Tuesday, June 9, 2020

పాత‌కారు అయినా మాకిష్ట‌మే...

కొత్త కారు కొనుగోలు ప్ర‌స్తుతానికి లేదంటున్న క‌స్ట‌మ‌ర్లు

కొద్ది కాలం క్రితం వ‌ర‌కు సెకండ్ హ్యాండ్ లేదా ప‌లు చేతులు మారిన వాహ‌నాల కొనుగోలు అంటే ప్ర‌జ‌లు విముఖ‌త చూపే వారు. కాని క‌రోనా సృష్టించిన క‌ల్లోలం అన్ని మార్కెట్ల స్వ‌భావాల‌ను మార్చేసిన‌ట్టే కార్ల మార్కెట్ స్వ‌భావాన్ని కూడా మార్చేసింది. లాక్ డౌన్ కు ముందు వ‌ర‌కు కొత్త కారు మాత్ర‌మే కొనుగోలు చేయాల‌నుకుంటున్న‌ట్టు చెప్పిన వారిలో ఎక్కువ మంది ఇప్పుడు యూజ్డ్ కార్ల కోసం  ఎగ‌బ‌డుతున్నారు. కొంత కాలం పాటు యూజ్డ్ కారే వాడాల‌నుకుంటున్నామ‌ని చాలా మంది చెబుతున్న‌ట్టు యూజ్డ్ కార్ల విక్ర‌య సంస్థ కార్స్ 24 చీఫ్ మార్కెటింగ్ ఆఫీస‌ర్ గ‌జేంద్ర జంగీద్ తెలిపారు. గ‌త కొద్ది రోజులుగా యూజ్డ్ కార్ల కోసం క‌స్ట‌మ‌ర్ల తాకిడి బాగా పెరిగింద‌ని ఆయ‌న చెప్పారు. మారుతి స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్;   హుండై ఐ10, శాంత్రో జింగ్‌;  హోండా సిటీ కార్ల కోసం ఎక్కువ మంది వాక‌బు చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. అంతే కాదు, ప్ర‌స్తుతం న‌డుపుతున్న వాహ‌నం విక్ర‌యించే యోచ‌న కూడా చాలా మంది విర‌మించుకున్నారు. పాత‌కారుకే ముస్తాబులు చేయించుకుని కొంత కాలం పాటు న‌డ‌పాల‌నుకునే వారే ఎక్కువ‌గా ఉన్నారు. 
సొంత‌కారులోనే తిరుగుతాం
లాక్ డౌన్ అనంత‌రం సొంత‌కారులోనే తిర‌గాల‌ని భావిస్తున్న‌వారి సంఖ్య కూడా బాగా పెరిగింద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. లాక్ డౌన్ కు ముందు వ‌ర‌కు ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించుకోవాల‌ని లేదా పెట్రోల్ ఆదా చేసుకునేందుకు, నిర్వ‌హ‌ణ వ్య‌యాలు త‌గ్గించుకునేందుకు షేర్డ్ కారులో తిర‌గాల‌ని కోరుకున్న వారి సంఖ్య అధికంగా ఉండేది. కాని ఇప్పుడు దేశంలో క‌రోనా వ్యాధి తీవ్ర‌త పెరిగిపోయిన దృష్ట్యా ఎవ‌రూ ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో తిరుగుతామ‌నే సాహ‌సం చేయ‌డంలేదు. కొంత క‌ష్టం అయినా సొంత కారులోనే తిరుగుతామ‌ని, ప్ర‌స్తుతానికి అదే సుర‌క్షిత‌మైన ఎంపిక అని ప‌లువురు బ‌హిరంగంగానే చెబుతున్నారు. 

