Sunday, March 28, 2021

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

14200 దిగువన బేరిష్   

(మార్చి 29-ఏప్రిల్ 2, 2021 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ   :  14507 (-237)

గత వారంలో నిఫ్టీ 14879-14264 పాయింట్ల మధ్యన కదలాడి 237 పాయింట్ల నష్టంతో 14507 వద్ద నెగిటివ్ గా ముగిసింది. ఈ వారాంతంలో 14200 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 14925, 14766, 13200, 12600 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 14825      బ్రేక్ డౌన్ స్థాయి : 14200

నిరోధ స్థాయిలు : 14650, 14725, 15825 (14575 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 14350, 14275, 14200 (14425 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------  

 

గ్రహగతులివే...    
- కన్య లోని హస్త పాదం 3 నుంచి వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 2 మధ్యలో చంద్ర సంచారం

-  మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 4 నుంచి రేవతి పాదం 2 మధ్యలో రవి సంచారం 

- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 4 నుంచి మీనంలోని పూర్వాభాద్ర పాదం 2 మధ్యలో బుధ సంచారం 

- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 4 నుంచి రేవతి పాదం 2 మధ్యలో శుక్ర సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 3-4 మధ్యలో కుజ సంచారం

- మకరంలోని  ధనిష్ట పాదం 2లో కన్య నవాంశలో బృహస్పతి సంచారం

- మకరంలోని శ్రవణం పాదం 3లో మిథున నవాంశలో శని సంచారం

- వృషభంలోని రోహిణి పాదం 4లో రాహువు, వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 2లో కేతువు సంచారం 

 
--------------------------------- 

ముగింపు సెషన్ మెరుగు  (సోమవారానికి) 

తిథి :  ఫాల్గుణ బహుళ విదియ     

నక్షత్రం : చిత్త    

అప్రమత్తం :   పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర; తుల, కుంభ  రాశి జాతకులు   
 
నిఫ్టీ :  14549.40     (-265.35)   

ట్రెండ్ మార్పు సమయం :  12.21

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.37 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.50 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11.45 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్జి పొజిషన్లు తీసుకుని 1.35 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
  
టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 14580, 14660        మద్దతు : 14425, 14350
----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...