంశాలే" అని ఆ నివేదిక తెలిపింది.


స‌వాళ్లివే...

ఈ వృద్ధిలో స్థిర‌త్వం ఒక పెద్ద స‌వాల‌ని బిఎన్ పి పారిబా తెలిపింది. ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల ఆదాయాల్లో కొన‌సాగుతున్న స్త‌బ్ధ‌త‌, దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగుతున్న అధిక ద్ర‌వ్యోల్బ‌ణం, ప్ర‌శ్నార్థ‌కంగా ఉన్న బ్యాంకుల ఆస్తుల నాణ్య‌త‌, ప‌ట్ట‌ణ నిరుద్యోగిత వంటి అంశాల‌న్నీ ఆందోళ‌న క‌లిగించే అంశాల‌ని స్ప‌ష్టం చేసింది. ప‌ట్ట‌ణాదాయాలు, పెట్టుబ‌డుల‌కు మ‌ద్ద‌తు ల‌భించాలంటే త‌క్కువ సామ‌ర్థ్య వినియోగం పెర‌గాల‌ని తెలిపింది. 

------------------------------------------------ 


మార్కెట్లో కొన‌సాగిన ర్యాలీ

స్టాక్ మార్కెట్లో ర్యాలీ నిర్నిరోధంగా కొన‌సాగుతోంది. ఈక్విటీ ఇండెక్స్ లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శిఖ‌రాల‌ను చేరుతూనే ఉన్నాయి. మంగ‌ళ‌వారంనాడు కూడా ఈక్విటీ సూచీలు కొత్త గ‌రిష్ఠ స్థాయిల‌ను న‌మోదు చేశాయి. రూపాయి బ‌ల‌హీన‌త‌, లాభాల స్వీకారం కార‌ణంగా ఒక ద‌శ‌లో ఇండెక్స్ లు ప్రారంభ లాభాల‌ను పోగొట్టుకున్నా ఫైనాన్స్, మెట‌ల్ స్టాక్ లు అద్భుతంగా లాభ‌ప‌డ‌డంతో ఇండెక్స్ లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 9.71 పాయింట్ల లాభంతో 46263.17 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 9.70 పాయింట్ల లాభంతో 13567.85 వ‌ద్ద ముగిసింది. ఈ రెండూ కొత్త గ‌రిష్ఠ స్థాయిలే. 

సూచీలు న‌మోదు చేసిన ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయిలు...

సెన్సెక్స్ - 46373.34  (డిసెంబ‌ర్ 14)

నిఫ్టీ - 13597.50 (డిసెంబ‌ర్ 14)


Sunday, November 29, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

12675 దిగువన బేరిష్  


(నవంబర్ 30-డిసెంబర్ 4, 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  12969 (+110)

గత వారంలో నిఫ్టీ 13146-12790 పాయింట్ల మధ్యన కదలాడి 110 పాయింట్ల లాభంతో 12969 వద్ద పాజిటివ్ గా ముగిసింది. ఈ వారంతంలో 12675 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 12302, 11975, 11003, 10749 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 13275      బ్రేక్ డౌన్ స్థాయి : 12675

నిరోధ స్థాయిలు : 13125, 13200, 13275 (13050 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 12825, 12750, 12675 (12900 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------      

గ్రహగతులివే...    

      

- వృషభంలోని మృగశిర పాదం 1 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం


-  వృశ్చికంలోని అనురాధ పాదం 4 - జ్యేష్ఠ పాదం 1 మధ్యలో రవి సంచారం 


- వృశ్చికంలోని అనురాధ పాదం 1-2 మధ్యలో బుధ సంచారం 

- తులలోని స్వాతి పాదం 2 - విశాఖ పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 

- మీనంలోని రేవతి పాదం 2-3 మధ్యలో కుజ సంచారం
 
- మకరంలోని  ఉత్తరాషాఢ పాదం 2 మధ్యలో మకర నవాంశలో బృహస్పతి సంచారం   

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 3  లో కుంభ నవాంశలో శని సంచారం

- వృషభంలోని మృగశిర పాదం 2లో రాహువు, వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 
--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి) 

