Sunday, December 28, 2025

ఈ వారంలో 26400 పైన బుల్లిష్

డిసెంబర్ 29-జనవరి 2 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 
  
నిఫ్టీ   :  26042 (+76)    
గత వారంలో నిఫ్టీ 26236-26008 పాయింట్ల మధ్యన కదలాడి 76 పాయింట్ల లాభంతో 26042 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 26400 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.  
- 20, 50, 100, 200 డిఎంఏలు 26007, 25910, 25393, 24880 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉన్నప్పుడే దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతంగా భావించాలి. 

బ్రేకౌట్ స్థాయి : 26400      బ్రేక్ డౌన్ స్థాయి : 25700

నిరోధ స్థాయిలు : 26250, 26350, 26450 (26150 పైన బుల్లిష్) 
మద్దతు స్థాయిలు : 25825, 25725, 25625 (25925 దిగువన బేరిష్)
ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...

ü మేషంలోని అశ్విని పాదం 1 నుంచి మిథునంలోనిమృగశిర పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü  ధనుస్సులోని పూర్వాషాఢ పాదం1-2 మధ్యలో రవి సంచారం 
ü  ధనుస్సులోని మూల  పాదం 1 - 2 మధ్యలో  బుధ సంచారం
ü  ధనుస్సులోని మూల పాదం 4 - పూర్వాషాఢ  పాదం 2 మధ్యలో శుక్ర సంచారం
ü ధనుస్సులోని పూర్వాషాఢ  పాదం 3-4 మధ్యలో కుజ సంచారం
ü కర్కాటకంలోని పునర్వసు పాదం 4లో మిథున నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని పూర్వాభాద్ర పాదం 4లో  కర్కాటక నవాంశలో శని సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 4లో రాహువు, సింహంలోని పుబ్బ పాదం 2లో కేతువు మీన, కన్య నవాంశల్లో సంచారం    

--------------------------------- 

మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)

తిథి : పుష్య శుక్ల దశమి     

నక్షత్రం : అశ్విని          

అప్రమత్తం :    రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర జాతకులు

ట్రెండ్ మార్పు సమయం : 1.18

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 10.12 వరకు నిలకడగా ఉండి తర్వాత మధ్యాహ్నం 1.23 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత  చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. . 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.20 సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 26125, 26200     మద్దతు : 25950, 25850
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Tuesday, December 23, 2025

ఐపిఓ మార్కెట్లో జోష్

2025లో రూ.1.76 ల‌క్ష‌ల కోట్లు స‌మీక‌ర‌ణ‌

మ‌రి కొద్ది రోజుల్లో ముగియ‌బోతున్న 2025 సంవ‌త్స‌రంలో ప్రైమ‌రీ మార్కెట్ హ‌ల్‌చ‌ల్ చేసింది. కంపెనీలు తొలి ప‌బ్లిక్ ఇష్యూల (ఐపిఓ) బాట‌లో రికార్డు స్థాయిలో రూ.1.76 ల‌క్ష‌ల కోట్లు స‌మీక‌రించాయి. ఈ ధోర‌ణి చూస్తుంటే 2026 సంవ‌త్స‌రంలో కూడా ఇదే జోరు కొన‌సాగ‌వ‌చ్చున‌ని మార్కెట్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. మార్కెట్లో నిధుల ల‌భ్య‌త అధికంగా ఉండ‌డం, ఇన్వెస్ట‌ర్ విశ్వాసం బ‌లంగా ఉండ‌డం, స్థూల ఆర్థిక గ‌ణాంకాలు ప్రోత్సాహ‌క‌రంగా ఉండ‌డం ఇందుకు కార‌ణం. ఐపిఓ మార్గంలో నిధుల స‌మీక‌ర‌ణ‌పై ఇన్వెస్ట‌ర్ల‌లో విశ్వాసం, లిస్టింగ్ రోజున లాభాలు దండుకోవ‌చ్చున‌న్న ఇన్వెస్ట‌ర్ల ఉత్సాహం, దీర్ఘ‌కాలిక వృద్ధి అవ‌కాశాలున్న కంపెనీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న ఉత్సుక‌త ఈ సంవ‌త్స‌రం ఐపిఓ మార్కెట్‌కు ద‌న్నుగా నిలిచాయి. 

