Sunday, March 13, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

 17025 ఫైన బుల్లిష్        



(మార్చి14-18 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  16630 (+385)

గత వారంలో నిఫ్టీ 16757 - 15672 పాయింట్ల మధ్యన కదలాడి 385 పాయింట్ల లాభంతో 16630 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 17025 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. నాలుగు వారాల భారీ నష్టం అనంతరం లాభపడిన తోలి వారం ఇది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17008, 17318, 17370, 16960 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాల బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 17025      బ్రేక్ డౌన్ స్థాయి : 16225

నిరోధ స్థాయిలు : 16825, 16925, 17025 (16725 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 16425, 16325, 16225 (16525 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- 

గ్రహగతులివే...    

- కర్కాటకంలోని పుష్యమి పాదం 3 నుంచి కన్యలోని ఉత్తర ఫల్గుణి పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
- మీనంలోని పూర్వాభాద్ర పాదం 1-4 మధ్యలో రవి సంచారం 
- కుంభంలోని శతభిషం పాదం 2-4 మధ్యలో బుధ సంచారం

- మకరంలోని శ్రవణం పాదం 1-3 మధ్యలో శుక్ర సంచారం 
- మకరంలోని శ్రవణం పాదం 1-2 మధ్యలో కుజ సంచారం

- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1-2 మధ్యలో మేష నవాంశలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
- వృషభంలోని కృత్తిక పాదం 2లో రాహువు, వృశ్చికంలోని విశాఖ పాదం 4లో కేతువు సంచారం 

--------------------------------- 

ప్రథమార్ధం మెరుగు  (సోమవారానికి)


తిథి : ఫాల్గుణ శుక్ల ద్వాదశి                     

నక్షత్రం : పుష్యమి      

అప్రమత్తం :   భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; సింహ, ధనుస్సు రాశి జాతకులు   
 
నిఫ్టీ :  16345.35   (+331.90)   

ట్రెండ్ మార్పు సమయం :  11.28

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి 12.12 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు నిస్తేజంగా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
.
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.10 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎటిపి కన్నా దిగువన ఉంటే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవాలి.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 16750, 16825      మద్దతు : 16525, 16425
----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...