తిథి :  నిజ కార్తీక బహుళ పాడ్యమి   

నక్షత్రం : మృగశిర 

అప్రమత్తం :  పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; మిథున, తుల  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  12968.95      (+18.05)   

ట్రెండ్ మార్పు సమయం :  1.22

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.50 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 12.35 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.05 వరకు నిలకడగా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.50 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.35   సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  2.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 13050, 13125        మద్దతు : 12900, 12825
----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Friday, November 27, 2020

టెక్నిక‌ల్ తిరోగ‌మ‌నంలో భార‌త్‌

- అంచ‌నాల‌ను మించి రిక‌వ‌రీ

- రెండో త్రైమాసికం క్షీణ‌త -7.5%



భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఊహించిన స‌మ‌యం క‌న్నా వేగంగానే రిక‌వ‌రీ సాధించింది. జూలై-సెప్టెంబ‌ర్ (క్యు2) త్రైమాసికంలో -7.5 శాతం ప్ర‌తికూల వృద్ధిని న‌మోదు చేసింది. కేంద్ర గ‌ణాంకాల సంస్థ (సిఎస్ఓ) ప్ర‌క‌టించిన తాజా గ‌ణాంకాలు ఈ అంశం వెల్ల‌డిస్తున్నాయి. వ‌ర్త‌మాన ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) క‌రోనా మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డానికి విస్తృతంగా అమ‌లుప‌రిచిన జాతీయ స్థాయి లాక్ డౌన్ ప్ర‌భావం వ‌ల్ల జిడిపి -23.9 శాతం క్షీణ‌త‌ను న‌మోదు చేసింది. జూన్ నుంచి లాక్ డౌన్లు క్ర‌మంగా స‌డ‌లిస్తూ రావ‌డంతో రెండో త్రైమాసికంలో ఈ క్షీణ‌త -7.5 శాతానికి త‌గ్గింది. అయినా వ‌రుస‌గా రెండో త్రైమాసికంలో కూడా ప్ర‌తికూల వృద్ధి న‌మోదు కావ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ సాంకేతిక తిరోగ‌మ‌నంలో ప్ర‌వేశించింది. గ‌త ఏడాది రెండో త్రైమాసికంలో 4.4 శాతం వృద్ధి న‌మోద‌యింది. ప్ర‌భుత్వ వ్య‌యాలు 12 శాతం త‌గ్గాయి.  ఇదే తేదీతో ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్ధంలో వృద్ధి క్షీణ‌త -15.7 శాతం ఉంది.

త్రైమాసికంలో వివిధ విభాగాల వృద్ధి

- త‌యారీ రంగం ఆశ్చ‌ర్య‌క‌రంగా 0.6 శాతం వృద్ధిని న‌మోదు చేసింది. మొద‌టి త్రైమాసికంలో త‌యారీ రంగం 39 శాతం ప్ర‌తికూల వృద్ధిని న‌మోదు చేసింది. 

- ప్రోత్సాహ‌క‌ర‌మైన రుతుప‌వ‌నాల ప్ర‌భావం వ‌ల్ల‌ వ్య‌వ‌సాయ రంగం 3.4 శాతం వృద్ధి సాధించింది. విద్యుత్‌, గ్యాస్ రంగాలు 4.4 శాతం వృద్ధిని న‌మోదు చేశాయి. 

- ఆర్థిక‌, రియ‌ల్ ఎస్టేట్ రంగాలు 8.1 శాతం క్షీణ‌త‌ను న‌మోదు చేయ‌గా వాణిజ్యం, హోట‌ళ్లు, ర‌వాణా, క‌మ్యూనికేష‌న్ రంగాలు 15.6 శాతం క్షీణించాయి.

- ఉపాధి క‌ల్ప‌న‌లో రెండో స్థానంలో ఉన్న నిర్మాణ‌రంగం వృద్ధి -8.6 శాతం ఉంది. క్యు1లో న‌మోదైన ప్ర‌తికూల వృద్ధి -50 శాతం నుంచి కోలుకుంది.  

