Monday, April 21, 2025
5 రోజులు-రూ.32 లక్షల కోట్లు
మన స్టాక్ మార్కెట్ కనివిని ఎరుగని ర్యాలీలో దూసుకుపోతోంది. మొత్తం మీద బుల్స్ మార్కెట్‌పై పట్టు సాధించాయి. ఈ నెల 2వ తేదీన ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో చారిత్రక నష్టాలను చవి చూసిన మార్కెట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో బలమైన ర్యాలీలో ప్రవేశించింది. అందులోనూ గత ఐదు ట్రేడింగ్ సెషన్లుగా కనివిని ఎరుగని ర్యాలీ సాధించింది. ఫలితంగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 5561.35 పాయింట్లు, నిఫ్టీ 1726.40 పాయింట్లు లాభపడ్డాయి. ఈ ర్యాలీ కారణంగా ఐదు సెషన్లలో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.32,03,295.80 కోట్లు పెరిగి రూ.4,25,85,629.02 కోట్లకు (5 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. ఇక వరుసగా ఐదో రోజు కూడా లాభపడిన సెన్సెక్స్ సోమవారం 855.30 పాయింట్లు లాభపడి 79,408.50 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1081.85 పాయింట్ల లాభంతో 79,635.05 వరకు కూడా వెళ్లింది. ఇక నిఫ్టీ 273.90 పాయింట్ల లాభంతో 24,125.55 వద్ద క్లోజయింది. బిఎస్ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సహా రంగాలవారీ సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. అమెరికన్ మార్కెట్ పైన, ట్రంప్ వాణిజ్య విధానాల పైన నమ్మకం కోల్పోయిన విదేశీ ఇన్వెస్టర్లు మెరుగైన లాభాల కోసం భారత మార్కెట్ వైపు మళ్లీ దృష్టి సారించడం ఈ ర్యాలీకి కారణమని విశ్లేషకులంటున్నారు.
Sunday, April 20, 2025
ఈ వారంలో 24250 పైన బుల్లిష్
తిథి : చైత్ర బహుళ అష్టమి
నక్షత్రం : ఉత్తరాషాఢ/శ్రవణం
అప్రమత్తం : ఆర్ద్ర, స్వాతి, శతభిషం/ పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు
ట్రెండ్ మార్పు సమయం : 12.36
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 2.07 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. .
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 120 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Wednesday, April 16, 2025
కొండెక్కిన బంగారం
ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర చుక్కలనంటుతోంది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1650 పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.98,100కి చేరింది. అలాగే ఆభరణాల బంగారం ధర సైతం అంతే మొత్తంలో పెరిగి రూ.97,650 పలికింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం చెలరేగవచ్చునన్న భయాల నేపథ్యంలో ప్రజలు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయడం ఇందుకు కారణం. గత శుక్రవారంనాడు (ఏప్రిల్ 11) 10 గ్రాముల బంగారం ధర కనివిని ఎరుగని స్థాయిలో రూ.6,250 పెరిగి ఒక్క రోజు వృద్ధిలో చారిత్రక రికార్డును నమోదు చేసింది. స్థానిక మార్కెట్లలో ఒక్క రోజులో అత్యధిక పెరుగుదల నమోదయింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఇప్పటికి బంగారం రూ.18,710 (23.56%) పెరిగింది. వెండి ధర సైతం కిలో రూ.1900 పెరిగి రూ.99,400 పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజిలో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,984 పెరిగి 10 గ్రాములు కొత్త రికార్డు రూ.95,435 ని నమోదు చేసింది.
