Monday, May 12, 2025

మార్కెట్ల‌ను ఉర‌క‌లెత్తించిన "సంధి"బ‌లం

భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య కుదిరిన కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం;  అమెరికా-చైనా మ‌ధ్య కుదిరిన సుంకాల సంధి సోమ‌వారం ప్ర‌పంచ మార్కెట్ల‌ను ఉర‌క‌లెత్తించాయి. ఆసియా, యూర‌ప్ దేశాల మార్కెట్లతో పాటు భార‌త మార్కెట్ కూడా అద్భుత లాభాలు సాధించింది. క‌డ‌ప‌టి వార్త‌లందే స‌మ‌యానికి అమెరిక‌న్ మార్కెట్లు కూడా జోరు మీదే ఉన్నాయి. భార‌త మార్కెట్ సోమ‌వారం ఉద‌యం  నుంచి మంచి జోరు మీద‌నే ట్రేడ‌యింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఒక రోజులో చారిత్ర‌క గ‌రిష్ఠ లాభం న‌మోదు చేశాయి. సెన్సెక్స్ 2975.43 పాయింట్ల లాభంతో 82429.90 వ‌ద్ద ముగిసింది. ఇంట్రా డేలో ఈ సూచీ 3041.5 పాయింట్లు లాభ‌ప‌డి 82495.97 పాయింట్ల గ‌రిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ 916.70 పాయింట్ల లాభంతో 24924.70 వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 936.80 పాయింట్లు లాభ‌ప‌డి 24944.80 స్థాయిని తాకింది. రెండు సూచీలు జీవిత‌కాలంలో ఇంత భారీగా లాభ‌ప‌డ‌డం ఇదే ప్ర‌థ‌మం. 2024 జూన్ 3వ తేదీన ఒక్క రోజులో సెన్సెక్స్ లాభ‌ప‌డిన 2507.45 పాయింట్లు, నిఫ్టీ లాభ‌ప‌డిన 733.20 పాయింట్ల రికార్డును ఈ రికార్డు చెరిపేసింది. 
రూ.16 ల‌క్ష‌ల కోట్లు లాభ‌ప‌డిన ఇన్వెస్ట‌ర్లు
ఈ అద్భుత‌మైన ర్యాలీతో ద‌లాల్ స్ట్రీట్ ఇన్వెస్ట‌ర్లు ఒక్క రోజులో రూ.16,15,275.19 కోట్లు లాభ‌ప‌డ్డారు. బిఎస్ఇలో లిస్ట‌యిన కంపెనీల మార్కెట్ విలువ  రూ.4,32,56,125.65 కోట్ల‌కు (5.05 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు) చేరింది. నిల‌క‌డ‌గా వ‌స్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబ‌డులు, మెరుగైన రిటైల్ భాగ‌స్వామ్యం ఈ జోరుకు ఇంధ‌నంగా నిలిచాయి.
విదేశీ మార్కెట్ల‌లోనూ అదే జోరు...
భార‌త‌, పాక్‌ల మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరిన నేప‌థ్యంలో విదేశీ మార్కెట్లు కూడా అదే జోరును ప్ర‌ద‌ర్శించాయి. పాకిస్తాన్‌కు చెందిన కెఎస్ఇ-100 సూచీ ఒక్క రోజులోనే 9 శాతం మేర‌కు లాభ‌ప‌డింది. ఆసియా మార్కెట్ల‌లో ద‌క్షిణ కొరియాకు చెందిన కోస్పి, షాంఘైకు చెందిన ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ అన్నీ జోరుమీదే ఉన్నాయి. 

Sunday, May 11, 2025

ఈ వారంలో 24300 పైన బుల్లిష్

మే 12-16 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 
  
నిఫ్టీ   :  24008 (-339) 
గత వారంలో నిఫ్టీ 23935 - 24526 పాయింట్ల మధ్యన కదలాడి 339 పాయింట్ల నష్టంతో 24008 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 24300 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.  

- 20, 50, 100, 200 డిఎంఏలు 24254, 24336, 24264, 23691 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 24300      బ్రేక్ డౌన్ స్థాయి : 23700

నిరోధ స్థాయిలు : 24200, 24300, 24400 (24100 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 23800, 23700, 23600 (23900 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
ü తులలోని విశాఖ పాదం 1 నుంచి ధనుస్సులోని మూల పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü వృషభంలోని కృత్తిక పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü మేషంలోని అశ్విని పాదం 3 - భరణి పాదం 1 మధ్యలో బుధ సంచారం
ü మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 4 - మీనంలోని రేవతి పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
ü కర్కాటకంలోని ఆశ్లేష పాదం 3లో కుజ సంచారం
ü వృషభంలోని మృగశిర పాదం 2 - మిథునంలోని మృగశిర పాదం 3 మధ్యలో కన్య నవాంశలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
ü  మీనంలోని పూర్వాభాద్ర  పాదం 4లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 2లో కేతువు మకర, కర్కాటక నవాంశల్లో సంచారం        


--------------------------------- 


ప్రారంభ సెషన్  మెరుగు (సోమవారానికి)  

తిథి : వైశాఖ శుక్ల పూర్ణిమ  

నక్షత్రం : విశాఖ 

అప్రమత్తం :     అశ్విని, మఖ, మూల నక్షత్ర; తుల, కుంభ రాశి జాతకులు

ట్రెండ్ మార్పు సమయం : 12.59

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.31 వరకు నిలకడగా ఉండి తదుపరి 12.45 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.53 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.30  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 24100, 24175     మద్దతు : 23925, 23850
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, May 4, 2025

ఈ వారంలో 24000 దిగువన బేరిష్    

మే 5-9 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  24347 (+308
) 
   
గత వారంలో నిఫ్టీ 24062 - 24589 పాయింట్ల మధ్యన కదలాడి 308 పాయింట్ల లాభంతో 24347 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 24000 కన్నా ఫైన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.  

- 20, 50, 100, 200 డిఎంఏలు 24351, 24270, 23812, 23500 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 24650      బ్రేక్ డౌన్ స్థాయి : 23950

నిరోధ స్థాయిలు : 24550, 24650, 24750 (24450 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 24150, 24050, 23950 (24250 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...
ü కర్కాటకంలోని ఆశ్లేష  పాదం 4 నుంచి కన్యలోని హస్త పాదం 3 మధ్యలో చంద్ర సంచారం
ü మేషంలోని భరణి పాదం 3-4 మధ్యలో రవి సంచారం 
ü మీనంలోని రేవతి పాదం 4-మేషంలోని అశ్విని పాదం 2 మధ్యలో బుధ సంచారం
ü మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
ü కర్కాటకంలోని పుష్యమి పాదం 4లో కుజ సంచారం
ü వృషభంలోని మృగశిర పాదం 2లో కన్య నవాంశలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని  ఉత్తరాభాద్ర పాదం 1లో సింహ నవాంశలో శని సంచారం
ü  మీనంలోని ఉత్తరాభాద్ర  పాదం 4లో రాహువు, కన్యలోని ఉత్తర పాదం 2లో కేతువు మకర, కర్కాటక నవాంశల్లో సంచారం        

--------------------------------- 


ప్రారంభ సెషన్  మెరుగు (సోమవారానికి)  

తిథి : వైశాఖ శుక్ల నవమి 

నక్షత్రం : ఆశ్లేష/మఖ 

అప్రమత్తం :    కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ/రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర; కర్కాటక, వృశ్చిక  రాశి జాతకులు

ట్రెండ్ మార్పు సమయం : 1.59

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ 10.59 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 1.12 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.10  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 24450, 24525     మద్దతు : 24250, 24175
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఈ వారంలో 26000 పైన బుల్లిష్

జూన్ 30-జులై 04 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  25638 (+526 )   గత వారంలో నిఫ్టీ 25634 - 24825 పాయింట్ల మధ్యన కదల...