అమ్మో షాపింగా...నో, నో

క‌స్ట‌మ‌ర్ల ప్రాధాన్య‌త‌లు మారిపోయాయ్‌...
రిటైల‌ర్ల స‌ర్వేలో తేలిన నిజం
క‌రోనా వైర‌స్ సృష్టించిన అల‌జ‌డి పుణ్య‌మా అని ప‌లు వ‌ర్గాల క‌స్ట‌మ‌ర్ల ప్రాధాన్య‌త‌లు గ‌ణ‌నీయంగా మారిపోయాయి. లాక్ డౌన్ ముందు కాలంలో ఎగ‌బ‌డి షాపింగ్ కు ప‌రుగులు తీసిన వారే ఇప్పుడు షాపింగ్ ప‌ట్ల విముఖ‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దేశంలో రిటైల్ వినియోగ‌దారుల ధోర‌ణుల‌పై రిటైల‌ర్స్ అసోసియేష‌న్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ వాస్త‌వం బ‌ట్ట‌బ‌య‌లయింది. లాక్ డౌన్ ముగిసి షాపింగ్ మాల్స్, హోట‌ళ్లు ఒక్క‌టొక్క‌టిగా తెరుచుకుంటున్న ప్ర‌స్తుత త‌రుణంలో క‌స్ట‌మ‌ర్ల అభిమ‌తం తెలుసుకునేందుకు ఈ స‌ర్వే నిర్వ‌హించారు. లాక్ డౌన్ ముగిసినా దేశంలో క‌రోనా కేసులు విజృంభిస్తూ ఉండ‌డంతో ప‌లువురు ఇప్ప‌ట్లో షాపింగ్ కు వెళ్లేది లేద‌నే అభిప్రాయ‌మే ప్ర‌క‌టించారు. మొత్తం 4239 మందిని ఈ స‌ర్వేలో భాగంగా ప్ర‌శ్నించారు. మూడు నెల‌ల నిరంత‌ర లాక్ డౌన్ కార‌ణంగా కుప్ప‌కూలిన రిటైల్ రంగాన్ని అంత త్వ‌ర‌గా తిరిగి ప‌ట్టాల‌కెక్కిస్తామ‌న్న ఆశ‌లు దీనితో అంత‌రించిపోయాయి. రిటైల్ రంగం రిక‌వ‌రీ జాప్యం అవుతుంద‌నేందుకు ఇది ఒక సంకేత‌మ‌ని ఆర్ఏఐ పేర్కొంది. అలాగే క‌స్ట‌మ‌ర్ల‌లో భ‌యాన్ని పోగొట్టి వారిని షాపింగ్ కు అనుకూలంగా మార్చాలంటే పారిశుధ్యం, భ‌ద్ర‌త చ‌ర్య‌లు పెంచాల‌ని, సుర‌క్షిత‌మైన షాపింగ్ అనుభ‌వం ఉంటుంద‌న్న భ‌రోసా వారికి క‌ల్పించాల‌ని ఆ సంఘం చెబుతోంది. 
ఆర్ఏఐ స‌ర్వేలో వివిధ ప్ర‌శ్న‌ల‌కు క‌స్ట‌మ‌ర్ల నుంచి వ‌చ్చిన స‌మాధానాలిలా ఉన్నాయి...
1) షాపింగ్ వ్య‌యాలు...
ఎ) భారీగా త‌గ్గించుకుంటాం 37%
బి) త‌గ్గించుకుంటాం 41%
సి) గ‌తం క‌న్నా మార‌దు 16%

2) షాపింగ్ కు వెళ్తారా?
ఎ) వ‌చ్చే 3 నెల‌ల్లో ప్ర‌య‌త్నిస్తాం 62%
బి) 3-12 నెల‌ల్లో 32%
సి)ఇప్ప‌ట్లో అలాంటిది లేదు 6%

3) ఏ వ‌స్తువులు కొంటారు?
ఎ) ఆహారం, దుస్తులు, నిత్యావ‌స‌రాలు 52 శాతం
బి) ఎల‌క్ర్టానిక్స్ 31%
సి) సౌంద‌ర్య సాధ‌నాలు 25%

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభ సెషన్ మెరుగు 

తిథి :  జ్యేష్ఠ బహుళ పంచమి      

నక్షత్రం : శ్రవణం

అప్రమత్తం : పునర్వసు, విశాఖ, ఉత్తరాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు      

నిఫ్టీ :  10046.65 (-120.80)   

ట్రెండ్ మార్పు సమయం : 2.56

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 1.30 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 2.55 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.15  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ఉంటె షార్ట్  పొజిషన్లు తీసుకుని 2.50 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 10145, 10245        మద్దతు : 9945, 9845
----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Monday, June 8, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

