Sunday, September 27, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

 10750 దిగువన బేరిష్ 

(సెప్టెంబర్ 28-అక్టోబర్ 1, 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  11050 (-455)

గత వారంలో నిఫ్టీ 10790-11535 పాయింట్ల మధ్యన కదలాడి 455 పాయింట్ల భారీ నష్టంతో 11050 వద్ద నెగెటివ్ గా ముగిసింది. ఈ వారంతంలో 11050 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 11355, 11299, 10643, 10757 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి వచ్చింది. ఇది  దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 11350      బ్రేక్ డౌన్ స్థాయి : 10750

నిరోధ స్థాయిలు : 11200, 11275, 11350 (11125 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 10900, 10825, 10750 (10975 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------      

గ్రహగతులివే... 

      

- మకరంలోని ధనిష్ట పాదం 2 నుంచి మీనంలోని ఉత్తభద్ర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం


- కన్యలోని హస్త పాదం 1-2 మధ్యలో రవి సంచారం 


- తులలోని స్వాతి పాదం 1-2 మధ్యలో బుధ సంచారం 

- సింహంలోని మఖ పాదం 1లో శుక్ర సంచారం 

- మేషంలోని అశ్విని పాదం 1లో వక్రగతిలో కుజ సంచారం

- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం   

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో శని సంచారం, 29న రోజు మార్గంలోకి మార్పు 

- వృషభంలోని మృగశిర పాదం 2లో రాహువు, కన్యలోని జ్యేష్ఠ పాదం 4లో కేతువు కన్య, మీన నవాంశల్లో సంచారం 
--------------------------------- 

మిడ్ సెషన్ వరకు మెరుగు (సోమవారానికి)

తిథి :  అధిక ఆశ్వయుజ శుక్ల నవమి     

నక్షత్రం : పూర్వాషాఢ 

అప్రమత్తం :  మృగశిర, చిత్త, ధనిష్ట  నక్షత్ర; వృశ్చిక, మీన రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11050.25      (+274.70)   

ట్రెండ్ మార్పు సమయం : 9.39

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.15 వరకు మెరుగ్గా ఉండి తదుపరి 1.25 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 9.45 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.45 తరవాత ఎటిపి కన్నా దిగువన ఉంటె షార్ట్ పొజిషన్లు తీసుకుని 3.15 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11125, 11200        మద్దతు : 10975, 10900
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఒక్క రోజులో 4,71,751 విమాన ప్ర‌యాణాలు

విమాన‌యానం కొత్త రికార్డు దేశీయంగా విమాన‌యాన రంగం ఒక కొత్త రికార్డును న‌మోదు చేసింది. ఆదివారం అంటే 2024 ఏప్రిల్ 21వ తేదీన దేశీయంగా 4,71,751 ...