- స్థిర ధ‌ర‌ల కింద 2020-21 రెండో త్రైమాసికం జిడిపి వాస్త‌విక విలువ రూ.33.14 ల‌క్ష‌ల కోట్లుంది. గ‌త ఏడాది రెండో త్రైమాసికంలో ఇది రూ.35.84 ల‌క్ష‌ల కోట్లు.

Thursday, November 19, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ముగింపు సెషన్ మెరుగు  


తిథి :  నిజ కార్తీక శుక్ల షష్ఠి     

నక్షత్రం : శ్రవణం   

అప్రమత్తం :  పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  12771.70      (-166.55)   

ట్రెండ్ మార్పు సమయం :  9.20; 3.23

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.40 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 12.40 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.45 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2.15   సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  2.25 తర్వాత ఎటిపి కన్నాపైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3.25 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 12850, 12925        మద్దతు : 12700, 12625
----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Wednesday, November 18, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభ సెషన్ మెరుగు  


తిథి :  నిజ కార్తీక శుక్ల పంచమి    

నక్షత్రం : ఉత్తరాషాఢ  

అప్రమత్తం :  ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; మకర, వృషభ  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  12938.25      (+64.05)   

ట్రెండ్ మార్పు సమయం :  9.36

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.10 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 1.50 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.15 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో  లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.45   సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  2.15 తర్వాత ఎటిపి కన్నాదిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని 3.15 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 13010, 13075        మద్దతు : 12850, 12785
----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, November 17, 2020

మ‌రో కొత్త శిఖ‌రాలు

కొత్త సంవ‌త్స‌రానికి శుభ స్వాగ‌తం


భార‌త స్టాక్ మార్కెట్ కొత్త హిందూ సంవ‌త్స‌రం మొద‌టి సెష‌న్ లో స‌రికొత్త గ‌రిష్ఠ స్థాయిలు న‌మోదు చేసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్, మెట‌ల్ స్టాక్ లు ర్యాలీకి ఉత్తేజం ఇచ్చాయి.  కోవిడ్‌-19కి వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడెర్నా ప్ర‌క‌టించ‌డం ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ ను బ‌ల‌ప‌రిచింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బ‌ల‌ప‌డ‌డం కూడా మార్కెట్ కు ఉత్తేజం ఇచ్చింది. రోజులో సెన్సెక్స్ 44161.16 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిని తాకి చివ‌రికి 314.73 పాయింట్ల లాభంతో 43952.71 వ‌ద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 43952.71 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిని తాకి 93.95 పాయింట్ల లాభంతో 12874.20 వ‌ద్ద క్లోజ‌యింది. 

- 6.24 శాతం లాభంతో టాటా స్టీల్ లాభ‌ప‌డిన షేర్ల‌లో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా ఎస్ ‌బిఐ, హెచ్ డిఎఫ్ సి ద్వ‌యం‌, బ‌జాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్‌, ఎల్ అండ్ టి, మారుతి, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. ఎన్ టిపిసి, హెచ్ సిఎల్ టెక్‌, ఒఎన్ జిసి, ఇన్ఫోసిస్ ఐటిసి, ప‌వ‌ర్ గ్రిడ్‌, హెచ్ యుఎల్ న‌ష్టాల్లో ముగిశాయి. 

- రంగాల‌వారీగా బిఎస్ఇ ఇండ‌స్ర్టియ‌ల్స్ ఇండెక్స్ 2.27 శాతం లాభ‌ప‌డింది. మెట‌ల్‌, కాపిట‌ల్ గూడ్స్, ఫైనాన్స్, బ్యాంకెక్స్, రియ‌ల్టీ సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. ఇందుకు భిన్నంగా ఆయిల్ అండ్ గ్యాస్‌, హెల్త్ కేర్‌, టెక్నాల‌జీ, ఐటి, ఎన‌ర్జీ, ఎఫ్ఎంసిజి న‌ష్టాల్లో ముగిశాయి. 