Tuesday, April 15, 2025
ఈక్విటీ మార్కెట్లో ర్యాలీ
Monday, April 14, 2025
ట్రంప్ పోటుకు సంపద కుదేలు
ఇన్వెస్టర్ల సంపద రూ.11.30 లక్షల కోట్లు డౌన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సృష్టించిన టారిఫ్‌ల కల్లోలం ప్రభావంతో ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు ఇన్వెస్టర్లు రూ.11.30 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. నెల ప్రారంభం నుంచి సెన్సెక్స్ సుమారుగా 2% నష్టపోయింది. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ ఇంత కల్లోలం ఎదుర్కొనడం ఇదే ప్రథమం. ట్రంప్ ఈ నెల రెండో తేదీన ప్రకటించిన ప్రతీకార సుంకాల కారణంగా ప్రపంచంలో చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం చెలరేగవచ్చుననే భయాలు మార్కెట్‌కు పెనుఘాతంగా పరిణమించాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి సెన్సెక్స్ 1460.18 పాయింట్లు నష్టపోగా ఇన్వెస్టర్ల సంపద రూ.11,30,627.09 కోట్లు కరిగిపోయి రూ.4,01,67,468.51 కోట్ల వద్ద (4.66 లక్షల కోట్ల డాలర్లు) స్థిరపడింది. ఏప్రిల్ రెండో తేదీన సుంకాల విధింపు ప్రకటనతో కల్లోలం రేపిన ట్రంప్ వాటిని 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ఈ నెల 11వ తేదీన ప్రకటించారు. దీంతో మార్కెట్ తిరిగి పుంజుకుని గత శుక్రవారం 2% మేరకు లాభపడింది. ప్రపంచంలోని రెండు భారీ ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విస్తృత నష్టాన్ని కలిగిస్తాయన్న భయాలు ఇన్వెస్టర్లలో చెలరేగాయి. ప్రపంచ మార్కెట్లలోని పరిణామాలు, అస్థిరతలు భారత మార్కెట్‌కు ముప్పే అయినప్పటికీ ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకోగల అంతర్గత బలం, దేశీయ కార్పొరేట్ల ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు శక్తిని అందిస్తాయని మాస్టర్ కాపిటల్ సర్వీసెస్ పరిశోధన, అడ్వైజరీ విభాగం ఎవిపి విష్ణుకాంత్ ఉపాధ్యాయ అన్నారు.
కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మార్కెట్ భారీ కుదుపుతో ప్రారంభించింది. ట్రంప్ సుంకాల పోటుతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా నష్టపోవడం ఇందుకు కారణం. ప్రపంచ మార్కెట్లతో పోల్చితే మన మార్కెట్ కాస్తంత మెరుగ్గానే నిలదొక్కుకుంది. ఈ ఏడాది వృద్ధిరేటు ఎలా ఉండవచ్చు, మార్కెట్ నడక ఎలా ఉండవచ్చుననేది వాణిజ్య యుద్ధం ఏ రూపం తీసుకుంటుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
- సతీశ్ చంద్ర ఆలూరి, లెమన్ మార్కెట్స్ డెస్క్ అనలిస్ట్
8 రోజుల్లో ఐదు సెలవులు
ఈ నెలలో కేవలం 5 రోజుల వ్యవధిలో మార్కెట్‌కు రెండు సెలవులు వచ్చాయి. మరో సెలవు వారాంతంలో వస్తోంది. ఏప్రిల్ 10న మహావీర్ జయంతి సెలవు కాగా 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్ పని చేయలేదు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు. ఒక్క వారంలోనే రెండు సెలవులు వచ్చాయి. ఇవి కాకుండా వారాంతపు సెలవులు రెండు ఉండనే ఉన్నాయి.
ఈ వారంలో 23200 పైన బుల్లిష్
తిథి : చైత్ర బహుళ చతుర్థి
నక్షత్రం : విశాఖ
అప్రమత్తం : అశ్విని, మఖ, మూల నక్షత్ర; వృశ్చిక, మీన రాశి జాతకులు
ట్రెండ్ మార్పు సమయం : 1.41
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 10.05 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 12.19 గంటల వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 2.31 వరకు తిరిగి మెరుగ్గా ఉండి చివరిలో నిలకడగా ట్రేడ్ కావచ్చు. .
