Sunday, August 27, 2023

వారానికి 19500 పైన బుల్లిష్ 

 ఆగస్ట్ 28 - సెప్టెంబర్ 1 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

నిఫ్టీ   :  19266 (-44)


గత వారంలో నిఫ్టీ 19584 - 19230  పాయింట్ల మధ్యన కదలాడి 44 పాయింట్ల  నష్టంతో 19266 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 19500 కన్నా పిన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 19577, 19365, 18356, 18341 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 19665      బ్రేక్ డౌన్ స్థాయి : 18865

నిరోధ స్థాయిలు : 19465, 19565, 19665 (19365 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 19065, 18965, 18865 (19165 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------     
 
Ø  గ్రహగతులివే...
ü  ధనుస్సులోని ఉత్తరాషాఢ పాదం 1 నుంచి మీనంలోని ఉత్తభద్ర పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü  సింహంలోని మఖ పాదం 4 - పుబ్బ పాదం 1 మధ్యలో రవి సంచారం 
ü  సింహంలోని ఉత్తర పాదం 1లో వక్రగతిలో బుధ సంచారం
ü కర్కాటకంలోని ఆశ్లేష పాదం 1లో వక్రగతిలో శుక్ర సంచారం
ü  కన్యలోని ఉత్తర పాదం 3-4 మధ్యలో  కుజ సంచారం
ü వృషభంలోని భరణి పాదం 3లో తుల నవాంశలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 1లో ధనుస్సు నవాంశలో వక్రగతిలో శని సంచారం
ü  వృషభంలోని అశ్విని పాదం 2లో రాహువు, తులలోని చిత్త పాదం 4లో కేతువు వృషభ, వృశ్చిక నవాంశల్లో సంచారం 

--------------------------------- 


ప్రారంభం తర్వాత మెరుగు (సోమవారానికి)  

తిథి : శ్రావణ శుక్ల ద్వాదశి  

                                             

నక్షత్రం : ఉత్తరాషాఢ 
                             
అప్రమత్తం :   ఆర్ద్ర,స్వాతి, శతభిషం నక్షత్ర; మకర, వృషభ రాశి  జాతకులు   

ట్రెండ్ మార్పు సమయం : 10.38

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 9.57 వరకు నిలకడగా ఉంటూ తదుపరి 2.22 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత  చివరి వరకు తిరిగి నిలకడగా ట్రేడ్ కావచ్చు.

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్   పొజిషన్లు తీసుకుని 2 గంటల  సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 19240, 19300     మద్దతు : 19170, 19100
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...