Tuesday, March 31, 2020

మార్కెట్ కు ఎంత క‌ష్టం

ఏడాది చివ‌రి రోజు లాభాలు
కొంప ముంచిన క‌రోనా
స్టాక్ మార్కెట్ ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి రోజున లాభాల‌తో ముగిసింది. అయితే ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తం మీద భారీగా న‌ష్ట‌పోయింది. మార్చి చివ‌రిలో క‌రోనా వ్యాప్తి వ‌ల్ల ఏర్ప‌డిన భ‌యాల‌తో మార్కెట్లు భారీ క్షీణ‌త‌లు న‌మోదు చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం. క‌రోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటూ ఉండ‌డం, ఆసియా మార్కెట్లు లాభాల్లో న‌డ‌వ‌డం, చైనాలో మాన్యుఫాక్చ‌రింగ్ ఇండెక్స్ పెర‌గ‌డం వంటి చ‌ర్య‌లు ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ బ‌ల‌ప‌డేలా చేశాయ‌ని ట్రేడ‌ర్లంటున్నారు. ఫిబ్ర‌వ‌రిలో రికార్డు స్థాయిలో 35.7 పాయింట్ల‌కు ప‌డిపోయిన చైనా మాన్యుఫాక్చ‌రింగ్ పిఎంఐ మార్చిలో 52 పాయింట్ల‌కు దూసుకుపోయింది. అలాగే టోక్యో మిన‌హా షాంఘై, హాంకాంగ్‌, సియోల్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. ఈ వార్త‌లు భార‌త మార్కెట్ లో ఉత్తేజం నింపాయి. సెన్సెక్స్ రోజంతా లాభాల‌తో న‌డిచి చివ‌రికి 1028.17 పాయింట్ల లాభంతో 29468.49 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 316.65 పాయింట్లు లాభ‌ప‌డి 8597.75 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. అన్ని సెక్టోర‌ల్ సూచీలు లాభాల‌తో ముగిశాయి. మార్కెట్ ఆటుపోట్ల సూచీ 10 శాతం త‌గ్గుద‌ల న‌మోదు చేసింది.
ఏడాదిలో రూ.37.59 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి
కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి స్టాక్ మార్కెట్ల కొంప ముంచింది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తం మీద బిఎస్ఇ ప్ర‌ధాన సూచి సెన్సెక్స్ 9204.42 పాయింట్లు (23.8%) దిగ‌జారింది. ఎన్ఎస్ఇ కీల‌క సూచి నిఫ్టీ 3926.15 పాయింట్లు క్షీణించింది. ఫ‌లితంగా ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఏడాదిలో రూ.37.59 ల‌క్ష‌ల కోట్లు ఆవిరైపోయింది. ఒక్క మార్చిలోనే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు భారీగా న‌ష్ట‌పోయాయి. మార్చి నెల మొత్తం మీద సెన్సెక్స్ 8828.80 పాయింట్లు న‌ష్ట‌పోయింది. మార్చి 24వ తేదీన సెన్సెక్స్ ఏడాది క‌నిష్ఠ స్థాయి 25638.90 పాయింట్లు న‌మోదు చేసింది. ఫ‌లితంగా బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.37,59,954.42 కోట్లు క్షీణించి రూ.1,13,48,756.59 కోట్ల‌కు ప‌డిపోయింది. అంత‌కు ముందు ఆర్థిక సంవ‌త్స‌రంలో (2018-19) ఈ మార్కెట్ విలువ ఏకంగా రూ.8.83,714.01 కోట్లు పెరిగి రూ.1,51,08,711.01 కోట్ల‌కు చేరింది. 
కీల‌క మైలురాళ్లు
2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డులు నెల‌కొల్పాయి. సెన్సెక్స్ 40000 పాయింట్ల మైలురాయిని దాట‌గా నిఫ్టీ 12000 పాయింట్ల మైలు రాయిని దాటింది. జ‌న‌వ‌రి 20వ తేదీన సెన్సెక్స్ 42273.87 పాయింట్ల చారిత్ర‌క గ‌రిష్ఠ స్థాయిని చేరింది. ఆ త‌ర్వాత రెండు నెల‌ల కాలంలో భారీగా క్షీణించి ఏడాది క‌నిష్ఠ స్థాయిల్లో క‌ద‌లాడుతోంది. 
ఆర్ఐఎల్ దే అగ్ర‌స్థానం
ప్ర‌స్తుతం ఆర్ఐఎల్ దేశంలో అత్యంత విలువైన కంపెనీగా కొన‌సాగుతోంది. ఒక ద‌శ‌లో రూ.10 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్ విలువ‌ను దాటిపోయి ఆ ఘ‌న‌త సాధించిన తొలి కంపెనీగా రికార్డు న‌మోదు చేసిన ఆర్ఐఎల్‌ త‌దుప‌రి ఏర్ప‌డిన ప్ర‌తికూల‌త‌లో షేరు భారీగా ప‌త‌నం కావ‌డంతో ప్ర‌స్తుతం రూ.7,05,211.81 కోట్ల వ‌ద్ద నిలిచింది. రూ.6,84,078.49 కోట్ల‌తో టిసిఎస్ రెండో స్థానంలో ఉంది.
రూపాయి మ‌హా ప‌త‌నం
దేశీయ క‌రెన్సీ రూపాయి కూడా అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో ఏడాది మొత్తం మీద భారీగా క్షీణించింది. 2019-20 సంవ‌త్స‌రం మొత్తం మీద రూపాయి 646 పైస‌లు (9.36%) ప‌త‌న‌మ‌యింది.మంగ‌ళ‌వారంనాడు సంవ‌త్స‌రం చివ‌రి రోజున రూపాయి 75.60 వ‌ద్ద ముగిసింది. ఏడాది మొత్తంలో ఏర్ప‌డిన 9.36% క్షీణ‌త‌లో జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికంలోనే 5.94% క్షీణ‌త (424 పైస‌లు) న‌మోద‌యింది. 2019 మార్చి 31వ తేదీన అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి 69.14 వ‌ద్ద ఉంది.  
నేడు, రేపు సెల‌వు
బ్యాంకుల ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు రోజు కావ‌డం వ‌ల్ల ఏప్రిల్ 1వ‌ తేదీన, శ్రీ‌రామ న‌వ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఏప్రిల్ 2వ తేదీన‌ ఫారెక్స్ మార్కెట్ మూసి ఉంటుంది. 

Monday, March 30, 2020

మార్కెట్‌ మళ్ళీ అథోముఖం

1375 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభించ‌డంతో పాటు భార‌త్ లో కూడా కోవిడ్‌-19 కేసులు పెరుగుతూ ఉండ‌డం ఇన్వెస్ట‌ర్ల‌ను క‌ల‌త‌కు గురి చేసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్, ఆటో కౌంట‌ర్ల‌లో అమ్మ‌కాలు హోరెత్త‌డంతో మార్కెట్ ఇండెక్స్ లు భారీ న‌ష్టాలు న‌మోదు చేశాయి. ఒక వారం రోజుల ర్యాలీ అనంత‌రం మార్కెట్లు మ‌రోసారి డౌన్ ట్రెండ్‌లో ప్ర‌వేశించాయి. దీనికి తోడు ప‌లు రేటింగ్ ఏజెన్సీలు భార‌త వృద్ధిరేటును ప్ర‌స్తుత సంక్షోభం నేప‌థ్యంలో గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డంతో ఇన్వెస్ట‌ర్లు రిస్క్ గా భావించే షేర్ల‌ను భారీ ప‌రిమాణంలో వ‌దిలించుకున్నారు. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 2 శాతానికి పైబ‌డి న‌ష్టాల‌తోనే ముగిశాయి. సెన్సెక్స్ 1375.27 పాయింట్ల న‌ష్టంతో 28440.32 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 379.1 5 పాయింట్ల న‌ష్టంతో 8281.10 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. అయితే నిఫ్టీకి దిగువ‌కు రివ‌ర్స‌ల్ బార్ ఏర్ప‌డ‌డం వ‌ల్ల మ‌రోసారి స్వ‌ల్ప‌కాలిక బ‌ల‌హీన‌త ఏర్ప‌డిన‌ట్టు విశ్లేష‌కులు చెబుతున్నారు.

రూ.3.35 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి
గ‌త వారంలో మూడు రోజుల విరామం మిన‌హా (24, 25, 26 తేదీలు) గ‌త శుక్ర‌వారం, తాజాగా సోమ‌వారం ఏర్ప‌డిన న‌ష్టాల‌తో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.3.35 ల‌క్ష‌ల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. సోమ‌వారం మార్కెట్ ముగిసే స‌మ‌యానికి బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,09,63,832.17 కోట్లకు దిగ‌జారింది. 

మార్చి 9 నుంచి 9 రోజుల వ్య‌వ‌ధిలో సంప‌ద న‌ష్టం
-------------------------------------------------------------------------  
                      సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
-------------------------------------------------------------------------   

మార్చి   9           1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12           2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16            2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17              811         231        రూ. 2.12 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 18           1709         495         రూ. 5.98 ల‌క్ష‌ల కోట్లు 
 మార్చి 19             581         206        రూ. 3.74 ల‌క్ష‌ల కోట్లు
మార్చి  23           3935        1135        రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 29, 30      1375          379        రూ.  3.35 ల‌క్ష‌ల కోట్లు      
మొత్తం నష్టం       14039        4025       రూ.74.82 ల‌క్ష‌ల కోట్లు   
------------------------------------------------------------------------- 

విదేశీ మార్కెట్ల‌కూ న‌ష్టాలే...
క‌రోనా వైర‌స్ అంత‌కంత‌కూ విజృంభిస్తూ ఉండడం ఇన్వెస్ట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. దీంతో అంత‌ర్జాతీయ మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ముగిశాయి. షాంఘై, హాంకాంగ్‌, టోక్యో, సియోల్  మార్కెట్లు న‌ష్టాల్లో ముగియ‌గా యూరోపియ‌న్ మార్కెట్లు కూడా అదే బాట‌లో ఉన్నాయి.

ఆయిల్ ధ‌ర‌ల భారీ క్షీణ‌త‌
అంత‌ర్జాతీయ విప‌ణ‌లో క్రూడాయిల్ ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి.బ్రెంట్ క్రూడాయిల్ ధ‌ర 6.62% క్షీణించి బ్యారెల్‌ 23.28 డాల‌ర్ల‌కు దిగిరాగా వెస్ట్ టెక్సాస్ ఇంట‌ర్మీడియేట్ ఆయిల్ ధ‌ర 5 శాతం క్షీణించి బ్యారెల్ 20 శాతానికి వ‌చ్చింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా డిమాండు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో పాటు సౌదీ అరేబియా, ర‌ష్యా మ‌ధ్య‌న సాగుతున్న‌ధ‌ర‌ల పోరాటం కూడా క్రూడాయిల్ ధ‌ర‌ల భారీ క్షీణ‌త‌కు కార‌ణం. 

70 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి
స్టాక్ మార్కెట్, ఆయిల్ మార్కెట్ల‌కు దీటుగానే దేశీయ క‌రెన్సీ రూపాయి కూడా అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో భారీగా 70 పైస‌లు క్షీణించింది. ఈక్విటీ మార్కెట్ల‌లో అమ్మ‌కాలు పోటెత్త‌డం రూపాయి భారీ క్షీణ‌త‌కు కార‌ణం. ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి 75.17 వ‌ద్ద ప్రారంభ‌మై చివ‌రికి 70 పైస‌ల భారీ న‌ష్టంతో 75.59 వ‌ద్ద ముగిసింది.

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

సాధారణ నిస్తేజం 
తిథి :  చైత్ర శుద్ధ సప్తమి 
న‌క్ష‌త్రం : మృగశిర  
అప్ర‌మ‌త్తం :  పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర  నక్షత్ర జాతకులు,  కర్కాటక, వృశ్చిక     రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8358.95 (-301.30) 
ట్రెండ్ మారే వేళ : 12.25
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 నుంచి  11.15 వ‌ర‌కు నిలకడ/నిస్తేజంగా  ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.45 వరకు నిస్తేజంగా  ఉండి ఆ తర్వాత  చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం 11.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 2.45 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 3 గంటల  తర్వాత  ఎటిపి కన్నా దిగువకు వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  8350, 8425, 8500
మ‌ద్ద‌తు స్థాయిలు : 8200, 8125, 8050
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Saturday, March 28, 2020

వారానికి ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌

9000 పైన ముగిస్తే బుల్లిష్‌
(తేదీలు మార్చి 29-ఏప్రిల్ 03, 2020 మ‌ధ్య వారానికి)
గ‌త వారం నిఫ్టీ ముగింపు :  8660 (-85)
నిఫ్టీ గ‌త వారం 9039-7511 పాయింట్ల మ‌ధ్య‌న విస్తృత ప‌రిధిలో క‌ద‌లాడి చివ‌రికి 85 పాయింట్ల న‌ష్టంతో 8660 వ‌ద్ద నెగిటివ్ గా ముగిసింది. 
- మార్చి 23 నుంచి 25 వరకు కొత్త ఆస్ట్రో మాసంలో 8415-7511 పాయింట్ల మధ్యన కదలాడింది. ఈ  పరిధి రానున్న 3 వారాలకు కీలకం. గరిష్ఠ స్థాయికి పైన బుల్లిష్ గాను, కనిష్ఠ స్థాయికి దిగువన బేరిష్ గాను భావించాలి
- 20, 50, 100, 200 చ‌ల‌న స‌గ‌టు (డిఎంఏ) స్థాయిలు 9614, 11067, 11575, 11499. ఇవి నిరోధ‌, మ‌ద్ద‌తు స్థాయిలుగా నిలుస్తాయి.
- నిఫ్టీ ప్ర‌స్తుతం అన్ని డిఎంఏల క‌న్నా దిగువ‌న ఉంది. 50 డిఎంఏ, 200 డిఎంఏ క‌న్నా దిగువకు రావడం దీర్ఘ‌కాలిక బేరిష్ ట్రెండ్ ఏర్పడిందనేందుకు సంకేతం. వారాంతానికి 9000 క‌న్నా పైన ముగిస్తే స్వ‌ల్ప‌కాలిక ట్రెండ్ బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి : 9000    బ్రేక్ డౌన్ స్థాయి : 8050
నిరోధ స్థాయిలు : 8825, 8900, 9000 (8750 పైన బుల్లిష్‌)
మ‌ద్ద‌తు స్థాయిలు : 8525, 8450, 8350 (8600 దిగువ‌న బేరిష్‌) 
ఇన్వెస్ట‌ర్ల‌కు సూచ‌న...
వారం ప్రారంభ స్థాయి అత్యంత కీల‌కం. అంత కన్నా పైన మాత్రమే లాంగ్ పొజిషన్లు శ్రేయస్కరం. 
----------------------- 
గ్ర‌హ‌గ‌తులివే...
- వృషభంలోని రోహిణి  పాదం 3 నుంచి కర్కాటకంలోని పుష్యమి పాదం 4 మ‌ధ్య‌లో చంద్ర సంచారం
- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 4 నుంచి రేవతి పాదం 1 మ‌ధ్య‌లో ర‌వి సంచారం
- కుంభంలోని శతభిషం పాదం 4 నుంచి పూర్వాభాద్ర పాదం 2 మ‌ధ్య‌లో బుధ సంచారం
- వృషభంలోని కృత్తిక పాదం 2-3 మధ్యలో శుక్ర సంచారం
- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 3-4 మధ్యలో కుజ సంచారం
- మకరంలోని ఉత్త‌రాషాఢ పాదం 4లో మీన న‌వాంశ‌లో శ‌ని సంచారం
- మకరంలోని ఉత్తరాషాఢ పాదం 2లో మకర న‌వాంశ‌లో బృహ‌స్ప‌తి సంచారం
- మిథునంలోని ఆర్ద్ర పాదం 1లో రాహువు, ధ‌నుస్సులోని మూల పాదం 3లో కేతువు సంచారం
------------------------------------------ 
ముగింపు సెషన్ మెరుగు (సోమవారానికి)
తిథి :  చైత్ర శుద్ధ షష్ఠి    
న‌క్ష‌త్రం : రోహిణి 
అప్ర‌మ‌త్తం : పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, మిథున, తుల  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8641.45 (+323.60) 
ట్రెండ్ మారే వేళ : 10.49
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 నుంచి  11.30 వ‌ర‌కు నిలకడ/మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. తదుపరి 1.35 వరకు నిస్తేజంగా  ఉండి ఆ తర్వాత  చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం 11.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్ పొజిషన్లు తీసుకుని 1.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత  ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు. 
నిరోధ స్థాయిలు :  8750, 8825, 8900
మ‌ద్ద‌తు స్థాయిలు : 8550, 8475, 8400
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Friday, March 27, 2020

మూడు రోజుల ర్యాలీకి బ్రేక్‌

131 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్
భార‌త స్టాక్ మార్కెట్ లో మూడు రోజులుగా సాగుతున్న అద్భుత‌మైన ర్యాలీకి బ్రేక్ ప‌డింది. కోవిడ్‌-19 ప్ర‌భావం నుంచి కాపాడేందుకు అల్పాదాయ వ‌ర్గాల‌కు రూ.17 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజిని ఆర్థిక‌మంత్రి నిర్ణ‌యించ‌డం, శుక్ర‌వారం ఆర్ బిఐ ఆక‌స్మికంగా రెపోరేటును భారీ స్థాయిలో 0.75 శాతం మేర‌కు త‌గ్గించ‌డం వంటి సానుకూల ప‌రిణామాల నేప‌థ్యంలో కూడా మార్కెట్ స్వ‌ల్పంగా ప‌త‌నం కావ‌డం విశేషం. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డం ల‌క్ష్యంగా ప్ర‌ధాని ప్ర‌క‌టించిన మేర‌కు జాతీయ స్థాయిలో 21 రోజుల లాక్ డౌన్ అమ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో వ‌చ్చే త్రైమాసికం వృద్ధిరేటు ప్ర‌భావితం అవుతుంద‌ని, దాని ప్ర‌భావం వ‌ల్ల ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధిరేటు భారీగా దెబ్బ తింటుంద‌ని మూడీస్ ఇన్వెస్ట‌ర్ స‌ర్వీసెస్ ప్ర‌క‌టించ‌డం ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ ను తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌డం మార్కెట్ న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌యింది. దీంతో సెన్సెక్స్ 131.18 పాయింట్ల న‌ష్టంతో 29815.59 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 18.80 పాయింట్ల న‌ష్టంతో 8660.25 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1179 పాయింట్లు పెరిగి 31126.03 పాయింట్ల వ‌ర‌కు వెళ్లింది. నిఫ్టీ 397.45 పాయింట్లు పెరిగి 9038.90 పాయింట్ల స్థాయిని తాకింది. 

విదేశీ మార్కెట్ల‌కూ న‌ష్టాలే...
ఎంత‌గా నిరోధ‌క చ‌ర్య‌లు తీసుకున్నా క‌రోనా వైర‌స్ పెరుగుతూనే ఉండ‌డం ఇన్వెస్ట‌ర్ల‌ను క‌ల‌త‌కు గురి చేయ‌డంతో యూరోపియ‌న్ మార్కెట్ల‌లో కూడా మూడు రోజుల ర్యాలీకి బ్రేక్ ప‌డింది. పాన్ యూరోపియ‌న్ స్టాక్స్ 600 ఇండెక్స్ 2% మేర‌కు న‌ష్ట‌పోయింది. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం లాభాల్లోనే న‌డిచాయి.

రెపో రేటు 0.75 శాతం త‌గ్గింపు

రెపో రేటు 0.75 శాతం త‌గ్గింపు
కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు ఆర్ బిఐ అసాధార‌ణ‌ చ‌ర్య‌
------------------------------------------------ 
ఆర్ బిఐ పాల‌సీ స‌మీక్ష ముఖ్యాంశాలు...
- రెపోరేటు భారీగా 0.75 శాతం త‌గ్గింపు, ఈ త‌గ్గింపుతో 4.4 శాతానికి రెపోరేటు
- దేశ చ‌రిత్ర‌లో ఇంత క‌నిష్ఠ స్థాయిలో రెపోరేటు ఉండ‌డం ఇదే ప్ర‌థ‌మం
- 0.90 శాతం త‌గ్గ‌నున్న‌ రివ‌ర్స్ రెపో రేటు
- సిఆర్ఆర్ 1 శాతం త‌గ్గింపు, ఈ త‌గ్గింపుతో 3 శాతానికి సిఆర్ఆర్‌
- బ్యాంకుల చేతికి రూ.1.37 ల‌క్ష‌ల కోట్ల నిధులు
- ఇఎంఐలు 3 నెల‌ల పాటు వాయిదా వేయ‌డానికి బ్యాంకుల‌కు అనుమ‌తి
- రుణాల‌ను రీ షెడ్యూల్ చేయ‌డానికి కూడా అనుమ‌తి
- డిపాజిట‌ర్ల సొమ్ము భ‌ద్రం, బ్యాంకు షేర్ల‌లో క్షీణ‌తకు క‌ల‌త వ‌ద్దు: ఆర్ బిఐ భ‌రోసా
------------------------------------------------ 

దేశంలో కోవిడ్-19 వ‌ల్ల ఎదుర‌వుతున్న సంక్షోభం నుంచి స‌గ‌టు ప్ర‌జ‌లు స‌హా అన్ని వ‌ర్గాల‌ను ఆదుకునేందుకు ఆర్ బిఐ రెపోరేటును 0.75 శాతం త‌గ్గించింది. దీంతో రెపోరేటు 4.4 శాతానికి దిగి వ‌చ్చింది. ఇంత‌వ‌ర‌కు రెపోరేటు ఇంత క‌నిష్ఠ స్థాయికి రావ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. గ‌తంలో 2009 ఆర్థిక సంక్షోభం స‌మ‌యంలో ఏప్రిల్ నెల నాటికి రెపోరేటు 4.74 శాతానికి త‌గ్గించారు. ఇంత‌వ‌ర‌కు చ‌రిత్ర‌లో అదే అతి క‌నిష్ఠ రెపోరేటు కాగా ఇప్పుడు ఆర్ బిఐ చ‌ర్య ఆ రికార్డుని చెరిపేసింది. అలాగే క్యాష్ రిజ‌ర్వ్ రేషియోను కూడా 1 శాతం మేర‌కు త‌గ్గించిన‌ట్టు ఆర్ బిఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ ప్ర‌క‌టించారు. దాంతో అది 3 శాతానికి దిగి వ‌చ్చింది. మార్చి 28 నాటికి ఇది అమ‌లులోకి వ‌స్తుంది. క‌స్ట‌మ‌ర్ల నుంచి తాము సేక‌రించే డిపాజిట్ల‌పై ఆర్ బిఐ వ‌ద్ద చ‌ట్ట‌బ‌ద్ధంగా దాచి ఉంచాల్సిన సొమ్మునే సిఆర్ఆర్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. అలాగే బ్యాంకుల‌కి ఆర్ బిఐ స్వ‌ల్ప‌కాలానికి అందించే రుణాల‌పై వ‌సూలు చేసే వ‌డ్డీని రెపోరేటుగా వ్య‌వ‌హ‌రిస్తారు. సిఆర్ఆర్‌, రెపోరేటు త‌గ్గించ‌డం వ‌ల్ల బ్యాంకుల చేతిలో ఉండే రూ.1.37 ల‌క్ష‌ల కోట్ల న‌గ‌దు నిల్వ అందుబాటులో ఉంటుంది. అంటే బ్యాంకులు వ్యాపార‌వ‌ర్గాల‌కు, వినియోగ‌దారుల‌కు అవ‌స‌ర‌మైనంత మేర‌కు రుణాలు అందించ‌గ‌లుగుతాయి. వ్యాపార‌వ‌ర్గాల‌కు త‌క్కువ వ‌డ్డీకి రుణాలు అందించ‌డం వ‌ల్ల వారు ఆ సొమ్ముని ఉత్పాద‌క కార్య‌క‌లాపాల‌కు వినియోగించ‌గ‌లుగుతారు. 

ముందుగానే చ‌ర్య‌
వ్యాపార కార్య‌క‌లాపాలు విస్త‌రించ‌డం వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ ఉత్తేజితం అవుతుంది. వాస్త‌వానికి ఆర్ బిఐ పాల‌సీ స‌మీక్ష‌ను కాస్తంత ముందుగానే నిర్వ‌హించి ముంద‌స్తుగానే ఈ రేట్ల కోత‌ను ప్ర‌క‌టించింది. ఆర్ బిఐ మంగ‌ళ‌, బుధ‌, గురు వారాల్లో అత్య‌వ‌స‌ర ద్ర‌వ్య విధాన క‌మిటీ (ఎంపిసి) స‌మావేశం నిర్వ‌హించి ఈ రేట్ల కోత ప్ర‌క‌టించింది. దేశంలో క‌నివిని ఎరుగ‌ని సంక్షుభిత స్థితిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని తాజా ప‌రిస్థితిని విశ్లేషించింది. ప్ర‌స్తుతం దేశాన్ని కోవిడ్‌-19 కుదిపివేస్తున్న నేప‌థ్యంలో స‌త్వ‌రం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆదుకోవ‌ల‌సిన అవ‌స‌రాన్ని ఎంపిసి గుర్తించింద‌ని ఆర్ బిఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ ప్ర‌క‌టించారు. ఎంపిసిలోని ఆరుగురు స‌భ్యుల్లో న‌లుగురు రేట్ల త‌గ్గింపున‌కు అనుకూలంగా ఓటు వేశార‌ని ఆయ‌న చెప్పారు. "ఎప్పుడైనా ఎలాంటి పోరాటానికైనా మ‌నం సిద్ధంగా ఉండాలి" అని దాస్ ఆ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. "క్లిష్ట ప‌రిస్థితులు ఎల్ల‌కాలం ఉండ‌వు" అని కూడా ఆయ‌న అన్నారు. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కంనేందుకు ఆర్ బిఐ ఉద్య‌మ స్ఫూర్తితో ప‌ని చేస్తుంద‌ని, మార్కెట్లు సాధార‌ణ స్థితికి వ‌చ్చే స‌జావుగా ప‌ని చేసేందుకు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.

మూడు నెల‌లు ఇఎంఐల‌కు విరామం
కార్పొరేట్ క‌స్ట‌మ‌ర్లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి రుణ‌గ్ర‌హీత‌ల‌కు ఊర‌ట క‌ల్పించేందుకు ఇఎంఐల చెల్లింపును మూడు నెల‌ల పాటు వాయిదా వేసేందుకు ఆర్ బిఐ బ్యాంకుల‌కు అనుమ‌తి ఇచ్చింది. దీని వ‌ల్ల వాహ‌న రుణాలు, గృహ‌రుణాలు పొందిన వారంద‌రికీ ఊర‌ట క‌లుగుతుంది. కార్పొరేట్ క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా రుణ‌బ‌కాయిల చెల్లింపులు వాయిదా ప‌డ‌తాయి. ఫ‌లితంగా భిన్న వ‌ర్గాల‌కు బ్యాంకులు అందించిన‌ రుణాలు మొండి బ‌కాయిలుగా మార‌డాన్ని నివారించేందుకు ఈ చ‌ర్య ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల కార్పొరేట్ కంపెనీల‌పై వ‌ర్కింగ్ కాపిట‌ల్ భారం గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని, భిన్న రంగాల‌పై ఒత్తిడి త‌గ్గుతుంద‌ని బార్ క్లేస్ చీఫ్ ఎక‌నామిస్ట్ రాహుల్ బ‌జోరియా అన్నారు. ఆర్ బిఐ తీసుకున్న చ‌ర్య వ‌ల్ల 2020 ఆగ‌స్టు నాటికి రుణాల‌పై వ‌డ్డీరేట్లు 3.5 శాతానికి త‌గ్గుతాయ‌ని ఆయన చెప్పారు.

Thursday, March 26, 2020

క‌రోనాపై ఉమ్మ‌డి పోరాటానికి జి-20 భూరి నిధులు

కోవిడ్‌-19 ప్ర‌భావం కార‌ణంగా అత‌లాకుత‌లం అయిన ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకునేలా చేయ‌డానికి జి-7 దేశాలు (సంప‌న్న దేశాల కూట‌మి), సామాజిక‌, ఆర్థిక‌, విత్త‌ప‌ర‌మైన సంక్లిష్ట ప‌రిస్థితిని ఎదుర్కొన‌డానికి  5 ట్రిలియ‌న్ డాల‌ర్లు నిధులు పంపిణీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. క‌రోనాపై ఉమ్మ‌డి పోరాటంలో భాగంగా తాము ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు జి-20 దేశాలు ఆన్ లైన్ లో నిర్వ‌హించిన శిఖ‌రాగ్ర స‌మావేశంలో వెల్ల‌డించాయి. ఈ స‌మావేశంలో పాల్గొన్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కోవిడ్‌-19ని దీటుగా ఎదుర్కొన‌డానికి ఒక ప‌టిష్ఠ‌మైన కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని పిలుపు ఇచ్చారు. సంఘ‌టిత స్ఫూర్తితో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌మైన‌, భారీ స్థాయి, శాస్ర్తీయ‌త‌తో కూడిన స్పంద‌న అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ప్ర‌పంచం యావ‌త్తుకు ఉమ్మ‌డి ముప్పుగా భావిస్తున్న ఈ వైర‌స్ పై ఐక్య పోరాటానికి భార‌త్ క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌ని మోదీ హామీ ఇచ్చారు. ఈ భారీ నిధి ప్ర‌పంచ న‌ష్టాల తీవ్ర‌త‌ను త‌గ్గిస్తుంద‌ని, ఉపాధిని ర‌క్షించి వృద్ధిలో వేగం పెర‌గ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని జి-20 దేశాలు త‌మ ప్ర‌క‌ట‌న‌లో ఆశాభావం ప్ర‌క‌టించాయి.

అల్పాదాయ వ‌ర్గాల‌ను ఆదుకునేందుకు భారీ ప్యాకేజి

మొత్తం విలువ రూ.1.7 ల‌క్ష‌ల కోట్లు
ప్ర‌క‌టించిన ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

కరోనా వైరస్ తో జరుగుతున్న పోరాటంలో దేశవ్యాప్తంగా పేదలకు తగు ఊతం ఇవ్వడానికి రూ. 1.70 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పేరుతో ఈ పథకాన్నితక్షణమే అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ‘ఈ రోజు ప్రకటించిన ఈ చర్యలు నిరుపేదలకు ఆహరం, నగదు అందుబాటులో ఉండేలా చేస్తున్నాం. ప్రస్తుత కష్టకాలంలో అత్యవసర సరుకులు పేదలకు అందాలి అనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టాం" అని ఆర్ధిక మంత్రి చెప్పారు.
ప్యాకేజి స్థూల స్వ‌భావం...
- కోవిడ్-19పై పోరాటం చేస్తున్న ఆరోగ్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా సౌకర్యం
- 80 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పు దినుసులు వచ్చే మూడు నెలలు ఉచితంగా
- 20 కోట్ల మంది మహిళలలు జనధన్ ఖాతాలకు వరుసగా 3 నెలలూ, నెలకు రూ.500 నగదు జమ

- మహాత్మగాంధీ నరెగా(ఎంఎన్ఆర్జిఏ) పనివారికి దినసరి వేతనం రూ.182 నుండి రూ.202 కి పెంపు; 13.62 కోట్ల కుటుంబాలకు లబ్ది

- పేద వృద్ధులు, పేద ఒంటరి మహిళలు, పేద దివ్యంగులకు రూ.1,000 ఆర్ధిక సహాయం ; 3 కోట్ల మంది పేదలకు ప్రయోజనం

- పి.ఎం కిసాన్ యోజనలో భాగంగా ముందుగానే రైతులకు ప్రయోజనం చేకూరేలా ఏప్రిల్ మొదటి వారంలోనే రు.2,000 చెల్లింపు; 8.7కోట్ల మంది రైతులకు లబ్ది

-భవన, నిర్మాణ రంగం కార్మికులకు ఉద్దేశించిన సంక్షేమ నిధిని ఆ కార్మికుల కోసం వినియోగించుకోడానికి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

 ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్

I.  ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్-19 పై పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకం
- సఫాయి కర్మచారిలు, వార్డ్ బాయ్స్, నర్సులు, ఆశా వర్కర్లు, పారామెడిక్స్, టెక్నిషియన్లు, వైద్యులు, స్పెషలిస్టులు, ఇతర ఆరోగ్య సహాయకులు ఈ ప్రత్యేక బీమా పథకం కిందకు వస్తారు.
- కోవిడ్-19 వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడంలో నిమగ్నమై ఉన్న వైద్య, ఆరోగ్య రంగానికి చెందిన వారు ఎవరికైనా ప్రమాదం జరిగితే వారికి కూడా ఈ బీమా వర్తిస్తుంది. 
-  కేంద్రం, రాష్ట్రం పరిథిలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్, ఆస్పత్రులు కూడా ఈ బీమా కిందకు వస్తాయి. సుమారు 22 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు బీమా వర్తిస్తుంది 
II. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన
- ఈ మూడు నెలల అంతరాయం వల్ల ఏ పేద కుటుంబం ఆహరం ధాన్యాలు అందక  ఆకలితో అలమటించరాదన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం
- 80 కోట్ల మంది వ్యక్తులు, అంటే దేశ జనాభా లో సుమారు మూడింట రెండొంతులు మంది  ఈ పథకం కిందకు వస్తారు
- లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికి వచ్చే మూడు నెలల్లో వారి ప్రస్తుత అర్హత కంటే రెట్టింపు అంద‌చేస్తారు.
పప్పు ధాన్యాలు...
- పైన పేర్కొన్న వ్యక్తులందరికీ తగినంత ప్రోటీన్ లభ్యత ఉండేలా, ప్రతి కుటుంబానికి ఒక కిలో చొప్పున, వచ్చే మూడు నెలల పాటు స్థానిక ప్రాధాన్యతల ప్రకారం పప్పుధాన్యాలు ఉచితంగా అందిస్తుంది
III. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన...
రైతులకు లబ్ది 
-   2020-21లో చెల్లించాల్సిన మొదటి విడత రూ .2,000 ముందుగానే 2020 ఏప్రిల్‌లోనే చెల్లిస్తారు.
- ఇది 8.7 కోట్ల మంది రైతులకు వర్తిస్తుంది.
IV. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద నగదు బదిలీ
పేదలకు సహాయం : మొత్తం 20.40 కోట్ల పీఎం జనధన్ యోజన మహిళా ఖాతాదారులకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు ఆర్ధిక సహాయం అందుతుంది
గ్యాస్ సిలెండర్లు: పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద గ్యాస్ సిలెండర్ల ఉచితంగా మూడు నెలలపాటు అందజేస్తారు. దీని వల్ల 8 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతాయి

వ్యవస్థీకృత రంగాలలో తక్కువ వేతనం పొందేవారికి  సహాయం
- 100 కంటే తక్కువ మంది కార్మికులను కలిగి ఉన్న వ్యాపారాలలో నెలకు రూ .15 వేల లోపు వేతనాలు పొందే వారు. వీరి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
- ఈ ప్యాకేజీ కింద అటువంటి వారి వేతనంలో 24 శాతం వచ్చే మూడు నెలలు కేంద్ర ప్రభుత్వమే వారి పిఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది.
- ఈ చర్యలు వారి ఉద్యోగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తాయి 
వయోవృద్ధులు (60 ఏళ్ల పైబడ్డ వారు), ఒంటరి మహిళలు, దివ్యంగులకు సహాయం
- వృద్ధులైన  ఒంటరి మహిళలు, దివ్యాంగులు కేటగిరికి చెందిన వారు సుమారు 3 కోట్ల మంది ఉంటారు. కోవిడ్-19 వల్ల వీరందరి ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది
-  అందువల్ల ఈ కష్టకాలంలో వారికి అండగా ఉండడానికి రూ.1,000 ఆర్ధిక సహాయం ప్రభుత్వం అందజేస్తుంది
ఎంఎన్ఆర్ జిఏ
-  పీఎం గరీబీ కళ్యాణ్ యోజన కింద ఎంఎన్ఆర్జిఏ వేతనం రూ.20 పెంపు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీన ఇది అమలులోకి వస్తుంది.  ఎంఎన్ఆర్జిఏ పథకం కింద పని వారికి అదనంగా ఏటా రూ.2,000 లబ్ది చేకూరుతుంది.
-  ఇది 13.62 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుస్తుంది
\V. స్వయం సహాయక గ్రూపులు
-  మొత్తం 63 లక్షల స్వయం సహాయక గ్రూపులు (ఎస్.హెచ్.జి) 6.85 కోట్ల మంది మహిళకు సహాయకారిగా ఉంటున్నాయి.
- పూచికత్తు లేకుండా వీరందరికి రుణ సదుపాయ పరిమితి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంపు
VI. పీఎం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ఇతర అంశాలు
సంఘటిత రంగం
-  పీఎఫ్ ఖాతాల నుండి 75 శాతం మొత్తాన్ని లేదా మూడు నెలల వేతనాలను ఏది తక్కువైతే అంత, 'తిరిగి వెనుకకు చెల్లించనవసరం లేకుండా' ఖాతాదారులు అడ్వాన్స్‌ తీసుకోడానికి అనుమతిస్తారు.  మహమ్మారి వ్యాధులకు కూడా ఇది వర్తిస్తుంది అని నిబంధనలను సవరిస్తారు.
- ఇపిఎఫ్‌ కింద నమోదై ఉన్న 4 కోట్ల కుటుంబాలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు

భవనాలు, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ నిధి
- కేంద్ర ప్రభుత్వ చట్టం కింద భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల కోసం సంక్షేమ నిధి ఉంది.
- ఈ నిధి కింద సుమారు 3.5 కోట్ల మంది కార్మికులు నమోదై ఉన్నారు
-   ఈ కార్మికులకు ఆర్ధిక అవాంతరాలనుండి కాపాడడానికి, కార్మికులకు సహాయం అందించడానికి రాష్ట్రాలు ఈ సంక్షేమ నిధిని వినియోగించవచ్చని కేంద్రం
 ఆదేశాలు 
జిల్లా ఖనిజ నిధి
- కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నివారించడంతో పాటు రోగుల చికిత్సకు సంబంధించి వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ మరియు ఇతర సౌకర్యాలను కల్పించడానికి  జిల్లా ఖనిజ నిధి (డిఎంఎఫ్) కింద లభించే నిధులను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

స్టాక్ మార్కెట్ లో హ్యాట్రిక్ ర్యాలీ

మూడో రోజూ భారీ లాభాల్లో ఇండెక్స్ లు

భార‌త స్టాక్ మార్కెట్ వ‌రుస‌గా వ‌రుస‌గా మూడో రోజున కూడా మంచి ర్యాలీ కొన‌సాగించింది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్ డౌన్ సానుకూల ఫ‌లితాలు ఇస్తున్న‌ద‌న్న వార్త‌ల‌తో పాటు బాధిత నిరుపేద కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రూ.1.7 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజిని ప్ర‌క‌టించ‌డం మార్కెట్ సెంటిమెంట్ ను బ‌ల‌ప‌రిచింది. గురువారంనాడు ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ న‌ష్టాల్లోనే ట్రేడ‌యినా భార‌తదేశంలోని సెన్సెక్స్ 1410.99 పాయింట్లు లాభ‌ప‌డి 29,946.77 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 323.60 పాయింట్లు లాభ‌ప‌డి 8641.45 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. సోమ‌వారం నాటి చారిత్ర‌క ప‌త‌నం అనంత‌రం ఏర్ప‌డిన ర్యాలీలో 3 రోజుల్లో సెన్సెక్స్ 3965.53 పాయింట్లు, నిఫ్టీ 1031.20 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు శుభ‌సూచ‌కంగా భావించే క్రూడాయిల్ ధ‌ర‌లు కూడా బ్యారెల్ 30 డాల‌ర్ల లోపునే ఉండ‌డం కూడా క‌లిసివ‌చ్చింది. అయితే షాంఘై, హాంకాంగ్‌, టోక్యో, సియోల్ సూచీలు గ‌ణ‌నీయ‌మైన న‌ష్టాల్లో ముగియ‌గా యూరోపియ‌న్ దేశాల సూచీలు న‌ష్టాల్లో ట్రేడ‌య్యాయి. 

3 రోజుల్లో రూ.11.12 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద వృద్ధి
వ‌రుస‌గా మూడు రోజులుగా సాగిన ర్యాలీలో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.11,12,088.88 కోట్లు పెరిగింది. దీంతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,12,99,025.06 కోట్ల‌కు చేరింది.

---------------------------------- 

దేశంలో క‌రోనా వైర‌స్ దారికొస్తున్న ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. 4 వారాల పాటు వ‌రుస‌గా అధిక సంఖ్య‌లో కేసులు పెరుగుతూ పోగా తొలి సారిగా బుధ‌, గురువారాల మ‌ధ్య‌న (25, 26 తేదీలు) 24 గంట‌ల వ్య‌వ‌ధిలో తొలిసారిగా త‌క్కువ కేసులు న‌మోదైన‌ట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. గ‌త 4 వారాలుగా కొత్త‌గా న‌మోదైన కేసుల సంఖ్య రోజుకి 70 నుంచి 80 వ‌ర‌కు ఉండ‌గా తొలిసారిగా 24 గంట‌ల్లో 43 కొత్త కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. మార్చి 26వ తేదీ నాటికి 26 రాష్ర్టాల్లో క‌రోనా కేసుల సంఖ్య 649కి చేర‌గా మృతుల సంఖ్య 13కి పెరిగింది.

- 26వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న తాజా స‌మాచారం ప్ర‌కారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 197 దేశాల్లో 4,16,686 మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు నిర్ధార‌ణ కాగా మృతుల సంఖ్య 18,589కి చేరింది. గ‌తంలో సార్స్, మెర్స్ వంటి వైర‌స్ ల వ్యాప్తి స‌మ‌యంలో ఏర్ప‌డిన మ‌ర‌ణాల సంఖ్య‌ను కోవిడ్‌-19 మ‌ర‌ణాలు దాటేశాయి. ఎబోలా వైర‌స్ స‌మ‌యంలో మృతుల సంఖ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌రిష్ఠంగా 11300 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

మిడ్ సెషన్ మెరుగు 
తిథి :  చైత్ర శుద్ధ తదియ   
న‌క్ష‌త్రం : భరణి 
అప్ర‌మ‌త్తం :  రోహిణి, హస్త, శ్రవణం/మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్ర జాతకులు, వృషభ, మిథున రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 8641.45 (+323.60) 
ట్రెండ్ మారే వేళ : 10.08
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 నుంచి  10.10 వ‌ర‌కు నిలకడ/నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. తదుపరి 2.40 వరకు మెరుగ్గా ఉండి ఆ తర్వాత  చివరి వరకు నిస్తేజంగా ట్రేడ్ కావచ్చు. 
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  10.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా పైన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో లాంగ్  పొజిషన్లు తీసుకుని 2.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 2.45 తర్వాత  ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు.. 
నిరోధ స్థాయిలు :  8700, 8775, 8850
మ‌ద్ద‌తు స్థాయిలు : 8550, 8475, 8400
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Wednesday, March 25, 2020

ఆగ‌ని బుల్ చిందు

రెండో రోజు కూడా కొన‌సాగిన జోరు
2011 త‌ర్వాత అతి పెద్ద లాభం న‌మోదు

భార‌త స్టాక్ మార్కెట్ వ‌రుస‌గా రెండో రోజున కూడా జోరు ఆప‌లేదు. బుల్స్ రెచ్చిపోయి చిందులు తొక్కాయి. క‌రోనాను అదుపు చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా ప్ర‌ధాని 21 రోజుల పాటు దేశ‌వ్యాప్తంగా లాకౌట్ ప్ర‌క‌టించ‌డం, ఆ మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డుతున్న భారీ న‌ష్టాన్ని త‌ట్టుకునేందుకు అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్ స‌హా ప‌లు కేంద్ర బ్యాంకులు ఉద్దీప‌న ప్యాకేజిలు ప్ర‌క‌టించ‌డం, ఉద్దీప‌న ప్యాకేజి సిద్ధం అవుతున్న‌ద‌ని ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించ‌డం మార్కెట్ల‌లో బుల్స్ కు ప్రాణం పోసింది. మార్కెట్ లో కీల‌క ఇండెక్స్ సెన్సెక్స్ 1862 పాయింట్లు (6.98 %) లాభ‌ప‌డి 28536 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 497 పాయింట్లు లాభ‌ప‌డి 8298 వ‌ద్ద ముగిసింది. 2011 త‌ర్వాత ఇండెక్స్ లు ఒక రోజులో ఇంత భారీగా వృద్ధిని న‌మోదు చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం. కాగా మంగ‌ళ‌వారం సాధించిన వృద్ధి 693 పాయింట్ల‌తో క‌లిపితే రెండు సెష‌న్ల‌లో లాభం 2555 పాయింట్లు కాగా నిఫ్టీ 688 పాయింట్లు లాభ‌ప‌డింది. మంగ‌ళ‌వారం అమెరిక‌న్ మార్కెట్ ఆర్జించిన లాభంతో పాటు ఇత‌ర మార్కెట్ల‌లో కూడా ఏర్ప‌డిన లాభాలు అందించిన ఉత్తేజం కూడా భార‌త మార్కెట్ చిందులు తొక్క‌డానికి దారి తీసింది.   

ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.4.7 ల‌క్ష‌ల కోట్లు వృద్ధి
బుధ‌వారం ఒక్క రోజులోనే ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.4.7 ల‌క్ష‌ల కోట్లు వృద్ధి చెందింది. మంగ‌ళ‌వారం పెరిగిన సంప‌ద విలువ రూ.1.82 ల‌క్ష‌ల కోట్లు. దీంతో రెండు రోజుల వ్య‌వ‌ధిలో మొత్తం సంప‌ద రూ.6.52 ల‌క్ష‌ల కోట్లు పెరిగి రూ.1,08,40,165.20 కోట్ల‌కు చేరింది.

ర్యాలీ కొన‌సాగుతుందా...?
స్టాక్ మార్కెట్ లో ఏర్ప‌డిన ఈ ర్యాలీ నిల‌దొక్కుకుంటుందా లేక ఇది తాత్కాలిక‌మేనా అనే ప్ర‌శ్న‌లు ప‌లువురిలో త‌లెత్తుతున్నాయి. డెయిలీ చార్టుల ప్ర‌కారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ డైవ‌ర్జెన్స్ సాధించాయ‌ని, రిక‌వ‌రీ అవ‌కాశాలున్నాయ‌నేందుకు ఇది తొలి సంకేత‌మ‌ని విశ్లేష‌కులంటున్నారు. ప్ర‌స్తుతం నిఫ్టీకి మ‌ద్ద‌తు స్థాయిల ప‌రిధి 7600-7650 కాగా నిరోధ స్థాయిల ప‌రిధి 8050-8200 వ‌ద్ద ఉన్న‌ట్టు ఎల్ కెపి సెక్యూరిటీస్ సీనియ‌ర్ అన‌లిస్ట్ రోహిత్ షింగ్రే చెబుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో నిఫ్టీలో రిలీఫ్ ర్యాలీ 9000 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చున‌ని అంచ‌నా.

నెల రోజుల్లో క‌నివిని ఎరుగ‌ని న‌ష్టం
భార‌త స్టాక్ మార్కెట్ కోవిడ్-19 మ‌హ‌మ్మారి ప్ర‌భావం వ‌ల్ల గ‌త నెల రోజుల్లో క‌నివిని ఎరుగ‌నంత భారీ క‌ల్లోలానికి గుర‌యింది. అస‌లు మార్కెట్ ప‌య‌నం ఏ దిశ‌గా సాగుతుంద‌న్న‌ది అన‌లిస్టుల ఊహాగానాల‌కు అంద‌నంత‌గా న‌ష్టాలు ఏర్ప‌డ్డాయి. గ‌త నెల రోజుల్లో మార్కెట్ న‌డ‌క ఒక వైకుంఠ‌పాళిని గుర్తుకి తెచ్చింది. ఒక చిన్న నిచ్చెన దొరికి కాస్తంత లాభ‌ప‌డింద‌న్న స‌మ‌యంలో ఒక పెద్ద పాము నోటికి చిక్కి పాతాళానికి ప‌డిపోయే విధంగా ఈ ప‌య‌నం సాగింది. సెన్సెక్స్, మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ల‌న్నీ 35 శాతం మేర‌కు న‌ష్ట‌పోయాయి. ప్ర‌స్తుత వాతావ‌ర‌ణంలో ఇన్వెస్ట‌ర్లు పెట్టుబ‌డి విష‌యంలో దీర్ఘ‌కాలిక దృక్ప‌థం అనుస‌రించ‌డ‌మే మంచిద‌ని, తాత్కాలిక ఎగుడుదిగుడుల ప్ర‌భావానికి లోను కారాద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 

Tuesday, March 24, 2020

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

మిడ్ సెషన్ నిస్తేజం 
తిథి :  చైత్ర శుద్ధ పాడ్యమి 
న‌క్ష‌త్రం : రేవతి 
అప్ర‌మ‌త్తం :  కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, మేష, సింహ  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 7801.05 (+190.80) 
ట్రెండ్ మారే వేళ : 11.02
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 9.30 వ‌ర‌కు నిలకడగా ట్రేడవుతూ  తదుపరి 11.20 వరకు మెరుగ్గా  ట్రేడయ్యే స్కారం ఉంది. ఆ తర్వాత 1.40 వరకు నిస్తేజంగా నిలిచి తదుపరి  చివరి వరకు మెరుగ్గా ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  11.15  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిష‌న్లు తీసుకుని 1.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 1.45 తర్వాత  ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవచ్చు..   
 
నిరోధ స్థాయిలు :  7900, 7950, 8025
మ‌ద్ద‌తు స్థాయిలు : 7700, 7650, 7550
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Monday, March 23, 2020

చారిత్ర‌క మ‌హాప‌త‌నం

క‌రోనా సునామీ - 8  
భార‌త స్టాక్ మార్కెట్ మ‌రో మ‌హాప‌త‌నాన్ని న‌మోదు చేసింది. ఇది ఇంత‌వ‌ర‌కు భార‌త మార్కెట్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ప‌త‌నం. కోవిడ్‌-19 ప్ర‌భావానికి 2020 మార్చి 12వ తేదీ న‌మోదైన భారీ ప‌త‌నం ఈ దెబ్బ‌తో రెండో స్థానానికి దిగ‌జారిపోయింది. కోవిడ్‌-19ని అదుపు చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా భార‌త్ స‌హా భిన్న దేశాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డం, ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ఇప్ప‌టికే తిరోగ‌మ‌నంలోకి జారుకోవ‌డం మార్కెట్ వ‌ర్గాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాయి. దీనికి తోడు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ప్రారంభం కాబోయే కొత్త ఆర్థిక సంవ‌త్స‌రానికి కూడా ప‌లు అంత‌ర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వృద్ధిరేటు అంచ‌నాను గ‌ణ‌నీయంగా కుదించ‌డం ప‌రిస్థితిని మ‌రింత తీవ్రం చేసింది. బిఎస్ఇ సెన్సెక్స్ 3935 పాయింట్లు (13.15%) న‌ష్ట‌పోయి 25981.24 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ సూచీ నిఫ్టీ 1135.20 పాయింట్లు (12.98%) దిగ‌జారి 7610.25 వ‌ద్ద ముగిసింది. వైర‌స్ విస్త‌ర‌ణ విష‌యంలో తీవ్ర అనిశ్చితి నెల‌కొన‌డంతో జ‌రిగిన ఈ క‌ల్లోలం తీవ్ర‌త చాలా అధికంగా ఉంది. ఆసియా, యూరోపియ‌న్ మార్కెట్ల‌లో ఏర్ప‌డిన ప‌త‌నాల క‌న్నా భార‌త మార్కెట్ ప‌త‌నంలో శాతం అధికంగా ఉంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 25880.83 పాయింట్ల క‌నిష్ఠ స్థాయిని తాకింది.

ఉద‌యం 45 నిముషాలు ట్రేడింగ్ హాల్ట్

సోమ‌వారం ఉద‌యం ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 10 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. దీంతో స‌ర్క్యూట్ బ్రేక‌ర్లు అప్లై చేయ‌క త‌ప్ప‌లేదు. ఫ‌లితంగా 45 నిముషాల పాటు ట్రేడింగ్ నిలిచిపోయింది. విరామం త‌ర్వాత మార్కెట్ తిరిగి తెరుచుకున్నా మార్కెట్ ఎక్క‌డా కోలుకునే సూచ‌న ఇవ్వ‌లేదు.

ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు ఫ‌ట్
ఈ మ‌హాప‌త‌నంలో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఫ‌లితంగా బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,01,86,936.28 కోట్ల‌కు దిగ‌జారింది.
- సెన్సెక్స్ లో న‌ష్ట‌పోయిన కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్ 28 శాతం న‌ష్టంతో అగ్ర‌గామిగా నిలిచింది. బ‌జాజ్ ఫైనాన్స్, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, మారుతి, ఎల్ అండ్ టి అన్నీ భారీ న‌ష్టాలు న‌మోదు చేశాయి.

రూపాయి చారిత్ర‌క ప‌త‌నం
ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి కూడా చారిత్ర‌క ప‌త‌నం న‌మోదు చేసింది. ఒక్క‌రోజులోనే అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి 102 పైస‌లు దిగ‌జారి 76.22 వ‌ద్ద ముగిసింది. రూపాయి చ‌రిత్ర‌లో ఇదే అతి పెద్ద ప‌త‌నం. ఇంట్రాడేలో రూపాయి గ‌రిష్ఠ స్థాయి 75.86, క‌నిష్ఠ స్థాయి 76.30 న‌మోదు చేసింది. 

7 సెష‌న్ల‌లో ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
(గ‌త రెండు వారాల్లో 6 రోజులు + ఈ వారంలో 1)
 ------------------------------------------------------------------------- 
                   సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
-------------------------------------------------------------------------   

మార్చి   9       1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12       2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16       2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17         811         231        రూ. 2.12 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 18       1709         495         రూ. 5.98 ల‌క్ష‌ల కోట్లు 
 మార్చి 19         581        206        రూ. 3.74 ల‌క్ష‌ల కోట్లు
మార్చి  23       3935        1135        రూ.14.22 ల‌క్ష‌ల కోట్లు       
మొత్తం నష్టం  14039       4025       రూ.71.47 ల‌క్ష‌ల కోట్లు   
------------------------------------------------------------------------- 

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

సాధారణ నిస్తేజం 
తిథి :  ఫాల్గుణ బహుళ అమావాస్య   
న‌క్ష‌త్రం : ఉత్తరాభాద్ర   
అప్ర‌మ‌త్తం :   భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, మేష, సింహ  రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 7610.25 (-1135.20) 
ట్రెండ్ మారే వేళ : 2.48
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 11.30 వ‌ర‌కు నిలకడ/నిస్తేజంగా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 1.30 వరకు నిస్తేజంగా నిలిచి తదుపరి  చివరి వరకు నిలకడగా ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  11.30  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిష‌న్లు తీసుకుని 1.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 
నిరోధ స్థాయిలు :  7700, 7850, 7925
మ‌ద్ద‌తు స్థాయిలు : 7500, 7400, 7300
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Sunday, March 22, 2020

వారానికి ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌

9050 పైన ముగిస్తే బుల్లిష్‌
(తేదీలు మార్చి 23-మార్చి 27, 2020 మ‌ధ్య వారానికి)
గ‌త వారం నిఫ్టీ ముగింపు :  8745 (-1210)
నిఫ్టీ గ‌త వారం 9602-7833 పాయింట్ల మ‌ధ్య‌న విస్తృత ప‌రిధిలో క‌ద‌లాడి చివ‌రికి 1210 పాయింట్ల న‌ష్టంతో 8745 వ‌ద్ద నెగిటివ్ గా ముగిసింది.
- మార్చి 23 నుంచి 25 వరకు కొత్త ఆస్ట్రో మాసం ప్రారంభం అవుతోంది. ఈ కాలంలో ఏర్పడే పరిధి 3 వారాలకు కీలకం. గరిష్ఠ స్థాయికి పైన బుల్లిష్ గాను, కనిష్ఠ స్థాయికి దిగువన బేరిష్ గాను భావించాలి
- 20, 50, 100, 200 చ‌ల‌న స‌గ‌టు (డిఎంఏ) స్థాయిలు 10513, 11479, 11760, 11574. ఇవి నిరోధ‌, మ‌ద్ద‌తు స్థాయిలుగా నిలుస్తాయి.
- నిఫ్టీ ప్ర‌స్తుతం అన్ని డిఎంఏల క‌న్నా దిగువ‌న ఉంది. కాని 50 డిఎంఏ, 200 డిఎంఏ క‌న్నా పైనే ఉండ‌డం దీర్ఘ‌కాలిక బుల్లిష్ ట్రెండ్ చెక్కు చెద‌ర‌లేద‌న‌డానికి సంకేతం. వారాంతానికి 9050 క‌న్నా పైన ముగిస్తే స్వ‌ల్ప‌కాలిక ట్రెండ్ బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి : 9050    బ్రేక్ డౌన్ స్థాయి : 8450
నిరోధ స్థాయిలు : 8890, 8975, 9050 (8815 పైన బుల్లిష్‌)
మ‌ద్ద‌తు స్థాయిలు : 8600, 8225, 8450 (8675 దిగువ‌న బేరిష్‌) 
ఇన్వెస్ట‌ర్ల‌కు సూచ‌న...
వారం ప్రారంభ స్థాయి అత్యంత కీల‌కం. అంత కన్నా పైన మాత్రమే లాంగ్ పొజిషన్లు శ్రేయస్కరం. 
---------------------------------------------- 
గ్ర‌హ‌గ‌తులివే...
- కుంభంలోని పూర్వాభాద్ర పాదం 2 నుంచి మేషంలోని భరణి పాదం 1 మ‌ధ్య‌లో చంద్ర సంచారం
- మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 2-3 మ‌ధ్య‌లో ర‌వి సంచారం
- కుంభంలోని శతభిషం పాదం 2-3 మ‌ధ్య‌లో బుధ సంచారం
- మేషంలోని భరణి  పాదం 4 నుంచి కృత్తిక పాదం 1 మధ్యలో శుక్ర సంచారం
- మకరంలోని ఉత్తరాషాఢ పాదం2లో కుజ సంచారం
- మకరంలోని ఉత్త‌రాషాఢ పాదం 3లో కుంభ న‌వాంశ‌లో శ‌ని సంచారం
- ధ‌నుస్సులోని ఉత్తరాషాఢ పాదం 1లో ధ‌నుస్సు న‌వాంశ‌లో బృహ‌స్ప‌తి సంచారం
- మిథునంలోని ఆర్ద్ర పాదం 1లో రాహువు, ధ‌నుస్సులోని మూల పాదం 3లో కేతువు సంచారం
---------------------------------------------- 
సాధారణంగా మెరుగు  (సోమవారానికి)
తిథి :  ఫాల్గుణ బహుళ చతుర్దశి  
న‌క్ష‌త్రం : పూర్వాభాద్ర   
అప్ర‌మ‌త్తం :  అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులు, మీన, కర్కాటక    రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 82463.45 (-205.35) 
ట్రెండ్ మారే వేళ : ఉద‌యం : 11.52
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 10.30 వ‌ర‌కు మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత 12.45 వరకు నిలకడ/నిస్తేజంగా నిలిచి తదుపరి 3 గంటల వరకు మెరుగ్గాను ఆ తర్వాత చివరి వరకు నిస్తేజంగాను ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  10.45  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిష‌న్లు తీసుకుని 12.30 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. ఒంటి గంట తర్వాత ఎటిపి క‌న్నా పైకి వస్తే లాంగ్  పొజిషన్లు తీసుకుని 3 గంటల  సమయంలో క్లోజ్  చేసుకోవచ్చు  
నిరోధ స్థాయిలు :  8800, 8850, 8925
మ‌ద్ద‌తు స్థాయిలు : 8675, 8625, 8550
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Saturday, March 21, 2020

వారం మొత్తంలో క‌ల్లోల‌మే

స్టాక్ మార్కెట్ వారం మొత్తంలో తీవ్ర క‌ల్లోలాన్ని చ‌వి చూసింది. ఐదు రోజుల ట్రేడింగ్ లో నాలుగు రోజులు బేర్స్ తో బుల్స్ పోరాట స్ఫూర్తిని ఏ మాత్రం చూప‌లేక‌పోయాయి. బేర్ ధాటికి చ‌తికిల‌బ‌డిపోయి లేవ‌లేని స్థితిలో ఉన్న బుల్స్ శుక్ర‌వారం ఉన్న‌ట్టుండి విశ్వ‌రూపం చూపించాయి. నాలుగు రోజుల విశ్రాంతికి ప్ర‌తీకారం చూపించాయి. ఒక్క రోజులోనే సెన్సెక్స్ 1628 పాయింట్లు, నిఫ్టీ 482 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి. కాని వారం మొత్తం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మాత్రం బుల్స్ భారీ ఓట‌మిని అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు. వారం మొత్తం మీద సెన్సెక్స్ 4188 పాయింట్లు,నిఫ్టీ 1203 పాయింట్ల భారీ న‌ష్టం మూట‌గ‌ట్టుకున్నాయి. ఇంత‌కు ముందు వారంలో సోమ‌, గురు వారాల్లో ఏర్ప‌డిన న‌ష్టాల‌ను కూడా క‌లిపితే మొత్తం ఆరు రోజులుగా ఏర్ప‌డిన క‌ల్లోలంలో ఇన్వెస్ట‌ర్ల సంప‌ద రూ.57.25 ల‌క్ష‌ల కోట్లు క్షీణించినా చివ‌రి రోజున సాధించిన లాభంతో ఆ న‌ష్టం రూ.50.93 ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌రిమితం అయింది. కోవిడ్‌-19 వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు ఏర్ప‌డ‌నున్న న‌ష్టం నుంచి భిన్న రంగాల‌ను కాపాడేందుకు ప‌లు దేశాలు ఉద్దీప‌న ప్యాకేజిలు ప్ర‌క‌టించ‌డం, ఎక‌నామిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌టించ‌డం మార్కెట్ కు ఊపిరులు పోసింది. అయితే శుక్ర‌వారం నాడు క‌నిష్ఠ స్థాయిల నుంచి కోలుకోవ‌డం వ‌చ్చే వారం సూచీలు కాస్తంత రిక‌వ‌రీ బాట ప‌ట్టే ఆశ‌ల‌ను రేకెత్తించింద‌ని ప‌రిశీల‌కులంటున్నారు.

Friday, March 20, 2020

హ‌మ్మ‌య్య‌..వేడి చ‌ల్లారింది

4 రోజుల ప‌త‌నాల అనంత‌రం తొలి లాభం

స్టాక్ మార్కెట్ లో నాలుగు రోజులుగా సాగుతున్న భారీ న‌ష్టాల‌కు ఎట్ట‌కేల‌కు తెర ప‌డింది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఏర్ప‌డ‌బోయే ప‌రిస్థితుల‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ప‌లు దేశాలు విప్ల‌వాత్మ‌క‌మైన చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించ‌డం స్టాక్ మార్కెట్ల‌కు ఊపిరి పోసింది. ఫ‌లితంగా శుక్ర‌వారం ప్ర‌పంచ మార్కెట్లు కోలుకున్నాయి. ఆ స్ఫూర్తితో భార‌త మార్కెట్ లో కూడా సెంటిమెంట్ పాజిటివ్ గా మారింది. కోవిడ్‌-19 ప్ర‌భావానికి దెబ్బ తినే రంగాల‌కు ఉద్దీప‌నలు అందించేందుకు ఒక ఫైనాన్షియ‌ల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని చేసిన ప్ర‌క‌ట‌న కూడా మార్కెట్ల‌లో ఆశావ‌హ స్థితి నెల‌కొల్పింది. అయిన‌ప్ప‌టికీ ఉద‌యం మార్కెట్ ఆటుపోట్ల‌తోనే ప్రారంభ‌మై ఇంట్రాడేలో 2485 పాయింట్ల మేర‌కు భారీ ఎగుడుదిగుడులు చ‌వి చూసింది. అయితే  త‌దుప‌రి ద‌శ‌లో మార్కెట్ నిల‌దొక్కుకోవ‌డంతో చివ‌రికి 1627.73 పాయింట్ల లాభంతో 29215.96 పాయింట్ల వ‌ద్ద సెన్సెక్స్ ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 482 పాయింట్లు లాభ‌ప‌డి 8745.45 వ‌ద్ద ముగిసింది. సుదీర్ఘ విరామం త‌ర్వాత అన్ని సెక్టోర‌ల్ సూచీలు లాభాల్లో ముగిశాయి.

సంప‌ద పెరిగింది...
వారాంతం రోజున మార్కెట్ అద్భుత‌మైన రిక‌వ‌రీ సాధించ‌డంతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.6,32,362.29 కోట్ల మేర‌కు పెరిగింది.శుక్ర‌వారం మార్కెట్ ముగిసే స‌మ‌యానికి ఆ విలువ రూ1,16,09,143.29 కోట్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. 

Thursday, March 19, 2020

నాలుగో రోజూ ఆగ‌లేదు...

కొన‌సాగిన స్టాక్ మార్కెట్ల న‌ష్టాలు
క‌రోనా సునామీ - 6
కోవిడ్‌-19 ప్ర‌భావానికి భార‌త ఈక్విటీ మార్కెట్ వ‌రుస‌గా నాలుగో రోజు కూడా ప‌తనం న‌మోదు చేసింది. ఉద‌యం స‌మ‌యంలో కొంత సేపు పాజిటివ్ ధోర‌ణిలోనే ట్రేడ‌యినా అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో తిరోగ‌మ‌నం భ‌యాల‌తో ప్ర‌పంచ మార్కెట్ల‌లో అమ్మ‌కాలు పోటెత్తిన ప్ర‌భావం దేశీయ ఇన్వెస్ట‌ర్ల‌పై కూడా ప‌డింది. మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి రిటైల్ ఇన్వెస్ట‌ర్లు భారీ ఎత్తున అమ్మ‌కాల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో రోజు మొత్తంలో 2650 పాయింట్ల‌కు పైబ‌డి ఎగుడుదిగుడులు సాధించిన సెన్సెక్స్ చివ‌రికి 581.28 పాయింట్ల న‌ష్టంతో 28288.23 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఒక ద‌శ‌లో కీల‌క మాన‌సిక అవ‌ధి 7900 క‌న్నా దిగ‌జారినా చివ‌రికి 205.35 పాయింట్ల న‌ష్టంతో 8263.45 వ‌ద్ద ముగిసింది. అయితే మ‌ధ్యాహ్నం సెష‌న్ లో మార్కెట్లు ఒక మోస్త‌రు పుల్ బ్యాక్ సాధించ‌డం కాస్తంత ఊర‌ట క‌లిగించింది. కాని ఆ ఆనందం ఎంతో స‌మ‌యం నిల‌వ‌లేదు.
మ‌రో రూ.3.74 ల‌క్ష‌ల కోట్లు ఢ‌మాల్‌
గురువారం మార్కెట్ లో ఏర్ప‌డిన న‌ష్టం ప్ర‌భావం వ‌ల్ల ఇన్వెస్ట‌ర్ల సంప‌ద మ‌రో్ రూ.3.74 ల‌క్షల కోట్లు ఆవిరైపోయింది.దీంతో వ‌రుస‌గా నాలుగు రోజులుగా తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ప‌రిమాణం రూ.19.49 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.19,49,461.82 కోట్లు దిగ‌జారి రూ.1,09,76,781 కోట్ల‌కు చేరింది. 
6 సెష‌న్ల‌లో ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
(గ‌త వారం రెండు రోజులు స‌హా)
------------------------------------------------------------------------- 
                   సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
------------------------------------------------------------------------- 

మార్చి   9      1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12       2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16       2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17         811         231        రూ. 2.12 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 18      1709         495         రూ. 5.98 ల‌క్ష‌ల కోట్లు 
 మార్చి 19        581         206         రూ. 3.74 ల‌క్ష‌ల కోట్లు      
మొత్తం నష్టం  10104       2890         రూ.57.25 ల‌క్ష‌ల కోట్లు   
------------------------------------------------------------------------- 

ప్ర‌పంచ మార్కెట్లూ న‌ష్టాల బాట‌లోనే...
కోవిడ్‌-19 భ‌యాల కార‌ణంగా ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ వ‌రుస న‌ష్టాల్లోనే ట్రేడ‌వుతున్నాయి. ప‌లు దేశాలు ఉద్దీప‌న‌లు ప్ర‌క‌టించినా ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ ను పెంచ‌లేక‌పోయాయి. ఆసియా దేశాల స్టాక్ ఎక్స్ఛేంజిల‌న్నీ భారీ ప‌త‌నాలు న‌మోదు చేశాయి. ద‌క్షిణ కొరియాకు చెందిన కోస్పి 8 శాతం న‌ష్ట‌పోయి దారుణంగా దిగ‌జారిన సూచీగా నిలిచింది. హాంగ్ సెంగ్‌, నిక్కీ, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ తో పాటు యూరో్పియ‌న్ దేశాల సూచీలు కూడా భారీ న‌ష్టాల‌నే న‌మోదు చేశాయి.
రూపాయి మ‌రింత బ‌ల‌హీనం
అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి మ‌రింత‌గా దిగ‌జారింది. ఒక ద‌శ‌లో జీవిత కాల క‌నిష్ఠ స్థాయి 75.30 వ‌ర‌కు దిగ‌జారి గుబులు పుట్టించింది. చివ‌రికి 86 పైస‌లు దిగ‌జారి 75.12 వ‌ద్ద క్లోజ‌యింది. 2019 సెప్టెంబ‌ర్ 3వ తేదీ త‌ర్వాత రూపాయి ఒక రోజులో ఇంత భారీగా న‌ష్ట‌పోవ‌డం ఇదే ప్ర‌థ‌మం. దీంతో ఈ నెల మొత్తం మీద రూపాయి విలువ 4 శాతం క్షీణించిన‌ట్ట‌యింది. 
- సోమ‌-గురు వారాల మ‌ధ్య‌న‌ 4 రోజుల్లో భార‌త స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్లు న‌ష్టపోయిన సంప‌ద విలువ‌ రూ.19.49 ల‌క్ష‌ల కోట్లు. స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,09,76,781 కోట్ల‌కు దిగ‌జారింది. గ‌త వారంలో సోమ‌, గురు వారాల్లో (9,12 తేదీలు) ఏర్ప‌డిన భారీ న‌ష్టాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మొత్తం సంప‌ద న‌ష్టం రూ.57.25 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది.
- ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 173కి చేర‌గా మృతుల సంఖ్య 4కి పెరిగింది. పంజాబ్ కు చెందిన 70 సంవ‌త్స‌రాల వృద్ధుడు క‌రోనా వ్యాధి కార‌ణంగా గురువారం మ‌ర‌ణించాడు.
- క్రూడాయిల్ ధ‌ర‌ల త‌గ్గుద‌ల వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.1.40 ల‌క్ష‌ల కోట్లు ఆదా     

