Sunday, August 2, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

10800 దిగువన బేరిష్ 

(3-7 ఆగస్ట్ 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  11073 (-121)

గత వారంలో నిఫ్టీ 11027-11341 పాయింట్ల మధ్యన కదలాడి 121 పాయింట్ల నష్టంతో 11073 వద్ద ముగిసింది. ఈ వారంతంలో 10800 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 10952, 10753, 9753, 10861 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువనే ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 11375      బ్రేక్ డౌన్ స్థాయి : 10775

నిరోధ స్థాయిలు : 11225, 11300, 11375 (11150 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 10925, 10850, 10775 (11000 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------    
 గ్రహగతులివే...  

 మకరంలోని శ్రవణం పాదం 1 నుంచిమీనంలోనిఉత్తరాభాద్ర పాదం 1 మధ్యలో చంద్ర సంచారం 

- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 1-2 మధ్యలో రవి సంచారం 

- కర్కాటకంలోని పునర్వసు పాదం 3-4 మధ్యలో బుధ సంచారం 

- వృషభంలోని మృగశిర పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం 

- మీనంలోని రేవతి పాదం 2-3 మధ్యలో కుజ సంచారం

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 3లో కుంభ నవాంశలో వక్రగతిలో శని సంచారం 

-  ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 4లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 1లో కేతువు వృశ్చిక, వృషభ నవాంశల్లో సంచారం 
--------------------------------- 
ముగింపు సెషన్ మెరుగు 

తిథి :  శ్రావణ శుక్ల పూర్ణిమ     

నక్షత్రం : శ్రవణం    

అప్రమత్తం : పునర్వసు, విశాఖ, ఉత్తరాభాద్ర నక్షత్ర; కుంభ, మిథున రాశి జాతకులు   
 
నిఫ్టీ :  11073.45      (-27.70)   

ట్రెండ్ మార్పు సమయం : 1.27

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 2.30 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి చివరి వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  9.30 సమయానికి ఎటిపి కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2.30 సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  ఆ తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 11150, 11225        మద్దతు : 11000, 10925
-----------------------------------------------  

సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా...