Tuesday, September 16, 2025

ఐదేళ్ల‌లో నిర్మాణ రంగం రూ.31 ల‌క్ష‌ల కోట్లు

భార‌త నివాస గృహాల నిర్మాణ ప‌రిశ్ర‌మ 2030 నాటికి 35,000 కోట్ల డాల‌ర్ల‌కు (రూ.30.80 ల‌క్ష‌ల కోట్లు) చేరుతుంద‌ని అంచ‌నా. భారీగా విస్త‌రిస్తున్న న‌గ‌రీక‌ర‌ణ‌, పెరుగుతున్న ఆదాయాలు, ప్ర‌భుత్వ విధాన‌ప‌ర‌మైన చొర‌వ‌లు ఇందుకు దోహ‌ద‌ప‌డే అంశాల‌ని డెలాయిట్ తాజా నివేదిక‌లో తెలిపింది. "బిల్డింగ్ బియాండ్ బేసిక్స్ :  ఇన్నోవేష‌న్స్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియాస్ లివింగ్ స్పేసెస్" పేరిట ఆ నివేదిక రూపొందించారు. భార‌త నిర్మాణ‌, నిర్మాణ రంగ ప‌రిక‌రాల ప‌రిశ్ర‌మ స‌రికొత్త కూడ‌లిలో నిలిచింద‌ని; ప్ర‌త్యేకించి భ‌వ‌న నిర్మాణ ప‌రిక‌రాల ప‌రిశ్ర‌మ 9.6% వృద్ధిని న‌మోదు చేయ‌నున్న‌ద‌ని తెలిపింది. 2025 ఆర్థిక సంవ‌త్స‌రంలో 10,500 కోట్ల డాల‌ర్లున్న(రూ.9.24 ల‌క్ష‌ల కోట్లు) ఈ ప‌రిశ్ర‌మ 2030 నాటికి 16,600 కోట్ల డాల‌ర్ల‌కు (రూ.14.60 ల‌క్ష‌ల కోట్లు) చేరుతుంద‌ని అంచ‌నా వేసింది. 

ఆ నివేదిక‌లోని ముఖ్యాంశాలు

- భార‌త కన్స్యూమ‌ర్ ఎల‌క్ర్టిక‌ల్స్ ప‌రిశ్ర‌మ 2030 నాటికి 185 కోట్ల డాల‌ర్ల‌కు (రూ.16,280 కోట్లు) చేర‌వ‌చ్చు.

- ఇంధ‌న సామ‌ర్థ్యం గ‌ల ఉత్ప‌త్తుల వినియోగ ధోర‌ణులు, విధాన‌ప‌ర‌మైన మ‌ద్ద‌తు ఈ మ‌ద్ద‌తును కొన‌సాగిస్తుంది. ప్ర‌ధానంగా రెసిడెన్షియ‌ల్ వైర్లు, కేబుళ్లు, ఫ్యాన్లు, లైటింగ్‌, స్విచ్‌లు, ఫ్యూజ్‌లు, స్విచ్ గేర్లు ఇందులో ఉన్నాయి.

వివిధ విభాగాల వృద్ధి అంచ‌నాలు...

- క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ర్టిక‌ల్స్ ప‌రిశ్ర‌మ‌లో బ్రాండెడ్ ఉత్ప‌త్తుల వాటా 2023లో 76% ఉండ‌గా 2027 నాటికి 82 శాతానికి చేరుతుంద‌ని అంచ‌నా.

- హోమ్ ఫ‌ర్నిచ‌ర్, డెకార్ మార్కెట్ ప్ర‌స్తుతం 3800 కోట్ల డాల‌ర్లుండ‌గా (రూ.3.34 ల‌క్ష‌ల‌ కోట్లు) 6200 కోట్ల డాల‌ర్ల‌కు (రూ.5.46 ల‌క్ష‌ల‌ కోట్లు) చేరుతుంద‌ని అంచ‌నా.

- సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ లాక్‌లు, డోర్ ఫోన్లు, డోర్‌బెల్ కెమెరాలు, మోష‌న్ సెన్స‌ర్లు, ప్ర‌మాదాల‌ను నివారించే డివైస్‌లు వంటి హోమ్ సెక్యూరిటీ మార్కెట్ 2030 సంవ‌త్స‌రం నాటికి 18% స‌గ‌టు వార్షిక స‌మీకృత వృద్ధితో 440 కోట్ల డాల‌ర్ల‌కు (రూ.38,720 కోట్లు) చేరుతుంద‌ని అంచ‌నా.

- పెయింట్లు, నిర్మాణ రంగంలో ఉప‌యోగించే ర‌సాయ‌నాల ప‌రిశ్ర‌మ 20230 నాటికి 153 కోట్ల డాల‌ర్ల‌కు (రూ.13,464 కోట్లు) చేరుతుంద‌ని అంచ‌నా. 

- సిరామిక్ టైల్స్, విట్రిఫైడ్‌/  పోర్సెక్లైన్ టైల్స్‌, వినైల్ ఫ్లోరింగ్‌, మార్బుల్స్ అండ్ ర‌గ్స్ ప‌రిశ్ర‌మ కూడా ప్ర‌స్తుతం 107 కోట్ల డాల‌ర్ల (రూ.9,416  కోట్లు)  నుంచి  162 కోట్ల డాల‌ర్ల‌కు (రూ.14,256 కోట్లు) చేరుతుంద‌ని అంచ‌నా.

No comments:

Post a Comment

ఐదేళ్ల‌లో నిర్మాణ రంగం రూ.31 ల‌క్ష‌ల కోట్లు

భా ర‌త నివాస గృహాల నిర్మాణ ప‌రిశ్ర‌మ 2030 నాటికి 35,000 కోట్ల డాల‌ర్ల‌కు (రూ.30.80 ల‌క్ష‌ల కోట్లు) చేరుతుంద‌ని అంచ‌నా. భారీగా విస్త‌రిస్తున్...