ప్రారంభ సెషన్ మెరుగు 

తిథి :  జ్యేష్ఠ బహుళ చవితి     

నక్షత్రం : ఉత్తరాషాఢ/శ్రవణం 

అప్రమత్తం : ఆర్ద్ర,స్వాతి, శతభిషం/పునర్వసు, విశాఖ, ఉత్తరాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు      

నిఫ్టీ :  10167.45 (+25.30)   

ట్రెండ్ మార్పు సమయం : 1.59

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 1.30 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.15  సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.45 సమయానికి ఎటిపి కన్నా దిగువన ఉంటె తిరిగి షార్ట్  పొజిషన్లు తీసుకుని 3.15 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 10270, 10370        మద్దతు : 10070, 9970
----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Sunday, June 7, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

9825 దిగువన ముగిస్తే బేరిష్ 

(8 జూన్ - 12 జూన్ 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  10142 (+562)

గత వారంలో నిఫ్టీ 9824-10178 పాయింట్ల మధ్యన కదలాడి 562 పాయింట్ల లాభంతో 10178 వద్ద ముగిసింది. ఈ వారంలో 9825 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 9386, 9090, 10319, 10965 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువనే ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 10450      బ్రేక్ డౌన్ స్థాయి : 9825

నిరోధ స్థాయిలు : 10300, 10375, 10450 (10225 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 9975, 9900, 9825 (10050 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

--------------------------------- 

గ్రహగతులివే... 

- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4 నుంచి కుంభంలోని శతభిషం పాదం 4 మధ్యలో చంద్ర సంచారం 

- వృషభంలోని మృగశిర పాదం 1-2 మధ్యలో సూర్య సంచారం 

- మిథునంలోని మృగశిర ఆర్ద్ర పాదం 1 మధ్యలో బుధ సంచారం 

- వృషభంలోని రోహిణి పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం 

- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 1-2 మధ్యలో కుజ సంచారం

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 4లో మీన నవాంశలో వక్రగతిలో శని సంచారం 

-  మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 4లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 2లో కేతువు వృశ్చిక, వృషభ నవాంశల్లో సంచారం 

--------------------------------- 
సాధారణంగా మెరుగు (సోమవారానికి)

తిథి :  జ్యేష్ఠ బహుళ తదియ    

నక్షత్రం : పూర్వాషాఢ/ఉత్తరాషాఢ 

అప్రమత్తం : మృగశిర, చిత్త, ధనిష్ఠ/ఆర్ద్ర,స్వాతి, శతభిషం నక్షత్ర; మకర, వృషభ రాశి జాతకులు      

నిఫ్టీ :  10029.10 (-32.45)   

ట్రెండ్ మార్పు సమయం : 1.43

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 11.05 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 1.10 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 3.05 వరకు మెరుగ్గా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 11 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.15 సమయానికి ఎటిపి కన్నా పైనే  ఉంటె తిరిగి లాంగ్  పొజిషన్లు తీసుకుని 3 గంటల సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 10240, 10340        మద్దతు : 10040, 9940
----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనిగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Thursday, June 4, 2020

బ్యాంకుల గుండెల్లో ఎన్ పిఏ గుబుల్‌

కోవిడ్‌-19ని అదుపు చేసేందుకు ఇటీవ‌ల ఆర్ బిఐ, ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు చ‌ర్య‌ల ప్ర‌భావం వ‌ల్ల ఈ ఏడాది బ్యాంకుల ఎన్ పిఏలు (మొండి బ‌కాయిలు) భారీగా పెరిగిపోనున్నాయి. ఈ ఏడాది మార్చి చివ‌రి నాటికి 8.6 శాతం ఉన్న ఈ ఎన్ పిఏలు వ‌చ్చే ఏడాదికి 11.6 శాతానికి దూసుకుపోవ‌చ్చునంటున్నారు. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు ప్రామాణిక రుణాలుగా ఉన్న వాటిలో 5.5 శాతం ఖాతాలు తాజాగా ఎన్ పిఏల్లోకి జారుకోవ‌చ్చున‌ని కూడా అంటున్నారు. ఇటీవ‌ల చ‌ర్య‌ల ప్ర‌భావం వ‌ల్ల బ్యాంకుల రుణ‌విత‌ర‌ణ బాధ్య‌త పెరిగిపోవ‌డంతో పాటు ఆదాయాల‌పై తీవ్ర‌ ప్ర‌భావం ప‌డుతుంద‌ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చెబుతోంది. ఇలాంటి వాతావ‌ర‌ణంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు ఈ ఏడాది రూ.45 వేల కోట్ల నుంచి రూ.82500 కోట్ల వ‌ర‌కు అద‌న‌పు పెట్టుబ‌డుల మ‌ద్ద‌తు అవ‌స‌రం కావ‌చ్చున‌ని అంచ‌నా వేసింది. లాక్ డౌన్  ప్ర‌భావం వ‌ల్ల రుణ గ్ర‌హీత‌ల రుణాల చెల్లింపు సామ‌ర్థ్యం భారీగా దెబ్బ తిన్న‌ద‌ని తేల్చి చెప్పింది. బ్యాంకులు ఎన్ పిఏల కోసం చేసుకునే కేటాయింపులు ఈ ఏడాది భారీగా ఉండ‌వ‌చ్చున‌ని, దీని ప్ర‌భావం వ‌ల్ల వ‌రుస‌గా ఆరో ఏడాది కూడా భారీ న‌ష్టాలు న‌మోదు చేసే ఆస్కారం ఉన్న‌ద‌ని క్రిసిల్ తెలిపింది. 

భారీగా క్షీణించిన వినియోగ విశ్వాసం

ఈ ఏడాది వృద్ధి -1.5%
వ‌చ్చే ఏడాది అద్భుత‌మైన రిక‌వ‌రీ

కొవిడ్‌-19, దీర్ఘ‌కాలిక లాక్ డౌన్ ప్ర‌భావం వ‌ల్ల‌ దేశంలో్ వినియోగ విశ్వాసం గ‌ణ‌నీయంగా క్షీణించింద‌ని, ఫ‌లితంగా ఈ ఏడాది ఆర్థిక రంగం 1.5 శాతం ప్ర‌తికూల వృద్ధిని న‌మోదు చేయ‌వ‌చ్చున‌ని ఆర్ బిఐ చెబుతోంది. మే నెల‌కు నిర్వ‌హించిన వినియోగ విశ్వాస స‌ర్వేను ఆర్ బిఐ గురువారం విడుద‌ల చేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల సూచి (సిఎస్ఐ) చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయికి క్షీణించ‌గా భ‌విష్య‌త్ అంచ‌నాల సూచి (ఎఫ్ఇఐ) కూడా భారీ క్షీణ‌త‌ను న‌మోదు చేసిన‌ట్టు ఆర్ బిఐ నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌స్తుతానికి వృద్ధిరేటు క్షీణించినా 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో మాత్రం వృద్ధిరేటు 7.2 శాతం వ‌ర‌కు ఉండ‌వ‌చ్చున‌ని తెలిపింది. ప్ర‌స్తుతం మాత్రం సాధార‌ణ ఆర్థిక స్థితిపై అంచ‌నాలు, ఉపాధి అవ‌కాశాలు, గృహ‌రంగంలో ఆదాయాలు భారీ ప్ర‌తికూల వృద్ధిని న‌మోదు చేశాయ‌ని ప‌లువురు ప్ర‌క‌టించారు. 

స‌ర్వే తీరు...
మే 5-17 తేదీల మ‌ధ్య‌న స‌ర్వే మొత్తం 13 న‌గ‌రాల్లో ప్ర‌స్తుత  క‌రోనా వాతావ‌ర‌ణంలో టెలిఫోనిక్ సంభాష‌ణ రూపంలో జ‌రిగింది. స‌ర్వే జ‌రిగిన ప్ర‌ధాన న‌గ‌రాల్లో అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళురు, చెన్నై, ఢిల్లీ, హైద‌రాబాద్‌, కోల్క‌తా, ల‌క్నో, ముంబై, పాట్నా ఉన్నాయి. మొత్తం 5761 మంది గృహ‌స్థుల‌ను ఈ సర్వేలో ప్ర‌శ్నించారు. 