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 12.30 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.30 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.
v నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లి
v మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.
v పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.
v ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.
Thursday, April 10, 2025
టిసిఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఆర్తి సుబ్రమణియన్
Tuesday, April 8, 2025
వేల్యూ బైయింగ్‌తో మార్కెట్‌కు ఊరట
ఈక్విటీ మార్కెట్ సోమవారం నాటి భారీ నష్టం నుంచి మంగళవారం కొంత ఉపశమనం పొందింది. తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చిన నాణ్యమైన షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు రికవరీ సాధించాయి. ఆసియా, యూరప్ః మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు భారత్ మార్కెట్‌కు ఉత్తేజం కల్పించాయి. విలువ ఆధారిత కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 1721 పాయింట్ల మేరకు దూసుకుపోయి 74859.39 పాయింట్లను నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 1089.18 పాయింట్లు లాభంతో 74227.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 374.25 పాయింట్లు లాభపడి 22535.85 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 535.6 పాయింట్లు లాభపడి 22697.20 పాయింట్ల డే గరిష్ఠ స్థాయిని తాకింది.
Monday, April 7, 2025
ట్రం"పోటు"కు మార్కెట్ "బేర్"
- 10 నెలల కాలంలో తొలి భారీ పతనం
- ఇన్వెస్టర్లకు కన్నీరు తెప్పించిన బ్లాక్ మండే
- ఒక్క రోజులోనే రూ.14 లక్షల కోట్లు హాంఫట్
- మెటల్, ఐటీ షేర్లు కుదేలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రంప్ చర్యల కారణంగా ప్రపంచంలో వాణిజ్య యుద్ధం ఏర్పడవచ్చునన్న భయాలు ప్రపంచ మార్కెట్లన్నింటినీ కల్లోలితం చేశాయి. ఈ ప్రభావం మన మార్కెట్‌పై కూడా పడింది. సోమవారం తీవ్ర ప్రతికూల నడుమ మన మార్కెట్ 10 నెలల కాలంలో కనివిని ఎరుగని రీతిలో ఒక్క రోజులో భారీ నష్టం నమోదు చేసింది. ట్రంప్ సుంకాలు, దానికి చైనా ప్రతిఘటన వంటి పరిణామాల కారణంగా ఈక్విటీ సూచీలు తీవ్ర నష్టాలు నమోదు చేశాయి. తీవ్ర ఆటుపోట్ల నడుమ జరిగిన ట్రేడింగ్‌లో ఒక దశలో సెన్సెక్స్ 3939.68 పాయింట్లు (5.22%) నష్టపోయి 71425.01కి దిగజారింది. చివరికి ఆ నష్టాలను కొంత పూడ్చుకుని నికరంగా 2226.79 పాయింట్ల నష్టంతో (2.95%) 73137.90 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 1160.8 పాయింట్లు (5.06%) దిగజారి 21743.65 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 742.85 పాయింట్ల నష్టంతో (3.24%) 22161.60 వద్ద ముగిసింది.
2024 జూన్ 4 తర్వాత భారీ నష్టం
గత ఏడాది జూన్ 4వ తేదీన 4389.73 పాయింట్లు (5.74%) నష్టపోయి 72079.05 పాయింట్ల వద్ద ముగిసిన తర్వాత ఏర్పడిన పెద్ద నష్టం ఇదే. అదే రోజున ఇంట్రాడేలో సెన్సెక్స్ 6234.35 (8.15%) పాయింట్లు నష్టపోయి 70234.43 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. అలాగే నిఫ్టీ ఇంట్రాడేలో 1982.45 పాయింట్లు (8.52%) దిగజారి 21281.45 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరికి 1379.40 (5.93%) పాయింట్లు నష్టపోయి 21884.50 వద్ద ముగిసింది. అంతే కాదు 2020 మార్చి 23వ తేదీన కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్ ప్రభావంతో రెండు సూచీలు 13% నష్టపోయాయి.