----------------------------------- 


ఇంట్రాడే గ‌‌రిష్ఠ స్థాయిలు

సెన్సెక్స్ - 44161.16

నిఫ్టీ - 12934.05

ముగింపు గ‌రిష్ఠ స్థాయిలు 

సెన్సెక్స్ - 43952.71

నిఫ్టీ - 12874.20

-------------------------------------

ఈ వారం అంత‌ర్జాతీయ మార్కెట్లు శుభారంభాన్నిచ్చాయి. దీనికి తోడు క‌రోనా మ‌హ‌మ్మారిని తుద‌ముట్టించేందుకు మ‌రో వ్యాక్సిన్ విజ‌య‌వంతంగా పురోగ‌మిస్తోంద‌న్న వార్త‌లు ఇన్వెస్ట‌ర్ల‌లో ఉత్సాహం నింపాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా భ‌యాలు ఇంకా స‌మ‌సిపోలేదు. ఈ ప‌రిస్థితిలో ఇన్వెస్ట‌ర్లు స్వ‌ల్ప‌కాలానికి లాభాలు స్వీక‌రించ‌డ‌మే మంచిది. 

- వినోద్ నాయ‌ర్‌, జియోజిత్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ మెరుగు  


తిథి :  నిజ కార్తీక శుక్ల చతుర్థి    

నక్షత్రం : మూల/పూర్వాషాఢ 

అప్రమత్తం :   మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర; మకర, వృషభ  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  12934.05      (+93.95)   

ట్రెండ్ మార్పు సమయం :  10.37

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 12.20 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 2 గంటల వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.15   సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  12.30 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3.15 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 12950, 13000        మద్దతు : 12800, 12725
----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, November 15, 2020

సంవత్ 2077 ఎలా ఉంటుంది... ?

 శనివారం దీపావళి పర్వ దినాన సంవత్ 2077 ప్రారంభం అయింది.  హిందూ క్యాలెండర్  ప్రకారం విశిష్టమైనదిగా భావించే సంవత్ ప్రారంభం రోజున ప్రతి ఏడాది సాయంత్రం ఒక గంట సేపు సాంప్రదాయకంగా మూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈ ఏడాది సంవత్ మార్కెట్ కు శుభారంభాన్నే అందించింది. అయితే కొత్త  సంవత్  ఎలా ఉండబోతోంది అనే అంశం గ్రహగతులు, టెక్నికల్స్ ఆధారంగా పరిశీలిద్దాం. 


సూర్య చంద్రులు ధనుర్లగ్నంలో 11 వ ఇంటిలో ఉండగా సంవత్ ప్రారంభం అయింది. బుధుడు, చంద్రుడు 11 వ ఇంట తులా రాశి సమాచారంలో ఉన్నారు. శుక్రుడు 11 వ ఇంట కన్యలోను, బుధుడు ధనుస్సులో ఉచ్ఛ దశలోను, కుజుడు 4 వ ఇంట మీన రాశిలోను, రాహువు 6వ ఇంట తులా సంచారంలోను ఉన్నారు. 

ఈ గ్రహగతులను బట్టి ఈ దిగువన సూచించిన తేదీల్లో ఆటుపోట్ల తో ట్రేడింగ్ సాగవచ్చు.

నవంబర్ 30;  2021 మార్చి 16; ఏప్రిల్ 6; జూన్ 4, 22; జులై 21; ఆగస్ట్  8; అక్టోబర్ 3

కీలక తేదీలు 

2021 మార్చి 11; ఏప్రిల్ 14, 21, 25; జులై 7, 22, 29; ఆగస్ట్ 2; అక్టోబర్ 1, 12; నవంబర్ 10, 19

నిరోధ స్థాయిలు :  13000, 13500, 14250, 15000, 16000

మద్దతు స్థాయిలు :  12500, 12000, 11250, 10250, 9250

కోవిడ్ వాక్సిన్ కు సంబంధించిన పరిణామాలతో పాటుఅంతర్జాతీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడులు, ప్రభుత్వ విధానాలు-సంస్కరణలు, ఆర్ బిఐ ద్రవ్య విధానం, వ్యాపార వాతావరణం, కరెన్సీ ఆటుపోట్లు వంటివన్నీ ఇటు మార్కెట్ కదలికల పైన, అటు ఆర్ధిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయి. 