స‌ర్వే ముఖ్యాంశాలు...వాస్త‌వ‌ తుది వినియోగ వ్య‌యం (పిఎఫ్ సిఇ) 0.5 శాతం క్షీణించ‌వ‌చ్చు. వ‌చ్చే ఏడాది 6.9 శాతానికి పుంజుకోవ‌చ్చు.వాస్త‌వ స్థూల పెట్టుబ‌డుల క‌ల్ప‌న (జిఎఫ్ సిఎఫ్‌) -6.4 శాతానికి ప‌డిపోయి వ‌చ్చే ఏడాది 5.6% వృద్ధి న‌మోదు చేయ‌వ‌చ్చు.వాస్త‌వ స్థూల విలువ జోడింపు (జివిఏ) -1.7 శాతానికి దిగ‌జారి వ‌చ్చే ఏడాది 6.8% వృద్ధికి పుంజుకోవ‌చ్చు.ఈ ఏడాదికి ఉద్యోగావ‌కాశాల‌పై పూర్తి నిరాశావ‌హ స్థితి నెల‌కొని ఉంది. -వినియోగ‌దారులు త‌మ విచ‌క్ష‌ణాపూర్వ‌క ఖ‌ర్చుల‌ను భారీగా కుదించుకున్నారు. ఏడాది చివ‌రి వ‌ర‌కు ఇదే ధోర‌ణి కొన‌సాగ‌వ‌చ్చు. 

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

తొలి సెషన్ మెరుగు 

తిథి :  జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి   

నక్షత్రం : అనురాధ 

అప్రమత్తం :  భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర; ధనుస్సు, మేష రాశి జాతకులు      

నిఫ్టీ :  10029.10 (-32.45)   

ట్రెండ్ మార్పు సమయం : 11.09

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.30 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 12.35 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.45 వరకు నిలకడగా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 10.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 2.45 సమయానికి ఎటిపి కన్నా దిగువన  ఉంటె షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 10125, 10225        మద్దతు : 9920, 9820
----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనిగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

Wednesday, June 3, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ మెరుగు 

తిథి :  జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి   

నక్షత్రం : విశాఖ 

అప్రమత్తం : అశ్విని. మఖ, మూల నక్షత్ర;  వృశ్చిక, మీన రాశి జాతకులు 

నిఫ్టీ :  10061.55 (+82.45)   

ట్రెండ్ మార్పు సమయం : 1.06

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.25 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 12.35 వరకు నిలకడగా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.40 వరకు మెరుగ్గా ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 10.25 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.45 సమయానికి ఎటిపి కన్నా పైనే ఉంటె తిరిగి  లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.30 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 10150, 10225        మద్దతు : 9960, 9875
----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.  
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయంతంగా ట్రేడ్ చేయండి... 

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

Tuesday, June 2, 2020

ఆస్ట్రో టెక్నికల్ గైడ్

మిడ్ సెషన్ మెరుగు 

తిథి :  జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి  

నక్షత్రం : స్వాతి 

అప్రమత్తం : ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర;  వృశ్చిక, మీన రాశి జాతకులు 

నిఫ్టీ :  9979.10 (+152.95)   

ట్రెండ్ మార్పు సమయం : 9.47; 3.14 

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.40 వరకు నిస్తేజంగా ఉంది తదుపరి 12.45 వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. ఆ తర్వాత 2.50 వరకు నిలకడ ఉండి తదుపరి చివరి వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : 9.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 10.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.45 సమయానికి ఎటిపి కన్నా పైకి వస్తే  లాంగ్ పొజిషన్లు తీసుకుని 2.45 సమయానికి క్లోజ్ చేసుకోవచ్చు. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 10080, 10180        మద్దతు : 9880, 9780
----------------------------------------------- 
సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు.  
గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయంతంగా ట్రేడ్ చేయండి... 

- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్ 

రెపోరేటు య‌థాత‌థం

ప‌శ్చిమాసియా సంక్షోభం ప్ర‌త్యేకించి అమెరికా-ఇరాన్ యుద్ధం ప్ర‌పంచ ఆర్థిక వ్యవ‌స్థ‌ల‌ను భ‌య కంపితుల్ని చేస్తున్న వాతావ‌ర‌ణంలో భార‌త రిజ‌ర్వ్ బ...