Sunday, November 29, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

12675 దిగువన బేరిష్  


(నవంబర్ 30-డిసెంబర్ 4, 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  12969 (+110)

గత వారంలో నిఫ్టీ 13146-12790 పాయింట్ల మధ్యన కదలాడి 110 పాయింట్ల లాభంతో 12969 వద్ద పాజిటివ్ గా ముగిసింది. ఈ వారంతంలో 12675 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 12302, 11975, 11003, 10749 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 13275      బ్రేక్ డౌన్ స్థాయి : 12675

నిరోధ స్థాయిలు : 13125, 13200, 13275 (13050 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 12825, 12750, 12675 (12900 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------      

గ్రహగతులివే...    

      

- వృషభంలోని మృగశిర పాదం 1 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం


-  వృశ్చికంలోని అనురాధ పాదం 4 - జ్యేష్ఠ పాదం 1 మధ్యలో రవి సంచారం 


- వృశ్చికంలోని అనురాధ పాదం 1-2 మధ్యలో బుధ సంచారం 

- తులలోని స్వాతి పాదం 2 - విశాఖ పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 

- మీనంలోని రేవతి పాదం 2-3 మధ్యలో కుజ సంచారం
 
- మకరంలోని  ఉత్తరాషాఢ పాదం 2 మధ్యలో మకర నవాంశలో బృహస్పతి సంచారం   

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 3  లో కుంభ నవాంశలో శని సంచారం

- వృషభంలోని మృగశిర పాదం 2లో రాహువు, వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 
--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి) 

తిథి :  నిజ కార్తీక బహుళ పాడ్యమి   

నక్షత్రం : మృగశిర 

అప్రమత్తం :  పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; మిథున, తుల  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  12968.95      (+18.05)   

ట్రెండ్ మార్పు సమయం :  1.22

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.50 వరకు నిస్తేజంగా ఉంటూ తదుపరి 12.35 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.05 వరకు నిలకడగా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 10.50 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.35   సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  2.15 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 13050, 13125        మద్దతు : 12900, 12825
----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 22725 పైన బుల్లిష్

ఏప్రిల్ 29-మే 3 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  22420 (+273)       గత వారంలో నిఫ్టీ 22198 - 22625 పాయింట్ల మధ్యన ...