Sunday, June 19, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 14900 దిగువన బేరిష్          


(జూన్ 20-24 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  15294 (-1408)

గత వారంలో నిఫ్టీ 15886 - 16183 పాయింట్ల మధ్యన కదలాడి 1408 పాయింట్ల భారీ నష్టంతో 15294 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 14900 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్  అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 16186, 16625, 17085, 17247 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 15700      బ్రేక్ డౌన్ స్థాయి : 14900

నిరోధ స్థాయిలు : 15500, 15600, 15700 (15400 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 15100, 15000, 14900 (15200 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...  

- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1 నుంచి మేషంలోని భరణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- మిథునంలోని మృగశిర పాదం 4 - ఆర్ద్ర పాదం 1 మధ్యలో రవి సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 1-3 మధ్యలో బుధ సంచారం

- వృషభంలోని కృత్తిక పాదం 2-4 మధ్యలో శుక్ర సంచారం 
- మీనంలోని రేవతి పాదం 3-4 మధ్యలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 3లో తుల నవాంశలో బృహస్పతి సంచారం
- కుంభంలోని ధనిష్ట పాదం 3లో తుల నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 4లో రాహువు, కన్యలోని విశాఖ పాదం 2లో కేతువు వృశ్చిక, వృషభ నవాంశల్లో సంచారం 


--------------------------------- 



మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)


తిథి : జ్యేష్ఠ బహుళ  సప్తమి                            

నక్షత్రం : పూర్వాభాద్ర        

అప్రమత్తం :      అశ్విని, మఖ, మూల నక్షత్ర; మీన, కర్కాటక   రాశి  జాతకులు   
 
నిఫ్టీ :  15809.40   (-430.90)   

ట్రెండ్ మార్పు సమయం :  10.44

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి మెరుగ్గా ప్రారంభమై 10.15 వరకు అదే ధోరణిలో ట్రేడవుతూ తర్వాత 12.20 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.27 వరకు మెరుగ్గా ఉండి ఆ తర్వాత చివరి వరకు తిరిగి నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.    

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.15 తర్వాత ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 12.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎటిపి కన్నా పైన ఉంటె లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.30 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 15300, 15400      మద్దతు : 15300, 15200
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Friday, June 17, 2022

Regrets

 Due to some unaviodable circumstances We could not publish the Astro Guide since 1 Month. Again it was started. Thank you all for bearing with us.

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...