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

12450 దిగువన బేరిష్  


(నవంబర్ 16-20, 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  12720 (+456)

గత వారంలో నిఫ్టీ 12384-12770 పాయింట్ల మధ్యన కదలాడి 456 పాయింట్ల లాభంతో 12720 వద్ద పాజిటివ్ గా ముగిసింది. ఈ వారంతంలో 12450 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 11688, 11582, 10621, 10694 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నాపైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 13000      బ్రేక్ డౌన్ స్థాయి : 12450

నిరోధ స్థాయిలు : 12875, 12950, 13025 (12800 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 12600, 12525, 12450 (12675 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------      

గ్రహగతులివే...         

- వృశ్చికంలోని అనురాధ పాదం 4 నుంచి మకరంలోని శ్రవణం పాదం 2 మధ్యలో చంద్ర సంచారం


-  వృశ్చికంలోని విశాఖ పాదం 4 నుంచి అనురాధ పాదం 1 మధ్యలో రవి సంచారం 


- తులలోని స్వాతి పాదం 2-4 మధ్యలో వక్రగతిలో బుధ సంచారం 

- కన్యలోని చిత్త పాదం 2 - తులలోని చిత్త పాదం 4 మధ్యలో శుక్ర సంచారం 

- మీనంలోని రేవతి పాదం 2-4 మధ్యలో కుజ సంచారం
 
- ధనుస్సులోని ఉత్తరాషాఢ పాదం 1-2 మధ్యలో మకర నవాంశలో బృహస్పతి సంచారం   

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2-3 మధ్యలో మకర నవాంశలో శని సంచారం

- వృషభంలోని మృగశిర పాదం 2లో రాహువు, వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 
--------------------------------- 

ముగింపు సెషన్ మెరుగు  (సోమవారానికి) 

తిథి :  నిజ కార్తీక శుక్ల పాడ్యమి   

నక్షత్రం : అనురాధ, జ్యేష్ఠ 

అప్రమత్తం :  భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; ధనుస్సు, మేష  రాశి జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం :  2.34

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.25 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 12.20 గంటల వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2 గంటల వరకు నిస్తేజంగా ఉండి తదుపరి చివరి వరకు కోలుకునే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.25 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 1.45   సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  2 గంటల తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 3.30 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 12800, 12850        మద్దతు : 12600, 12575
----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Saturday, November 14, 2020

కొత్త సంవ‌త్ కు శుభారంభం

మూర‌త్ సెష‌న్ లో రెట్టించిన ఉత్సాహం

స‌రికొత్త గ‌రిష్ఠ స్థాయిల్లో ముగిసిన సూచీలు


దేశీయ స్టాక్ మార్కెట్ కొత్త హిందూ సంవ‌త్స‌రం సంవ‌త్ 2077కి శుభారంభం ప‌లికింది. దీపావ‌ళి ప‌ర్వ‌దినాన గంట సేపు జ‌రిగిన ప్ర‌త్యేక ట్రేడింగ్ లో ఇండెక్స్ లు స‌రికొత్త గ‌రిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. గంట వ్య‌వ‌ధిలోనే సెన్సెక్స్ 388 పాయింట్లు పెరిగి జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 43,831 వ‌ద్ద‌,  నిఫ్టీ 12,829 పాయింట్ల‌ను తాకాయి. చివ‌రికి సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 43,638, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 12,780 పాయింట్ల వ‌ద్ద ముగిశాయి. 


2019 దీపావ‌ళి ప‌ర్వ‌దినాన జ‌రిగిన మూర‌త్ ట్రేడింగ్ నుంచి సంవ‌త్ 2076 ముగింపు వ‌ర‌కు సెన్సెక్స్ 4383.94 పాయింట్లు, నిఫ్టీ 1136 పాయింట్లు లాభ‌పడిన విష‌యం విదిత‌మే.


కొనుగోళ్ల జోరు

మూర‌త్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట‌ర్లు, ట్రేడ‌ర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లు జ‌రిపారు. ఎన్ఎస్ఇలో లిస్టింగ్ అయిన‌ మొత్తం 11 రంగాల్లోనూ కొనుగోళ్లు జ‌రిగాయి. నిఫ్టీ ఐటి ఇండెక్స్ 0.5 శాతం లాభ‌ప‌డ్డాయి. బ్యాంకింగ్‌, ఆటో, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసులు, ఎఫ్ఎంసిజి, రియాల్టీ విభాగాల్లో అద్భుతంగా కొనుగోళ్లు న‌మోద‌య్యాయి. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ షేర్లు మొత్తం లాభాల్లో అధిక వాటా సాధించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.40 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.70 శాతం లాభ‌ప‌డ్డాయి.  మొత్తం 1834 షేర్లు లాభాల‌తో ముగియ‌గా 614 షేర్లు న‌ష్టాల‌తో ముగిశాయి. 

