Sunday, September 11, 2022

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

18235 ఫైన బుల్లిష్          


(సెప్టెంబర్ 12-16 
తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ   :  17833 (+298)

గత వారంలో నిఫ్టీ 17484 - 17926 పాయింట్ల మధ్యన కదలాడి 298 పాయింట్ల లాభంతో  17833 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18235 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్  అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 17487, 16942, 16810, 16964 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువన ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18235      బ్రేక్ డౌన్ స్థాయి : 17535

నిరోధ స్థాయిలు : 18035, 18135, 18235 (17935 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 17735, 17635, 17535 (17835 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 
--------------------------------- .
  
గ్రహగతులివే...  
- మీనంలోని రేవతి పాదం 1 నుంచి వృషభంలోని రోహిణి పాదం 1 మధ్యలో చంద్ర సంచారం
- సింహంలోని పుబ్బ పాదం 4 - ఉత్తర ఫల్గుణి పాదం 1 మధ్యలో రవి సంచారం 

- కన్యలోని హస్త పాదం 1-2 మధ్యలో వక్రగతిలో  బుధ సంచారం

- సింహంలోని పూర్వ ఫల్గుణి పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం 
- వృషభంలోని రోహిణి పాదం 3-4 మధ్యలో కుజ సంచారం

- మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 3 లో తుల నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం
- మకరంలోని ధనిష్ట పాదం 1లో సింహ నవాంశలో వక్రగతిలో శని సంచారం
- మేషంలోని భరణి పాదం 3లో రాహువు, తులలోని విశాఖ పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్ సెషన్ నుండి మెరుగు (సోమవారానికి) 


తిథి : భాద్రపద బహుళ తదియ                             

నక్షత్రం : రేవతి               

అప్రమత్తం :     ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర; మేష కర్కాటక  రాశి  జాతకులు   
 
ట్రెండ్ మార్పు సమయం :  12.48

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం నిస్తేజంగా ప్రారంభమై 11.08 వరకు అలాగే ఉంటూ తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే  తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 17935, 18025     మద్దతు : 17735, 17650
----------------------------------------------  

సూచన 

- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...