Tuesday, November 28, 2023

4 లక్షల కోట్లకు చేరువలో బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ


బొంబాయి  స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ (దీన్నే ఇన్వెస్టర్ల సంపద అని కూడా అంటారు) మంగళవారం 4 లక్షల కోట్ల రూపాయల సమీపానికి వచ్చింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మకమైన 4 లక్షల కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం కొంత జాప్యం అవుతోంది.  మంగళవారం (2023 నవంబర్ 28) మధ్యాన్నం మార్కెట్ ముగిసే సమయానికి మార్కెట్ విలువ రూ.3,31,05,425.71 కోట్లుగా (3.97 ట్రిలియన్లు)  నమోదయింది. డాలర్  తో రూపాయి మారకం విలువ 83.34గా లెక్కించారు.  2021 మే 24 వ తేదీన  బిఎస్ఇ లిస్టెడ్  కంపెనీల  మార్కెట్  విలువ 3 లక్షల కోట్ల రూపాయల మైలు రాయిని చేరింది.  ఈ ఏడాది (2023) సెప్టెంబర్ 15వ తేదీన బిఎస్ఇ సెన్సెక్స్ చారిత్రక గరిష్ఠ స్థాయి 67927.23 పాయింట్లను తాకింది.  2023 సంవత్సరంలో సెన్సెక్స్ ఇప్పటి వరకు 5333.46 పాయింట్లు లాభపడగా మార్కెట్ విలువ రూ.48.67 లక్షల కోట్లు పెరిగింది. ఇదిలా ఉండగా మంగళవారం సెన్సెక్స్ 204.16   పాయింట్లు లాభంతో 66174.20 వద్ద ముగిసింది. 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...