ఇన్వెస్టర్ల కంట రక్త కన్నీరు
ఈక్విటీ సూచీల భారీ పతనంతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.14,09,225.71 కోట్లు నష్టపోయి రూ.3,89,25,660.75 కోట్లకు (4.54 లక్షల కోట్ల డాలర్లు) దిగజారింది. ఒక దశలో అయితే సంపద రూ.20.16 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఒక్క హిందుస్తాన్ యునీలీవర్ తప్ప సెన్సెక్స్‌లోని 29 షేర్లు నష్టాలతో ముగిశాయి. బిఎస్ఇలో లిస్టింగ్ అయిన షేర్లలో 3515 నష్టపోగా 570 షేర్లు మాత్రం లాభాలతో ముగిశాయి. 140 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా తటస్థంగా క్లోజయ్యాయి. బిఎస్ఇలో 775 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిలకు దిగజారాయి. బిఎస్ఇ స్మాల్‌క్యాప్ సూచీ 4.13%, మిడ్‌క్యాప్ సూచీ 3.46% నష్టపోయాయి. బిఎస్ఇలోని అన్ని సెక్టోరల్ సూచీలు నష్టపోయాయి. మెటల్ సూచీ గరిష్ఠంగా 6.22% నష్టపోగా రియల్టీ (5.69%), కమోడిటీస్ (4.68%), ఇండస్ర్టియల్స్ (4.57%), కన్స్యూమర్ డిస్‌క్రెషనరీ (3.79%), ఆటో (3.77%), బ్యాంకెక్స్ (3.37%), ఐటి (2.92%), టెక్ (2.85%), ఫోకస్డ్ ఐటి (2.63%) నష్టపోయాయి. స్టాక్ ఎక్స్ఛేంజిల వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.3483.98 కోట్ల విలువ గల షేర్లు విక్రయించారు. ట్రంప్ వాణిజ్య యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 3.61% క్షీణించి 63.21 డాలర్లకు పడిపోయింది.
మట్టి కరిచిన మెటల్, ఐటి షేర్లు
మార్కెట్ కల్లోలంలో మెటల్, ఐటి కంపెనీల షేర్లు భారీ నష్టాలు నమోదు చేశాయి. మెటల్ సూచీ 6.22% నష్టపోయి 26680.16 వద్ద ముగిసింది. మెటల్ షేర్లలో నాల్కో షేరు గరిష్ఠంగా 8.18% నష్టపోగా టాటా స్టీల్ (7.73%), జెఎస్‌డబ్ల్యు స్టీల్ (7.58%), సెయిల్ (7.06%), జిందాల్ స్టీల్ అండ్ పవర్ (6.90%) నష్టపోయాయి. వేదాంత (6.90%), జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్ (6.36%), హిండాల్కో (6.26%), ఎన్ఎండిసి (5.75%), హిందుస్తాన్ జింక్ (4.89%), ఎపిఎల్ అపోలో ట్యూబ్స్ (4.77%) కూడా నష్టపోయాయి.
బిఎస్ఇ ఐటి ఇండెక్స్ 2.92% నష్టపోగా, టెక్ ఇండెక్స్ 2.85% నష్టపోయింది. ఐటి షేర్లలో ఇన్ఫోసిస్ (3.75%), హెచ్‌సిఎల్ టెక్ (3.27%), టెక్ మహీంద్రా (2.47%), ఎల్‌టిఐ మైండ్‌ట్రీ (1.72%), విప్రో (1.38%), టిసిఎస్ (0.69%) నష్టపోయాయి. ఐటి ఆధారిత సర్వీసులు అందించే ఆన్‌వర్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్ గరిష్ఠంగా 13.99% నష్టపోయింది. జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (10.80%), క్విక్ హీల్ టెక్నాలజీస్ (9.63%), జాగిల్ ప్రీపెయిడ్ ఓషెన్ సర్వీసెస్ (9.53%), డేటామాటిక్స్ (9.08%), న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ (7.94%), ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా (7.69%), హాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ (6.36%), సొనాటా సాఫ్ట్‌వేర్ (6.28%), టాటా టెక్నాలజీస్ (6.19%), ఎంఫసిస్ (5.76%) నష్టపోయిన షేర్లలో ఉన్నాయి.
