Sunday, February 11, 2024

ఈ వారంలో 22100 పైన బుల్లిష్

ఫిబ్రవరి 12-16 తేదీల మధ్య వారానికి ఆస్ట్రో టెక్నికల్ గైడ్   

నిఫ్టీ   :  21783 (-71) 
   
గత వారంలో నిఫ్టీ 22127 - 21727 పాయింట్ల మధ్యన కదలాడి 71 పాయింట్ల నష్టంతో  21783 వద్ద ముగిసింది. రాబోయే వారాంతంలో 22100 కన్నా పైన ముగిస్తే స్వల్ప కాలానికి బుల్లిష్ అవుతుంది. 

- 20, 50, 100, 200 డిఎంఏలు 21677, 21407, 20182, 19757 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200  డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాల బుల్లిష్  ట్రెండ్ సంకేతం. 

బ్రేకౌట్ స్థాయి : 22100        బ్రేక్ డౌన్ స్థాయి : 21475

నిరోధ స్థాయిలు : 21975, 22075, 22175 (21875 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 21675, 21575, 21745 (21675 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం
--------------------------------------    

Ø  గ్రహగతులివే...
ü కుంభంలోని పూర్వాభాద్ర పాదం 3 నుంచి వృషభంలోని కృత్తిక పాదం 2 మధ్యలో చంద్ర సంచారం
ü మకరంలోని ధనిష్ట పాదం 2-3 మధ్యలో రవి సంచారం 
ü మకరంలోని శ్రవణం పాదం 3-ధనిస్ట పాదం 1 మధ్యలో బుధ సంచారం
ü మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
ü  మకరంలోని  ఉత్తరాషాడ  పాదం 3-4 మధ్యలో  కుజ సంచారం
ü మేషంలోని భరణి  పాదం 1లో సింహ నవాంశలో బృహస్పతి  సంచారం
ü  కుంభంలోని శతభిషం పాదం 3లో కుంభ నవాంశలో శని సంచారం
ü  మీనంలోని రేవతి పాదం 3లో రాహువు, కన్యలోని చిత్త పాదం 1లో కేతువు కుంభ, సింహ నవాంశల్లో సంచారం     

--------------------------------- 


మిడ్ సెషన్ వరకు మెరుగు (సోమవారానికి)  
తిథి :  మాఘ శుక్ల తదియ                                                          
నక్షత్రం : పూర్వాభాద్ర      
అప్రమత్తం :   అశ్విని, మఖ, మూల నక్షత్ర; మీన, సింహ  రాశి  జాతకులు  
ట్రెండ్ మార్పు సమయం : 9.34, 2.55

ఇంట్రాడే ట్రెండ్ : నిఫ్టీ మధ్యాహ్నం 12.12 వరకు మెరుగ్గా ఉంటూ ఆ తర్వాత 2.12 వరకు నిస్తేజంగా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. తదుపరి  చివరి వరకు తిరిగి మెరుగ్గా  ట్రేడ్ కావచ్చు. 

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 10 గంటల సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 12.10  గంటల సమయంలో క్లోజ్ చేసుకోవాలి. 2.30 తర్వాత కూడా ఎటిపి కన్నా ఫైన ఉంటె మరిన్ని లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

టెక్నికల్ స్థాయిలు... 
నిరోధం : 21880, 21980     మద్దతు : 21680, 21580
--------------------------------------------  
సూచన  

v  నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలిబుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు

v  మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  

v  పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి

v  ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు 


గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...