- భార‌త్ పెట్రోలియం 4 శాతానికి పైగా లాభ‌ప‌డి అగ్ర‌స్థానంలో ఉంది. ఇండియ‌న్ ఆయిల్‌, టాటా మోటార్స్, హెచ్ డిఎఫ్ సి లైఫ్‌, స‌న్ ఫార్మా, కోల్ ఇండియా, గెయిల్‌, టాటా స్టీల్‌, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, భార‌తి ఎయిర్ టెల్‌, యుపిఎల్ లాభ‌ప‌డిన షేర్ల‌లో ఉన్నాయి. 

- హిండాల్కో, హీరో మోటో కార్ప్, హిండాల్కో, జెఎస్ డ‌బ్ల్యు స్టీల్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ‌జాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్స్, టైటాన్‌, యాక్సిస్ బ్యాంక్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ షేర్లు న‌ష్ట‌పోయాయి. 


Friday, November 13, 2020

సంవ‌త్ 2076 అద్భుతః


శుక్ర‌వారంతో ముగిసిన సంవ‌త్ 2076కి మార్కెట్లు శుభ‌వీడ్కోలు ప‌లికాయి. గ‌త ఏడాది సంవ‌త్ నుంచి ఈ రోజు వ‌ర‌కు స్టాక్ ఇండెక్స్ లు అద్భుత‌మైన లాభాలు సాధించాయి. గ‌త ఎనిమిది నెల‌లుగా క‌రోనా తీవ్ర క‌ల్లోలం సృష్టిస్తున్న‌ప్ప‌టికీ మార్కెట్ జోరు మాత్రం త‌గ్గ‌లేదు. అందులోనూ స్టాక్ సూచీలు గ‌త జ‌న‌వ‌రిలో సాధించిన గ‌రిష్ఠ స్థాయిల నుంచి భారీగా దిగ‌జారినా ఆ న‌ష్టాల‌న్నీ పూడ్చుకోవ‌డ‌మే కాకుండా ఏడాది ముగిసే స‌మ‌యానికి మంచి లాభాలు అందించ‌డం ఆశావ‌హం. గ‌త సంవ‌త్ నుంచి ఈ రో్జు వ‌ర‌కు సెన్సెక్స్ 11.22 శాతం అంటే 4384.94 పాయింట్లు లాభ‌ప‌డింది. నిఫ్టీ 9.80 పాయింట్లు అంటే 1136 పాయింట్లు లాభ‌ప‌డింది. శుక్ర‌వారం నాటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 85.81 పాయింట్లు లాభ‌ప‌డి 43,443 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 29.15 పాయింట్లు లాభ‌ప‌డి 12719.95 వ‌ద్ద ముగిసింది. ఇవే ఈ సంవ‌త్ ముగింపు స్థాయిలు. 

- న‌వంబ‌ర్ 11వ తేదీన సెన్సెక్స్ న‌మోదు చేసిన జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయి 43,593.67 పాయింట్లు, అదే రోజు న‌మోదైన ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 43,708.47 పాయింట్లు.

- నిఫ్టీ జీవిత కాల గ‌రిష్ఠ స్థాయి 12,749.15 పాయింట్లు. ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 12,769.75 పాయింట్లు.


రేపు సాయంత్రం  మూర‌‌త్ ట్రేడింగ్‌

హిందూ కాలెండ‌ర్ సంవ‌త్స‌రం సంవ‌త్ శుభారంభాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారం సాయంత్రం స్టాక్ మార్కెట్లో ఒక గంట మూర‌త్ ట్రేడింగ్ నిర్వ‌హించ‌నున్నారు. దీంతో సంవ‌త్ 2077కి మార్కెట్లు శ్రీ‌కారం చుడ‌తాయి.