తొలి ఏడు నెల‌లు నిస్తేజ‌మే...
ఈ ఏడాది తొలి ఏడు నెల‌లు ప్రైమ‌రీ మార్కెట్ నిస్తేజంగానే ఉంది. మార్కెట్లో భారీ ఆటుపోట్లు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట‌ర్ల నిరాస‌క్త‌త‌, భౌగోళిక రాజ‌కీయ రిస్క్‌ల నేప‌థ్యంలో ఏర్ప‌డిన అప్ర‌మ‌త్త‌త ఇందుకు కార‌ణం. అయితే ఆగ‌స్టు నుంచి ప‌రిస్థితులు మెరుగుప‌డ‌డం ప్రారంభ‌మ‌యింది. ఈక్విటీ మార్కెట్లో స్థిర‌త్వం రావ‌డంతో లిస్టింగ్‌లు పెరిగాయి.
ఐపిఓ సెంట్ర‌ల్ సంక‌ల‌నం చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం 2025 సంవ‌త్స‌రంలో 103 ప్ర‌ధాన ప‌బ్లిక్ ఇష్యూలు జారీ అయ్యాయి. కంపెనీలు రూ.1.76 ల‌క్ష‌ల కోట్లు స‌మీక‌రించారు. 2024 సంవ‌త్స‌రంలో 90 కంపెనీలు ఐపిఓల ద్వారా స‌మీక‌రించిన రూ.1.6 క్ష‌ల కోట్ల క‌న్నా ఇది అధికం. ఐపిఓ బాట‌లో నిధులు స‌మీక‌రించిన కంపెనీల్లో లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ కంపెనీలున్నాయి. స‌గ‌టు ఇష్యూ ప‌రిమాణం రూ.1,700 కోట్లు దాటింది. 

ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్‌కు (ఒఎఫ్ఎస్‌) అగ్ర‌తాంబూలం
నిధుల స‌మీక‌ర‌ణ‌లో ఒఎఫ్ఎస్ ప్రాధాన్య ఎంపిక‌గా ఉంది. 2025లో కంపెనీల నిధుల స‌మీక‌ర‌ణ‌లో 60% ఈ మార్గంలోనే సాగింది. లిస్టెడ్ కంపెనీల్లో కేవ‌లం 23 కంపెనీలు పూర్తిగా తాజా పెట్టుబ‌డులు స‌మీక‌రించాయి. ఇష్యూ స‌గ‌టు ప‌రిమాణం రూ.600 కోట్లుంది. 15 కంపెనీలు పూర్తిగా ఒఎఫ్ఎస్ బాట‌లో నిధులు స‌మీక‌రించాయి. ఇవి వ‌సూలు చేసిన నిధులు రూ.45,000 కోట్లు. ఇత‌ర కంపెనీలు రెండు మార్గాల్లోనూ (ఒఎఫ్ఎస్‌/తాజా షేర్ల జారీ) నిధులు స‌మీక‌రించాయి. ఈ మిశ్ర‌మ బాట‌లో కూడా ఒఎఫ్ఎస్ వాటానే అధికంగా ఉంది. దీన్ని బ‌ట్టి ప్ర‌మోట‌ర్లు, తొలి ఇన్వెస్ట‌ర్లు కంపెనీ యాజ‌మాన్య స్ట్ర‌క్చ‌ర్‌ను మార్చ‌కుండానే స‌మ‌ర్థ‌వంత‌మైన విధానంలో త‌మ పెట్టుబ‌డుల‌ను సొమ్ము చేసుకునేందుకు ప్ర‌య‌త్నించార‌నిపిస్తోంద‌ని నిపుణులంటున్నారు. ప‌రిమిత పెట్టుబ‌డి అవ‌స‌రాలున్న ప‌రిణ‌తి చెందిన కంపెనీల‌కు ఇది ఆక‌ర్ష‌ణీయ మార్గ‌మ‌న్న‌ది వారి అభిప్రాయం.

స్టార్ట‌ప్‌ల పున‌రుజ్జీవం
ఈ ఏడాది స్టార్ట‌ప్‌ల రంగం పున‌రుజ్జీవం సాధించింది. 18 స్టార్ట‌ప్‌లు ప్రైమ‌రీ మార్కెట్ నుంచి నిధులు స‌మీక‌రించాయి. వాటిలో లెన్స్‌కార్ట్‌, గ్రో, మీషో, ఫిజిక్స్‌వాలా ప్ర‌ధాన‌మైన‌వి. 18 కంపెనీలు క‌లిసి రూ.41,000 కోట్లు స‌మీక‌రించాయి. 2024 సంవ‌త్స‌రంలో స్టార్ట‌ప్‌లు స‌మీక‌రించిన నిధుల ప‌రిమాణం రూ.29,000 కోట్లు మాత్ర‌మే ఉంది.

ఎస్ఎంఇ విభాగంలోనూ ఉప్పొంగిన‌ ఉత్సాహం
చిన్న మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల (ఎస్ఎంఇ) విభాగంలో కూడా ఐపిఓకి వెళ్లాల‌న్న ఉత్సాహం పొంగి పొర‌లింది. ఈ విభాగంలో 252 ఇష్యూలు రాగా మొత్తం రూ.11,400 కోట్ల నిధులు స‌మీక‌రించారు. 2024 సంవ‌త్స‌రంలో ఈ విభాగంలో 222 ఇష్యూల ద్వారా రూ.9,580 కోట్లు స‌మీక‌రించారు. ఈ విభాగంలో రిటైల్ ఇన్వెస్ట‌ర్ల‌కు రిస్క్ అధికంగా ఉన్న‌ప్ప‌టికీ వీటిపై కూడా ఆస‌క్తి అధికంగానే ఉన్న‌ట్టు ఈ గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. 

ఐపిఓ మార్కెట్లో ఇత‌ర ముఖ్యాంశాలు...
- 2025లో ఐపిఓకి వ‌చ్చిన పెద్ద కంపెనీల్లో టాటా కేపిట‌ల్ (రూ.15,5012 కోట్లు) అగ్ర‌స్థానంలో ఉంది. హెచ్‌డిబి ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ (రూ.12,500 కోట్లు), ఎల్‌జి ఎల‌క్ట్రానిక్స్ (రూ.11,607 కోట్లు), హెక్సావేర్ టెక్నాల‌జీస్ (రూ.8,750 కోట్లు), లెన్స్‌కార్ట్ సొల్యూష‌న్స్ (రూ.7,278 కోట్లు), బిలియ‌న్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచ‌ర్స్ (6,632 కోట్లు) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- ఈ ఏడాది జారీ అయిన అతి చిన్న ఐపిలో రూ.116.5 కోట్లు (జిన్ కుశాల్ ఇండ‌స్ట్రీస్‌). 
- హైవే ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అత్య‌ధికంగా స‌బ్‌స్ర్క‌యిబ్ అయిన ఇష్యూగా నిలిచింది. ఈ ఇష్యూ 300 రెట్లు అధిక స‌బ్‌స్క్రిప్ష‌న్ సాధించింది. 
- మూడింట రెండు వంతుల ఇష్యూలు సానుకూల రాబ‌డులు అందించాయి.
- 103 కంపెనీలు తొలి సారిగా మార్కెట్లో లిస్టింగ్ కాగా 70 కంపెనీలు లిస్టింగ్ రోజున లాభాలు అందించాయి. కేవ‌లం 32 కంపెనీలు ఇష్యూ ధ‌ర‌తో పోల్చితే త‌క్కువ ధ‌ర‌కి లిస్టింగ్ అయ్యాయి. 
----------------------------------------

2026లోనూ అదే జోరు
కొత్త సంవ‌త్స‌రంలో కూడా ఐపిఓ మార్కెట్లో అదే జోరు కొన‌సాగుతుంద‌ని విశ్లేష‌కులంటున్నారు. 75 పైగా కంపెనీలు ఇప్ప‌టికే సెబి అనుమ‌తులు పొంది ఇష్యూల జారీ కోసం ఎదురుచూస్తున్నాయి. మ‌రో 100 కంపెనీలు సెబి అనుమ‌తుల కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిలో టెక్నాల‌జీ, ఆర్థిక స‌ర్వీసులు, మౌలిక వ‌స‌తులు, ఎన‌ర్జీ, క‌న్స్యూమ‌ర్ రంగాలున్నాయి. రాబోయే భారీ ఐపిఓల్లో రిల‌య‌న్స్ జియో, ఎస్‌బిఐ మ్యూచువ‌ల్ ఫండ్‌, ఓయో, ఫోన్ పే ఉన్నాయి.