ఆస్ర్టో టెక్నిక‌ల్ గైడ్‌  

మిడ్  సెషన్  నిస్తేజం 
తిథి :  ఫాల్గుణ బహుళ ద్వాదశి  
న‌క్ష‌త్రం : శ్రవణం    
అప్ర‌మ‌త్తం :  పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, కుంభ, మిథున రాశుల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
నిఫ్టీ : 82463.45 (-205.35) 
ట్రెండ్ మారే వేళ : ఉద‌యం : 10.28
ధోర‌ణి :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ 12.10 వ‌ర‌కు నిలకడ/మెరుగ్గా  ట్రేడయ్యే ఆస్కారం ఉంది. ఆ తర్వాత  2.20 వరకు నిలకడనూ, తదుపరి చివరి వరకు మెరుగ్గాను ట్రేడ్ కావ‌చ్చు.
ట్రేడింగ్ వ్యూహం :  నిఫ్టీ ఫ్యూచ‌ర్స్ ఉద‌యం  12.15  స‌మ‌యానికి ప్రారంభ స్థాయి/స‌గ‌టు  (ఎటిపి) క‌న్నా దిగువన ట్రేడ‌వుతుంటే త‌గు స్టాప్ లాస్ తో షార్ట్  పొజిష‌న్లు తీసుకుని 2.15 స‌మ‌యానికి క్లోజ్ చేసుకోవాలి. 2.30 తర్వాత ఎటిపి క‌న్నా పైకి వస్తే లాంగ్  పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోల్ చేసుకోవచ్చు  
నిరోధ స్థాయిలు :  8325, 8400, 8450
మ‌ద్ద‌తు స్థాయిలు : 8150, 8200, 8125
గ‌మ‌నిక :  ఇది పూర్తిగా ఆస్ర్టోటెక్నిక‌ల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచ‌న మాత్ర‌మే. మార్కెట్ వాస్త‌విక క‌ద‌లిక‌ల ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. 
------------------------------------------------------ 
 సూచ‌న‌...
- నిరోధ స్థాయిలు మ‌ధ్యాహ్న‌ సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే గ‌రిష్ఠ స్థాయిల్లో కొనుగోళ్ల‌ను నివారించాలి. బుల్లిష్ లెవెల్ వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు షార్ట్ పొజిష‌న్లు ప‌రిశీలించ‌వ‌చ్చు. 
- మ‌ద్ద‌తు స్థాయిలు మ‌ధ్యాహ్న సెష‌న్ లోపు తాకిన‌ట్ట‌యితే క‌నిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు నివారించాలి. బేరిష్ ట్రిగ్గ‌ర్ స్థాయి లేదా ఇత‌ర మ‌ద్ద‌తు స్థాయిల వ‌ర‌కు పుల్ బ్యాక్ ఏర్ప‌డితే రిస్క్ భ‌రించ‌గ‌ల ట్రేడ‌ర్లు లాంగ్ పొజిష‌న్లు తీసుకోవ‌చ్చు.
-పైన ఇచ్చిన ఇంట్రాడే ధోర‌ణి పూర్తిగా గ్ర‌హ‌గ‌తుల ఆధారంగా ఇచ్చిన‌దే. కాని స‌రైన ట్రేడింగ్ నిర్ణ‌యాలు తీసుకునే ముందు పైన ఇచ్చిన ఆస్ర్టో సూచ‌న‌ను టెక్నిక‌ల్స్ తో జ‌త చేసి గ‌మ‌నించుకోవాలి.
- ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఆస్ర్టో సూచ‌న‌ను వాస్త‌విక మార్కెట్ క‌ద‌లిక‌ల‌తో జ‌త చేసి చూసుకోవాలి. టెక్నిక‌ల్స్ కు అద‌నంగా ఇది ఒక సాధ‌నం మాత్ర‌మే. వ్య‌క్తిగ‌త ఖ‌గోళ చార్ట్ ఆధారంగా లాభ‌న‌ష్టాలు ఆధార‌ప‌డి ఉండాయి. ఆస్ర్టో శాస్త్రవేత్త కేవ‌లం ఏమి జ‌ర‌వ‌చ్చున‌నేది సూచ‌న‌గా చెబుతాడు. పై విశ్లేష‌ణ ఆధారంగా మీరు తీసుకునే నిర్ణ‌యాల‌కు మా బాధ్య‌త లేదు. 

గ‌ట్టి స్టాప్ లాస్ పాటించండి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విజ‌య‌వంతంగా ట్రేడ్ చేయండి...
- భువ‌న‌గిరి అమ‌ర‌నాథ శాస్ర్తి, ఆస్ర్టో టెక్నిక‌ల్ అన‌లిస్ట్  

Wednesday, March 18, 2020

క‌రోనా సునామీ

మూడో రోజూ న‌ష్టాల్లో మార్కెట్‌

29 వేల దిగువ‌కు సెన్సెక్స్ 

కోవిడ్‌-19 ప్ర‌భావం స్టాక్ మార్కెట్ ను పీడ‌క‌ల‌లా వెన్నాడుతోంది. ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ భారీ ప‌త‌నాలు చ‌వి చూసిన ప్ర‌భావంతో భార‌త స్టాక్ ఇండెక్స్ లు వ‌రుస‌గా మూడో రోజూ న‌ష్టాల్లో న‌డిచాయి. ఉద‌యం స్వ‌ల్ప‌లాభాల్లో ఉన్న‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ రోజు గ‌డుస్తున్న కొద్దీ న‌ష్టాల్లోకి జారుకున్నాయి. ప్ర‌పంచ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు మార్కెట్ ఊపిరి తీసుకోగ‌లిగే ప‌రిస్థితి ఏ మాత్రం అందించ‌లేదు. దీనికి తోడు ఎస్ అండ్ పి సంస్థ భార‌త వృద్ధి అంచ‌నాను మ‌రింత‌గా త‌గ్గించ‌డం, టెలికాం ఎజిఆర్ బ‌కాయిల విష‌యంలో టెల్కోలు, ప్ర‌భుత్వ వైఖ‌రిని సుప్రీం కోర్టు త‌ప్పు ప‌ట్ట‌డం వంటి ప‌రిణామాలు మార్కెట్ కోలుకోలేని విఘాతం క‌లిగించాయి. రోజు మొత్తంలో సుమారు 2500 పాయింట్ల మేర ఊగిసలాడిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి 1709.58 పాయింట్ల న‌ష్టంతో 28869.51 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. 2017 జ‌న‌వ‌రి త‌ర్వాత ఇండెక్స్ 29000 క‌న్నా దిగ‌జార‌డం ఇదే ప్ర‌థ‌మం. నిఫ్టీ 498.25 పాయింట్ల న‌ష్టంతో 8468.80 వ‌ద్ద ముగిసింది. ఇండెక్స్ లు వ‌రుస‌గా మ‌ద్ద‌తు స్థాయిల‌న్నింటినీ కోల్పోతున్నాయి. ఈ ప‌త‌నం ఎంత‌వ‌ర‌కు సాగుతుందో అంచ‌నా వేయ‌డం మార్కెట్ పండితుల‌కు కూడా సాధ్యం కావ‌డంలేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తుంటే నిఫ్టీ మ‌రో 1000 పాయింట్ల వ‌ర‌కు న‌ష్ట‌పోయి 7500 వ‌ద్ద స్థిర‌ప‌డ‌వ‌చ్చునంటున్నారు.
- సెన్సెక్స్ లో ఒఎస్ జిసి, ఐటిసి మిన‌హా అన్ని షేర్లు న‌ష్టాల్లోనే ట్రేడ‌య్యాయి. 23.90 శాతం న‌ష్టంతో ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ అగ్ర‌గామిగా ఉంది.

- మూడు రోజుల్లో భార‌త స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట‌ర్లు న‌ష్టపోయిన సంప‌ద విలువ‌ రూ.15.72 ల‌క్ష‌ల కోట్లు. స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,13,53,329.30 కోట్ల‌కు దిగ‌జారింది.

- 1056 క‌న్నా ఎక్కువ‌ కంపెనీల షేర్ల ధ‌ర‌లు ఏడాది క‌నిష్ఠ స్థాయికి దిగ‌జారిపోయాయి.
5 సెష‌న్ల‌లో ఇండెక్స్ ల న‌ష్టాలిలా ఉన్నాయి...
 ------------------------------------------------------------------------- 
                   సెన్సెక్స్        నిఫ్టీ        సంప‌ద న‌ష్టం
 -------------------------------------------------------------------------   

మార్చి   9      1942         538         రూ. 7.00 ల‌క్ష‌ల కోట్లు 
మార్చి 12       2919        868         రూ.11.28 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 16       2713        758         రూ. 7.62 ల‌క్ష‌ల కోట్లు
మార్చి 17         811         231        రూ.  2.12 ల‌క్ష‌ల కోట్లు
 మార్చి 18      1709         495         రూ.5.98 ల‌క్ష‌ల కోట్లు   
మొత్తం నష్టం  10104       2890         రూ.37.76 ల‌క్ష‌ల కోట్లు   
-------------------------------------------------------------------------       

భారీ న‌ష్టాల్లో ప్ర‌పంచ మార్కెట్లు
ప‌లు దేశాలు కోవిడ్‌-19 వ‌ల్ల ఏర్ప‌డిన న‌ష్టాల నుంచి కోలుకునేందుకు ప్ర‌క‌టించిన ఉద్దీప‌న చ‌ర్య‌లు కూడా ప్ర‌పంచ మార్కెట్ల‌ను ఆదుకోలేదు. ఫ్రాంక్ ఫ‌ర్ట్, లండ‌న్‌, పారిస్ ఇండెక్స్ లు 5 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి. ఆసియాలో టోక్యో (1.7%), సిడ్నీ (6%), హాంకాంగ్ (4%) షాంఘై (1.8%) ఇండెక్స్ లు భారీగా న‌ష్ట‌పోయాయి. 

17 సంవ‌త్స‌రాల క‌నిష్ఠానికి క్రూడాయిల్ ధ‌ర
అంత‌ర్జాతీయ విప‌ణిలో క్రూడాయిల్ ధ‌ర‌లు 17 సంవ‌త్స‌రాల క‌నిష్ట స్థాయికి దిగ‌జారాయి. న్యూయార్క్ మార్కెట్ లో డ‌బ్ల్యుటిఐ క్రూడాయిల్ ధ‌ర బ్యారెల్ 25.08 డాల‌ర్లు ప‌లికింది.   

1985 క‌నిష్ఠ స్థాయికి స్టెర్లింగ్‌
బ్రిట‌న్ క‌రెన్సీ స్టెర్లింగ్ పౌండ్ డాల‌ర్ మార‌కంలో 1985 క‌నిష్ఠ స్థాయిల‌కు ప‌డిపోయింది.బుధ‌వారం 1.9 శాతం దిగ‌జారి 1.1828కి ప‌డిపోయి చివ‌రికి 1.1861 వ‌ద్ద ముగిసింది.           

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...