Sunday, June 4, 2023

వారంలో 18300 దిగువన బేరిష్

 జూన్ 5 - 9 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్ 

నిఫ్టీ   :  18534 (+35)

గత వారంలో నిఫ్టీ 18662 - 18465  పాయింట్ల మధ్యన కదలాడి 35 పాయింట్ల లాభంతో 18534 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 18300 కన్నా ఫైన దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 18193, 17861, 17925, 17846 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 18935      బ్రేక్ డౌన్ స్థాయి : 18135

నిరోధ స్థాయిలు : 18735, 18835, 18935 (18635 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 18335, 18235, 18135 (18435 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
-------------------------------------- 

Ø  గ్రహగతులివే...
ü  ధనుస్సులోని మూల పాదం 2 నుంచి కుంభంలోని ధనిష్ట పాదం 4 మధ్యలో చంద్ర సంచారం
ü  వృషభంలోని రోహిణి పాదం 2 - మృగశిర పాదం 1 మధ్యలో రవి సంచారం 
ü  వృషభంలోని కృత్తిక పాదాలు  1 - 2  మధ్యలో బుధ సంచారం
ü మిథునంలోని పునర్వసు పాదం 3 - కర్కాటకంలోని పునర్వసు పాదం 4 మధ్యలో శుక్ర సంచారం
ü  కర్కాటకంలోని పుష్యమి పాదం 4 - ఆశ్లేష పాదం 1 మధ్యలో  కుజ సంచారం
ü  మేషంలోని   అశ్విని పాదం 4 లో కర్కాటక నవాంశలో బృహస్పతి సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 2లో మకర నవాంశలో శని సంచారం
ü  మేషంలోని అశ్విని పాదం 3లో రాహువు, తులలోని స్వాతి పాదం 1లో కేతువు మిథున, ధనుస్సు నవాంశల్లో సంచారం 

--------------------------------- 


మిడ్ సెషన్ మెరుగు  (సోమవారానికి)  

తిథి : జ్యేష్ఠ బహుళ విదియ                                        

నక్షత్రం : మూల                         
అప్రమత్తం :    రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర; మకర, వృషభ  రాశి  జాతకులు   
ట్రెండ్ మార్పు సమయం : 14.23
ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ ఉదయం 11.12 వరకు నిలకడగా ట్రేడవుతూ తదుపరి 1.20 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది.ఆ తర్వాత చివరి వరకు నిలకడగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. 
ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11.15 సమయానికి ఎటిపి కన్నా పైన ట్రేడవుతుంటే లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.15 సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం : 18590, 18635     మద్దతు : 18450, 18390
----------------------------------------------  

సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఈ వారంలో 22775 పైన బుల్లిష్

మే 6-10 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్    నిఫ్టీ   :  22476 (+56)   గత వారంలో నిఫ్టీ 22863 - 22348 పాయింట్ల మధ్యన కదలాడి 56 పాయి...