Sunday, August 9, 2020

ఈ వారం ఆస్ట్రో టెక్నికల్ గైడ్

10925 దిగువన బేరిష్ 

(10-14 ఆగస్ట్ 2020 మధ్య వారానికి)

నిఫ్టీ   :  11214 (+141)

గత వారంలో నిఫ్టీ 10882-11257 పాయింట్ల మధ్యన కదలాడి 141 పాయింట్ల లాభంతో 11214 వద్ద ముగిసింది. ఈ వారంతంలో 10925 కన్నా దిగువన ముగిస్తే స్వల్ప కాలానికి బేరిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 డిఎంఏలు 11035, 10574, 9780, 10851 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50  డిఎంఏ 200  డిఎంఏ కన్నా దిగువనే ఉండడం దీర్ఘకాల బేరిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి : 11515      బ్రేక్ డౌన్ స్థాయి : 10925

నిరోధ స్థాయిలు : 11365, 11440, 11515 (11290 పైన బుల్లిష్) 

మద్దతు స్థాయిలు : 11065, 10990, 10915 (11140 దిగువన బేరిష్)

ఇన్వెస్టర్లకు సూచన : వారం ప్రారంభ స్థాయి కీలకం. ఆ పైన మాత్రమే పొజిషన్లు శ్రేయస్కరం. 

---------------------------------    

 గ్రహగతులివే...

మేషంలోని అశ్విని పాదం 3 నుంచి వృషభంలోని మృగశిర పాదం 2 మధ్యలో చంద్ర సంచారం

- కర్కాటకంలోని ఆశ్లేష పాదం 3-4 మధ్యలో రవి సంచారం


- కర్కాటకంలోని పుష్యమి పాదం 4 నుంచి ఆశ్లేష పాదం 3 మధ్యలో బుధ సంచారం 

- మిథునంలోని ఆర్ద్ర పాదం 1-2 మధ్యలో శుక్ర సంచారం 

- మీనంలోని రేవతి పాదం 4లో కుజ సంచారం

- ధనుస్సులోని పూర్వాషాఢ పాదం 4లో వృశ్చిక నవాంశలో వక్రగతిలో బృహస్పతి సంచారం   

- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర నవాంశలో వక్రగతిలో శని సంచారం 

- మిథునంలోని మృగశిర పాదం 3లో రాహువు, ధనుస్సులోని మూల పాదం 1లో కేతువు తుల, మేష నవాంశల్లో సంచారం 
--------------------------------- 
ప్రారంభ సెషన్ మెరుగు (సోమవారానికి)

తిథి :  శ్రావణ బహుళ సప్తమి      

నక్షత్రం : అశ్విని 

అప్రమత్తం : రోహిణి, హస్త, శ్రవణం  నక్షత్ర; వృషభ, కన్య రాశి జాతకులు   
 
ట్రెండ్ మార్పు సమయం : 3.19

ఇంట్రా డే ధోరణి : గ్రహ గతులను బట్టి నిఫ్టీ 10.20 వరకు నిస్తేజంగా ఉండి తదుపరి 12.25 వరకు మెరుగ్గా ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 3.30 వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు.  

ట్రేడింగ్ వ్యూహం : నిఫ్టీ ఫ్యూచర్స్  10.30 సమయానికి ఎటిపి కన్నా ఫైన ట్రేడవుతుంటే తగు స్టాప్ లాస్ తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 12.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 12.45 తర్వాత ఎటిపి కన్నా దిగువన  ఉంటె షార్ట్ పొజిషన్లు తీసుకుని 3.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి.  

టెక్నికల్ స్థాయిలు... 

నిరోధం :11285, 11350        మద్దతు : 11135, 11075
-----------------------------------------------  


సూచన 
- నిరోధ స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే గరిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బుల్లిష్ లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు పరిశీలించవచ్చు. 
- మద్దతు స్థాయిలు మధ్యాహ్న సెషన్ లోపు తాకినట్టయితే కనిష్ఠ  స్థాయిల్లో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గర్ స్థాయి వరకు పుల్ బ్యాక్ ఏర్పడితే రిస్క్ భరించగల ట్రేడర్లు లాంగ్ పొజిషన్లు పరిశీలించవచ్చు.  
- పైన ఇచ్చిన ఇంట్రా డే ధోరణి పూర్తిగా గ్రహగతుల ఆధారంగా ఇచ్చినదే. కానీ సరైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ట్రో సూచనను టెక్నాకల్స్ తో జత చేసి గమనించుకోవాలి.  
- ఇంట్రా ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆస్ట్రో సూచనను వాస్తవిక మార్కెట్ కదలికలతో జత చేసి చూసుకోవాలి. టెక్నికల్స్ కు అదనంగా ఇది ఒక సాధనం మాత్రమే. వ్యక్తిగత ఖగోళ చార్ట్ ఆధారంగా లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రో పండితుడు కేవలం ఏమి జరగవచ్చు అనేది సూచనగా చెబుతాడు. ఫై విశ్లేషణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణయాలకు మా బాధ్యత లేదు. 

గట్టి స్టాప్ లాస్ పాటించండి. క్రమశిక్షణతో విజయవంతంగా ట్రేడ్ చేయండి. 

- డాక్టర్ భువనగిరి అమరనాథ శాస్త్రి, ఆస్ట్రో టెక్నికల్ అనలిస్ట్ 

No comments:

Post a Comment

మే నెల‌లోనూ మార్కెట్లు ముందుకే...

స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటూనే కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. అయితే ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా...