Showing posts with label Economy. Show all posts
Showing posts with label Economy. Show all posts

Tuesday, November 17, 2020

మ‌రో కొత్త శిఖ‌రాలు

కొత్త సంవ‌త్స‌రానికి శుభ స్వాగ‌తం


భార‌త స్టాక్ మార్కెట్ కొత్త హిందూ సంవ‌త్స‌రం మొద‌టి సెష‌న్ లో స‌రికొత్త గ‌రిష్ఠ స్థాయిలు న‌మోదు చేసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్, మెట‌ల్ స్టాక్ లు ర్యాలీకి ఉత్తేజం ఇచ్చాయి.  కోవిడ్‌-19కి వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడెర్నా ప్ర‌క‌టించ‌డం ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ ను బ‌ల‌ప‌రిచింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బ‌ల‌ప‌డ‌డం కూడా మార్కెట్ కు ఉత్తేజం ఇచ్చింది. రోజులో సెన్సెక్స్ 44161.16 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిని తాకి చివ‌రికి 314.73 పాయింట్ల లాభంతో 43952.71 వ‌ద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 43952.71 పాయింట్ల జీవిత‌కాల గ‌రిష్ఠ స్థాయిని తాకి 93.95 పాయింట్ల లాభంతో 12874.20 వ‌ద్ద క్లోజ‌యింది. 

- 6.24 శాతం లాభంతో టాటా స్టీల్ లాభ‌ప‌డిన షేర్ల‌లో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా ఎస్ ‌బిఐ, హెచ్ డిఎఫ్ సి ద్వ‌యం‌, బ‌జాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్‌, ఎల్ అండ్ టి, మారుతి, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. ఎన్ టిపిసి, హెచ్ సిఎల్ టెక్‌, ఒఎన్ జిసి, ఇన్ఫోసిస్ ఐటిసి, ప‌వ‌ర్ గ్రిడ్‌, హెచ్ యుఎల్ న‌ష్టాల్లో ముగిశాయి. 

- రంగాల‌వారీగా బిఎస్ఇ ఇండ‌స్ర్టియ‌ల్స్ ఇండెక్స్ 2.27 శాతం లాభ‌ప‌డింది. మెట‌ల్‌, కాపిట‌ల్ గూడ్స్, ఫైనాన్స్, బ్యాంకెక్స్, రియ‌ల్టీ సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. ఇందుకు భిన్నంగా ఆయిల్ అండ్ గ్యాస్‌, హెల్త్ కేర్‌, టెక్నాల‌జీ, ఐటి, ఎన‌ర్జీ, ఎఫ్ఎంసిజి న‌ష్టాల్లో ముగిశాయి. 

----------------------------------- 


ఇంట్రాడే గ‌‌రిష్ఠ స్థాయిలు

సెన్సెక్స్ - 44161.16

నిఫ్టీ - 12934.05

ముగింపు గ‌రిష్ఠ స్థాయిలు 

సెన్సెక్స్ - 43952.71

నిఫ్టీ - 12874.20

-------------------------------------

ఈ వారం అంత‌ర్జాతీయ మార్కెట్లు శుభారంభాన్నిచ్చాయి. దీనికి తోడు క‌రోనా మ‌హ‌మ్మారిని తుద‌ముట్టించేందుకు మ‌రో వ్యాక్సిన్ విజ‌య‌వంతంగా పురోగ‌మిస్తోంద‌న్న వార్త‌లు ఇన్వెస్ట‌ర్ల‌లో ఉత్సాహం నింపాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా భ‌యాలు ఇంకా స‌మ‌సిపోలేదు. ఈ ప‌రిస్థితిలో ఇన్వెస్ట‌ర్లు స్వ‌ల్ప‌కాలానికి లాభాలు స్వీక‌రించ‌డ‌మే మంచిది. 

- వినోద్ నాయ‌ర్‌, జియోజిత్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌

Monday, November 9, 2020

భార‌త స్టాక్ ఇండెక్స్ ల‌ కొత్త రికార్డు

 గ‌త కొద్ది కాలంగా క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల గ‌రిష్ఠ స్థాయిల నుంచి భారీగా దిగ‌జారిన స్టాక్ మార్కెట్ సూచీలు గ‌త వారం రోజులుగా ప‌రుగులు తీశాయి. అమెరికా అధ్య‌క్షుడుగా జో బైడెన్ ఎన్నిక కావ‌డం, వాణిజ్య బంధాలు ప‌టిష్ఠం అవుతాయ‌న్న ఇన్వెస్ట‌ర్ల ఆశ‌లు, బైడెన్ నాయ‌క‌త్వంలో అమెరికా ప్ర‌భుత్వం మ‌రో ఉద్దీప‌న ప్ర‌క‌టిస్తుంద‌న్న వార్త‌లు వెర‌సి ఇన్వెస్ట‌ర్ల‌ను ఉత్సాహంలో ముంచెత్తాయి. రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌పంచ మార్కెట్ల‌లో ఏర్ప‌డిన ర్యాలీ భార‌త మార్కెట్ కు కూడా విస్త‌రించ‌డంతో భార‌త మార్కెట్ సూచీలు కొత్త రికార్డుల‌కు నిచ్చెన‌లు వేశాయి. వ‌రుస‌గా ఆరో సెష‌న్ లో కూడా చిందులు తొక్కిన స్టాక్ మార్కెట్ అద్భుత‌మైన లాభాలు న‌మోదు చేసింది. దీని ప్ర‌భావంతో సెన్సెక్స్ 704.37 పాయింట్ల ర్యాలీ సాధించి జీవిత కాల గ‌రిష్ఠ స్థాయి 42597.43 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో  సెన్సెక్స్ 42645.33 పాయింట్ల‌ను తాకింది. జ‌న‌వ‌రి 14వ తేదీన న‌మోదైన 41952.63 పాయింట్ల రికార్డు దీనితో చ‌రిత్ర పుట‌ల్లోకి చేరింది. ఎన్ఎస్ సి ప్ర‌ధాన సూచీ నిఫ్టీ 197.50 పాయింట్ల మేర‌కు దూసుకుపోయి 12461.05 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడే గ‌రిష్ఠ స్థాయి 12474.05. దేశీయ ప‌రిణామాలు కూడా స్టాక్ మార్కెట్ ర్యాలీకి దోహ‌ద‌ప‌డ్డాయి. క్యు2 ఆర్థిక ఫ‌లితాల అనంత‌రం వ్యాపార వాతావ‌ర‌ణం మెరుగుప‌డ‌డం,  రుణ మార‌టోరియం ముగిసిపోవ‌డం, ఆర్థిక కార్య‌క‌లాపాలు పున‌రుజ్జీవం సాధించాయ‌న్న సంకేతాల కార‌ణంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్ స్టాక్ లు అద్భుత‌మైన ర్యాలీ సాధించాయి. బిఎస్ఇ టెలికాం, బ్యాంకెక్స్, విద్యుత్‌, మెట‌ల్‌, ఫైనాన్స్, క‌న్స్యూమ‌ర్ డ్యూర‌బుల్స్, టెక్నాల‌జీ ఇండెక్స్ లు 4 శాతం మేర‌కు లాభ‌ప‌డ్డాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు కూడా 1 శాతానికి పైగా లాభ‌ప‌డ్డాయి.

- సెన్సెక్స్ షేర్ల‌లో ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ గ‌రిష్ఠంగా 4.95 శాతం లాభ‌ప‌డింది. ఐసిఐసిఐబ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, టాటా స్టీల్‌, టైటాన్‌, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కూడా లాభ‌ప‌డ్డాయి.  

- ఎక్స్చేంజి ద‌గ్గ‌ర అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం విదేశీ ఇన్వెస్ట‌ర్లు సోమ‌వారం రూ.4548.39 కోట్లు, శుక్ర‌వారం రూ.4869.87 కోట్ల విలువ గ‌ల షేర్లు కొనుగోలు చేశారు. 


Tuesday, June 9, 2020

పాత‌కారు అయినా మాకిష్ట‌మే...

కొత్త కారు కొనుగోలు ప్ర‌స్తుతానికి లేదంటున్న క‌స్ట‌మ‌ర్లు

కొద్ది కాలం క్రితం వ‌ర‌కు సెకండ్ హ్యాండ్ లేదా ప‌లు చేతులు మారిన వాహ‌నాల కొనుగోలు అంటే ప్ర‌జ‌లు విముఖ‌త చూపే వారు. కాని క‌రోనా సృష్టించిన క‌ల్లోలం అన్ని మార్కెట్ల స్వ‌భావాల‌ను మార్చేసిన‌ట్టే కార్ల మార్కెట్ స్వ‌భావాన్ని కూడా మార్చేసింది. లాక్ డౌన్ కు ముందు వ‌ర‌కు కొత్త కారు మాత్ర‌మే కొనుగోలు చేయాల‌నుకుంటున్న‌ట్టు చెప్పిన వారిలో ఎక్కువ మంది ఇప్పుడు యూజ్డ్ కార్ల కోసం  ఎగ‌బ‌డుతున్నారు. కొంత కాలం పాటు యూజ్డ్ కారే వాడాల‌నుకుంటున్నామ‌ని చాలా మంది చెబుతున్న‌ట్టు యూజ్డ్ కార్ల విక్ర‌య సంస్థ కార్స్ 24 చీఫ్ మార్కెటింగ్ ఆఫీస‌ర్ గ‌జేంద్ర జంగీద్ తెలిపారు. గ‌త కొద్ది రోజులుగా యూజ్డ్ కార్ల కోసం క‌స్ట‌మ‌ర్ల తాకిడి బాగా పెరిగింద‌ని ఆయ‌న చెప్పారు. మారుతి స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్;   హుండై ఐ10, శాంత్రో జింగ్‌;  హోండా సిటీ కార్ల కోసం ఎక్కువ మంది వాక‌బు చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. అంతే కాదు, ప్ర‌స్తుతం న‌డుపుతున్న వాహ‌నం విక్ర‌యించే యోచ‌న కూడా చాలా మంది విర‌మించుకున్నారు. పాత‌కారుకే ముస్తాబులు చేయించుకుని కొంత కాలం పాటు న‌డ‌పాల‌నుకునే వారే ఎక్కువ‌గా ఉన్నారు. 
సొంత‌కారులోనే తిరుగుతాం
లాక్ డౌన్ అనంత‌రం సొంత‌కారులోనే తిర‌గాల‌ని భావిస్తున్న‌వారి సంఖ్య కూడా బాగా పెరిగింద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. లాక్ డౌన్ కు ముందు వ‌ర‌కు ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించుకోవాల‌ని లేదా పెట్రోల్ ఆదా చేసుకునేందుకు, నిర్వ‌హ‌ణ వ్య‌యాలు త‌గ్గించుకునేందుకు షేర్డ్ కారులో తిర‌గాల‌ని కోరుకున్న వారి సంఖ్య అధికంగా ఉండేది. కాని ఇప్పుడు దేశంలో క‌రోనా వ్యాధి తీవ్ర‌త పెరిగిపోయిన దృష్ట్యా ఎవ‌రూ ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో తిరుగుతామ‌నే సాహ‌సం చేయ‌డంలేదు. కొంత క‌ష్టం అయినా సొంత కారులోనే తిరుగుతామ‌ని, ప్ర‌స్తుతానికి అదే సుర‌క్షిత‌మైన ఎంపిక అని ప‌లువురు బ‌హిరంగంగానే చెబుతున్నారు. 

అమ్మో షాపింగా...నో, నో

క‌స్ట‌మ‌ర్ల ప్రాధాన్య‌త‌లు మారిపోయాయ్‌...
రిటైల‌ర్ల స‌ర్వేలో తేలిన నిజం
క‌రోనా వైర‌స్ సృష్టించిన అల‌జ‌డి పుణ్య‌మా అని ప‌లు వ‌ర్గాల క‌స్ట‌మ‌ర్ల ప్రాధాన్య‌త‌లు గ‌ణ‌నీయంగా మారిపోయాయి. లాక్ డౌన్ ముందు కాలంలో ఎగ‌బ‌డి షాపింగ్ కు ప‌రుగులు తీసిన వారే ఇప్పుడు షాపింగ్ ప‌ట్ల విముఖ‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దేశంలో రిటైల్ వినియోగ‌దారుల ధోర‌ణుల‌పై రిటైల‌ర్స్ అసోసియేష‌న్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ వాస్త‌వం బ‌ట్ట‌బ‌య‌లయింది. లాక్ డౌన్ ముగిసి షాపింగ్ మాల్స్, హోట‌ళ్లు ఒక్క‌టొక్క‌టిగా తెరుచుకుంటున్న ప్ర‌స్తుత త‌రుణంలో క‌స్ట‌మ‌ర్ల అభిమ‌తం తెలుసుకునేందుకు ఈ స‌ర్వే నిర్వ‌హించారు. లాక్ డౌన్ ముగిసినా దేశంలో క‌రోనా కేసులు విజృంభిస్తూ ఉండ‌డంతో ప‌లువురు ఇప్ప‌ట్లో షాపింగ్ కు వెళ్లేది లేద‌నే అభిప్రాయ‌మే ప్ర‌క‌టించారు. మొత్తం 4239 మందిని ఈ స‌ర్వేలో భాగంగా ప్ర‌శ్నించారు. మూడు నెల‌ల నిరంత‌ర లాక్ డౌన్ కార‌ణంగా కుప్ప‌కూలిన రిటైల్ రంగాన్ని అంత త్వ‌ర‌గా తిరిగి ప‌ట్టాల‌కెక్కిస్తామ‌న్న ఆశ‌లు దీనితో అంత‌రించిపోయాయి. రిటైల్ రంగం రిక‌వ‌రీ జాప్యం అవుతుంద‌నేందుకు ఇది ఒక సంకేత‌మ‌ని ఆర్ఏఐ పేర్కొంది. అలాగే క‌స్ట‌మ‌ర్ల‌లో భ‌యాన్ని పోగొట్టి వారిని షాపింగ్ కు అనుకూలంగా మార్చాలంటే పారిశుధ్యం, భ‌ద్ర‌త చ‌ర్య‌లు పెంచాల‌ని, సుర‌క్షిత‌మైన షాపింగ్ అనుభ‌వం ఉంటుంద‌న్న భ‌రోసా వారికి క‌ల్పించాల‌ని ఆ సంఘం చెబుతోంది. 
ఆర్ఏఐ స‌ర్వేలో వివిధ ప్ర‌శ్న‌ల‌కు క‌స్ట‌మ‌ర్ల నుంచి వ‌చ్చిన స‌మాధానాలిలా ఉన్నాయి...
1) షాపింగ్ వ్య‌యాలు...
ఎ) భారీగా త‌గ్గించుకుంటాం 37%
బి) త‌గ్గించుకుంటాం 41%
సి) గ‌తం క‌న్నా మార‌దు 16%

2) షాపింగ్ కు వెళ్తారా?
ఎ) వ‌చ్చే 3 నెల‌ల్లో ప్ర‌య‌త్నిస్తాం 62%
బి) 3-12 నెల‌ల్లో 32%
సి)ఇప్ప‌ట్లో అలాంటిది లేదు 6%

3) ఏ వ‌స్తువులు కొంటారు?
ఎ) ఆహారం, దుస్తులు, నిత్యావ‌స‌రాలు 52 శాతం
బి) ఎల‌క్ర్టానిక్స్ 31%
సి) సౌంద‌ర్య సాధ‌నాలు 25%

Thursday, June 4, 2020

బ్యాంకుల గుండెల్లో ఎన్ పిఏ గుబుల్‌

కోవిడ్‌-19ని అదుపు చేసేందుకు ఇటీవ‌ల ఆర్ బిఐ, ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు చ‌ర్య‌ల ప్ర‌భావం వ‌ల్ల ఈ ఏడాది బ్యాంకుల ఎన్ పిఏలు (మొండి బ‌కాయిలు) భారీగా పెరిగిపోనున్నాయి. ఈ ఏడాది మార్చి చివ‌రి నాటికి 8.6 శాతం ఉన్న ఈ ఎన్ పిఏలు వ‌చ్చే ఏడాదికి 11.6 శాతానికి దూసుకుపోవ‌చ్చునంటున్నారు. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు ప్రామాణిక రుణాలుగా ఉన్న వాటిలో 5.5 శాతం ఖాతాలు తాజాగా ఎన్ పిఏల్లోకి జారుకోవ‌చ్చున‌ని కూడా అంటున్నారు. ఇటీవ‌ల చ‌ర్య‌ల ప్ర‌భావం వ‌ల్ల బ్యాంకుల రుణ‌విత‌ర‌ణ బాధ్య‌త పెరిగిపోవ‌డంతో పాటు ఆదాయాల‌పై తీవ్ర‌ ప్ర‌భావం ప‌డుతుంద‌ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చెబుతోంది. ఇలాంటి వాతావ‌ర‌ణంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు ఈ ఏడాది రూ.45 వేల కోట్ల నుంచి రూ.82500 కోట్ల వ‌ర‌కు అద‌న‌పు పెట్టుబ‌డుల మ‌ద్ద‌తు అవ‌స‌రం కావ‌చ్చున‌ని అంచ‌నా వేసింది. లాక్ డౌన్  ప్ర‌భావం వ‌ల్ల రుణ గ్ర‌హీత‌ల రుణాల చెల్లింపు సామ‌ర్థ్యం భారీగా దెబ్బ తిన్న‌ద‌ని తేల్చి చెప్పింది. బ్యాంకులు ఎన్ పిఏల కోసం చేసుకునే కేటాయింపులు ఈ ఏడాది భారీగా ఉండ‌వ‌చ్చున‌ని, దీని ప్ర‌భావం వ‌ల్ల వ‌రుస‌గా ఆరో ఏడాది కూడా భారీ న‌ష్టాలు న‌మోదు చేసే ఆస్కారం ఉన్న‌ద‌ని క్రిసిల్ తెలిపింది. 

భారీగా క్షీణించిన వినియోగ విశ్వాసం

ఈ ఏడాది వృద్ధి -1.5%
వ‌చ్చే ఏడాది అద్భుత‌మైన రిక‌వ‌రీ

కొవిడ్‌-19, దీర్ఘ‌కాలిక లాక్ డౌన్ ప్ర‌భావం వ‌ల్ల‌ దేశంలో్ వినియోగ విశ్వాసం గ‌ణ‌నీయంగా క్షీణించింద‌ని, ఫ‌లితంగా ఈ ఏడాది ఆర్థిక రంగం 1.5 శాతం ప్ర‌తికూల వృద్ధిని న‌మోదు చేయ‌వ‌చ్చున‌ని ఆర్ బిఐ చెబుతోంది. మే నెల‌కు నిర్వ‌హించిన వినియోగ విశ్వాస స‌ర్వేను ఆర్ బిఐ గురువారం విడుద‌ల చేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల సూచి (సిఎస్ఐ) చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయికి క్షీణించ‌గా భ‌విష్య‌త్ అంచ‌నాల సూచి (ఎఫ్ఇఐ) కూడా భారీ క్షీణ‌త‌ను న‌మోదు చేసిన‌ట్టు ఆర్ బిఐ నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌స్తుతానికి వృద్ధిరేటు క్షీణించినా 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో మాత్రం వృద్ధిరేటు 7.2 శాతం వ‌ర‌కు ఉండ‌వ‌చ్చున‌ని తెలిపింది. ప్ర‌స్తుతం మాత్రం సాధార‌ణ ఆర్థిక స్థితిపై అంచ‌నాలు, ఉపాధి అవ‌కాశాలు, గృహ‌రంగంలో ఆదాయాలు భారీ ప్ర‌తికూల వృద్ధిని న‌మోదు చేశాయ‌ని ప‌లువురు ప్ర‌క‌టించారు. 

స‌ర్వే తీరు...
మే 5-17 తేదీల మ‌ధ్య‌న స‌ర్వే మొత్తం 13 న‌గ‌రాల్లో ప్ర‌స్తుత  క‌రోనా వాతావ‌ర‌ణంలో టెలిఫోనిక్ సంభాష‌ణ రూపంలో జ‌రిగింది. స‌ర్వే జ‌రిగిన ప్ర‌ధాన న‌గ‌రాల్లో అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళురు, చెన్నై, ఢిల్లీ, హైద‌రాబాద్‌, కోల్క‌తా, ల‌క్నో, ముంబై, పాట్నా ఉన్నాయి. మొత్తం 5761 మంది గృహ‌స్థుల‌ను ఈ సర్వేలో ప్ర‌శ్నించారు. 

స‌ర్వే ముఖ్యాంశాలు...వాస్త‌వ‌ తుది వినియోగ వ్య‌యం (పిఎఫ్ సిఇ) 0.5 శాతం క్షీణించ‌వ‌చ్చు. వ‌చ్చే ఏడాది 6.9 శాతానికి పుంజుకోవ‌చ్చు.వాస్త‌వ స్థూల పెట్టుబ‌డుల క‌ల్ప‌న (జిఎఫ్ సిఎఫ్‌) -6.4 శాతానికి ప‌డిపోయి వ‌చ్చే ఏడాది 5.6% వృద్ధి న‌మోదు చేయ‌వ‌చ్చు.వాస్త‌వ స్థూల విలువ జోడింపు (జివిఏ) -1.7 శాతానికి దిగ‌జారి వ‌చ్చే ఏడాది 6.8% వృద్ధికి పుంజుకోవ‌చ్చు.ఈ ఏడాదికి ఉద్యోగావ‌కాశాల‌పై పూర్తి నిరాశావ‌హ స్థితి నెల‌కొని ఉంది. -వినియోగ‌దారులు త‌మ విచ‌క్ష‌ణాపూర్వ‌క ఖ‌ర్చుల‌ను భారీగా కుదించుకున్నారు. ఏడాది చివ‌రి వ‌ర‌కు ఇదే ధోర‌ణి కొన‌సాగ‌వ‌చ్చు. 

రెపోరేటు య‌థాత‌థం

ప‌శ్చిమాసియా సంక్షోభం ప్ర‌త్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్ర‌పంచ ఆర్థిక వ్యవ‌స్థ‌ల‌ను భ‌య కంపితుల్ని చేస్తున్న వాతావ‌ర‌ణంలో భార‌త రిజ‌ర్వ్ బ...