Thursday, November 12, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్  సెషన్ మెరుగు  


తిథి :  నిజ ఆశ్వయుజ బహుళ త్రయోదశి  

నక్షత్రం : చిత్త 

అప్రమత్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; తుల, కుంభ  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  12690.80      (-58.35)   

ట్రెండ్ మార్పు సమయం :  12.30

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.45 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 1.30 గంటల వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.45 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 11.30   సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  11.45 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.45 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 12760, 12840        మద్దతు : 12610, 12550
----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Wednesday, November 11, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 ముగింపు సెషన్ మెరుగు  


తిథి :  నిజ ఆశ్వయుజ బహుళ ద్వాదశి  

నక్షత్రం : హస్త 

అప్రమత్తం :  పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; తుల, కుంభ రాశి జాతకులు   
 
నిఫ్టీ :  12749.15      (+118.05)   

ట్రెండ్ మార్పు సమయం : 9.49; 3.11

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.30 వరకు మెరుగ్గా ఉంటూ తదుపరి 12.25 గంటల వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.05 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 12.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2 గంటల  సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  2.15 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 12825, 12900        మద్దతు : 12675, 12600
----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, November 10, 2020

INDICES REGISTER ANOTHER RECORD

 Equity benchmarks rallied to fresh lifetime highs on Tuesday, propelled by banking and finance stocks, after positive results from Pfizer's COVID-19 vaccine trials turbocharged global market sentiment. Climbing for the seventh session on the trot, the BSE Sensex soared 680.22 points or 1.60 per cent to close above the 43,000-mark for the first time at 43,277.65. Intra-day, the 30-share benchmark touched its lifetime peak of 43,316.44. The broader NSE Nifty too ended at its all-time high of 12,631.10, up 170.05 points or 1.36 per cent. It hit an intra-day record of 12,643.90 during the session. Both the benchmarks scaled record highs for the second straight session. Bihar Assembly Elections favour BJP led NDA to another win triggered fresh investments. Besides Asia, bourses in Hong Kong, Seoul and Tokyo ended with gains, while Shanghai settled lower. Stock exchanges in Europe were mostly trading on a positive note.

- Bajaj Finance was the top gainer in the Sensex pack, spurting 8.84 per cent, followed by IndusInd Bank, L&T, Bajaj Finserv, HDFC, SBI, ICICI Bank, HDFC Bank, ONGC and Axis Bank.

- On the other hand, Tech Mahindra, HCL Tech, Nestle India, Infosys, Sun Pharma and TCS were among the main laggards, tumbling up to 5.73 per cent.

- Global equities witnessed a relief-rally after Pfizer and BioNTech on Monday said their vaccine candidate was found to be more than 90 per cent effective in preventing COVID-19.

- Foreign institutional investors remained net buyers in the capital market as they purchased shares worth Rs 4,548.39 crore on Monday, according to provisional exchange data.

- Meanwhile, international oil benchmark Brent crude was trading 1.42 per cent higher at USD 43 per barrel.

- The rupee depreciated by 3 paise to close at 74.18 against the US dollar as higher crude oil prices and stronger dollar against key global currencies weighed on sentiment. 

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ వరకు మెరుగు

తిథి :  నిజ ఆశ్వయుజ బహుళ ఏకాదశి  

నక్షత్రం : ఉత్తరాషాఢ 

అప్రమత్తం :   ఆర్ద్ర, స్వాతి. శతభిషం నక్షత్ర; కన్య, మకర   రాశి జాతకులు   
 
నిఫ్టీ :  12631.10      (+170.05)   

ట్రెండ్ మార్పు సమయం : 11.58

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.15 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 2 గంటల వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత  చివరి వరకు నిస్తేజంగా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.15 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల  సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  2.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 12615, 12690        మద్దతు : 12550, 12475
----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డిపై ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌లేదు

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, పి.చిదంబ‌రం నాయ‌క‌త్వ‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్‌బిఐని విభిన్న ర‌కాలుగా ఒత్తిడికి గురి చేసేదా...? అవున‌నే అంటున్నారు ఆర్...