Sunday, December 21, 2025

ఈ వారంలో 26300 పైన బుల్లిష్

డిసెంబర్ 22-26 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 
  
నిఫ్టీ   :  25966 (-81) 
 
గత వారంలో నిఫ్టీ 26056-25727 పాయింట్ల మధ్యన కదలాడి 81 పాయింట్ల నష్టంతో 25966 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 26300 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.  
- 20, 50, 100, 200 డిఎంఏలు 25999, 25818, 25327, 24784 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉన్నప్పుడే దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతంగా భావించాలి. 
బ్రేకౌట్ స్థాయి : 26300      బ్రేక్ డౌన్ స్థాయి : 25600
నిరోధ స్థాయిలు : 26175, 26275, 26375 (26075 పైన బుల్లిష్) 
మద్దతు స్థాయిలు : 25750, 25650, 25550 (25850 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  
ముగింపు సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి : మార్గశిర పుష్య ద్వితీయ     

నక్షత్రం : ఉత్తరాషాఢ         

అప్రమత్తం :    ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు

ట్రెండ్ మార్పు సమయం : 10.05

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 1.51 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత  చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. . 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 26075, 26150     మద్దతు : 25875, 25775
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, December 8, 2025

ఈ వారంలో 26500 పైన బుల్లిష్

డిసెంబర్ 08-12 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  26186 (-17
) 
   
గత వారంలో నిఫ్టీ 25328-25933 పాయింట్ల మధ్యన కదలాడి 17 పాయింట్ల నష్టంతో 26186 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 26500 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది.  

- 20, 50, 100, 200 డిఎంఏలు 25968, 25612, 25247, 24631 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైన ఉన్నప్పుడే దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతంగా భావించాలి. 

బ్రేకౌట్ స్థాయి : 26500      బ్రేక్ డౌన్ స్థాయి : 25800

నిరోధ స్థాయిలు : 26500, 26700, 26800 (26286 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 26000, 25900, 25800 (26086 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------  

Ø  గ్రహగతులివే...

ü కర్కాటకంలోని పుష్యమి పాదం 1 నుంచి కన్యలోని ఉత్తర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü వృశ్చికంలోని జ్యేష్ఠ పాదం 2-3 మధ్యలో రవి సంచారం 
ü  వృశ్చికంలోని విశాఖ పాదం 4 - అనురాధ పాదం 1 మధ్యలో  బుధ సంచారం
ü  వృశ్చికంలోని అనురాధ పాదం 4 - జ్యేష్ఠ  పాదం 2 మధ్యలో శుక్ర సంచారం
ü ధనుస్సులోని మూల  పాదం 1-2 మధ్యలో కుజ సంచారం
ü కర్కాటకంలోని పునర్వసు పాదం 4లో కర్కాటక నవాంశలో వక్రగతిలో బృహస్పతి  సంచారం
ü  మీనంలోని పూర్వాభాద్ర పాదం 4లో  కర్కాటక నవాంశలో శని సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 4లో రాహువు, సింహంలోని పుబ్బ పాదం 2లో కేతువు మేష , తుల నవాంశల్లో సంచారం      

--------------------------------- 

 మిడ్ సెషన్ మెరుగు (సోమవారానికి)  

తిథి : మార్గశిర బహుళ చతుర్థి    

నక్షత్రం : పుష్యమి        

అప్రమత్తం :    భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు  

ట్రెండ్ మార్పు సమయం : 9.46  |  3.25

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 9.45 వరకు నిలకడగా ఉంటూ తదుపరి మధ్యాహ్నం 11.35 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 1.15 వరకు నిలకడగా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11.15 గంటల సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.   

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 26275, 26350     మద్దతు : 26100, 26075
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

ఈ వారంలో 26400 పైన బుల్లిష్

డిసెంబర్ 29-జనవరి 2 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్     నిఫ్టీ   :  26042 (+76 )       గత వారంలో నిఫ్టీ 26236-26008 పాయింట్ల మధ్య...