Friday, July 31, 2020

విదేశీ మార‌కం నిల్వ‌లు 52,263 కోట్ల డాల‌ర్లు


మ‌రో స‌రికొత్త రికార్డు
భార‌త విదేశీ మార‌కం నిల్వ‌లో జూలై 24వ తేదీతో ముగిసిన వారంలో 499 కోట్ల డాల‌ర్లు పెరిగి స‌రికొత్త జీవిత కాల గ‌రిష్ఠ స్థాయి 52,263 కోట్ల డాల‌ర్ల‌కు చేరాయి. బంగారం నిల్వ‌ల విలువ పెర‌గ‌డం ఇందుకు కార‌ణ‌మ‌ని ఆర్‌బిఐ తెలిపింది. క‌రోనా సంక్షోభంతో అల్లాడుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఎంతో కీల‌కం అయిన విదేశీ మార‌కం నిల్వ‌లు జూన్ 5వ తేదీతో ముగిసిన వారంలో తొలిసారి 50 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల మైలురాయిని దాటాయి.  మొత్తం విదేశీ మార‌కం నిల్వ‌ల్లో అధిక వాటా ఉండే విదేశీ క‌రెన్సీ ఆస్తులు జూలై 24తో ముగిసిన‌ వారంలో 360 కోట్ల డాలర్ల మేర‌కు పెరిది 48,048 కోట్ల డాల‌ర్ల‌కు చేరాయి. బంగారం నిల్వ‌ల విలువ 135.7 కోట్ల డాల‌ర్లు పెరిగి 3610 కోట్ల డాల‌ర్ల‌యింది. ఐఎంఎఫ్ వ‌ద్ద భార‌త విదేశీ నిల్వ‌లు 2.5 కోట్ల డాల‌ర్లు పెరిగి 458.5 కోట్ల డాల‌ర్ల‌కు చేరింది. 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...