ప్రపంచ మార్కెట్లలో కల్లోలం
ట్రంప్ చర్యలకు ప్రపంచ మార్కెట్లన్నీ కల్లోలితం అయ్యాయి. ట్రంప్ చర్యలపై అమెరికాలోనే తీవ్ర అసంతృప్తి వెలువడుతోంది. ఆ చర్యలను ప్రశ్నిస్తూ పలువురు నినాదాలు రాసిన ప్లకార్డులు పట్టుకుని వీధులకెక్కుతున్నారు. అమెరికన్ మార్కెట్ శుక్రవారం భారీ నష్టాలతో ముగిసింది. ఎస్ అండ్ పి 500 సూచీ 5.97% నష్టపోగా నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 5.82%, డౌ జోన్స్ 5.50% నష్టాలతో ముగిశాయి. ఈ ప్రభావం సోమవారం ప్రపంచ మార్కెట్లపై పడింది. ఆసియా దేశాలకు చెందిన సూచీల్లో హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ సూచీ 13 శాతం పైగా నష్టపోగా జపాన్‌కు చెందిన నిక్కీ 225 సూచీ 8 శాతం, షాంఘై ఎస్ఎస్ఇ కాంపోజిట్ ఇండెక్స్ 7 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 5 శాతం నష్టపోయాయి.
పాక్‌లో ట్రేడింగ్ నిలిపివేత
పాకిస్తాన్‌కు చెందిన కెఎస్ఇ-100 సూచీ 8000 పాయింట్లకు పైగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లను రక్షించేందుకు కొంత సమయం పాటు ట్రేడింగ్ నిలిపివేశారు. ట్రేడింగ్ పునరుద్ధరించిన తర్వాత కూడా సూచీ మరో 2000 పాయింట్లు నష్టపోవడంతో ఇంట్రాడేలో ఆ సూచీ 8600 పాయింట్లు దిగజారినట్టయింది. చివరికి 3882.18 పాయింట్ల (3.27%) నష్టంతో 1,14,909.48 పాయింట్ల వద్ద ముగిసింది.
పేకమేడల్లా కూలాయి
ట్రంప్ రేపిన కల్లోలంతో ప్రపంచ మార్కెట్లన్నీ పేకమేడల్లా కూలాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే అన్నారు. ఈక్విటీ మార్కెట్లే కాకుండా కమోడిటీ, మెటల్, క్రూడాయిల్ ధరలు కూడా కుప్పకూలాయని ఆయన తెలిపారు.
ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌పై ప్రభావం పరిమితంగానే ఉంటుంది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ మార్కెట్లో పాల్గొనాల్సి ఉంటుందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
ఈ వారంలో 26000 పైన బుల్లిష్
జూన్ 30-జులై 04 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ నిఫ్టీ : 25638 (+526 ) గత వారంలో నిఫ్టీ 25634 - 24825 పాయింట్ల మధ్యన కదల...

-
fo r April 25, 2019 Closing Subdued Tithi : Chaitra Krishna Saptemi Nakshatra : Poorvashadha Persons born in Mrigasira, ...
-
Stock Market created a Sunami on Monday as exit polls predicted NDA Government under Prime Minister Naredra Modi will get another term ...
-
fo r AUGUST 07 , 2019 Second Half Subdued Tithi : Sravana Sukla Saptami Nakshatra : Swathi Persons born in Krittika, Uttara,...