Wednesday, March 4, 2020

భారీగా పెరిగిన బంగారం బాండ్ల ధ‌ర‌

గ్రాము రూ.4260
ప్ర‌భుత్వం జారీ చేస్తున్న బంగారం బాండ్ల ధ‌ర భారీగా పెరిగింది. ఆర్ బిఐ సంప్ర‌దింపుల‌తో ప్ర‌భుత్వం జారీ చేస్తున్న ప‌దో విడ‌త సావెరీన్ గోల్డ్ బాండ్ల ధ‌ర‌ను గ్రాముకి రూ.4260గా ప్ర‌క‌టించారు. ఆన్ లైన్ లో చెల్లించే వారికి ధ‌ర రూ.4210కే అందుబాటులో ఉంటాయి. ఇంత‌కు ముందు సీరీస్ తో పోల్చితే గోల్డ్ బాండ్ ధ‌ర 34 శాతం అధికం. ఇప్ప‌టి వ‌ర‌కు జారీ అయిన వివిధ సీరీస్ లో ధ‌ర స‌గ‌టున రూ.3146 నుంచి రూ.3196 మ‌ధ్య‌న ఉంది. కాని ఇటీవ‌ల మార్కెట్ లో బంగారం ధ‌ర పెర‌గ‌డంతో అందుకు దీటుగా బంగారం బాండ్ల ధ‌ర కూడా పెంచారు. గ‌త మూడు నెల‌ల కాలంలో బంగారం స‌గ‌టు ధ‌ర ఆధారంగా బాండ్ ధ‌ర‌ను నిర్ణ‌యిస్తారు. 
- ఆస‌క్తి గ‌ల వారు క‌నీసం ఒక గ్రాము బంగారంతో స‌మాన‌మైన బాండుకు ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ‌రిష్ఠంగా ఇష్యూ వంతున 4 కిలోల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఏడాది మొత్తంలో 20 కిలోల‌కు మించి ద‌ర‌ఖాస్తు చేయ‌రాదు. 
- ఈ బాండ్ల కాల‌ప‌రిమితి 8 సంవ‌త్స‌రాలు. ఐదో సంవ‌త్స‌రం నుంచి వైదొల‌గే అవ‌కాశం క‌ల్పిస్తారు. అప్ప‌టికి బంగారం ధ‌ర ఎంత ఉంటే అంత చెల్లిస్తారు. 
- ఈ బాండ్లు డీమాట్ గాను, పేప‌ర్ బాండ్లుగాను కూడా అందుబాటులో ఉంటాయి.
- పెట్టుబ‌డి పెట్టిన మొత్తంపై ప్ర‌తీ 6 నెల‌ల‌కు ఒక సారి 2.5 శాతం వార్షిక వ‌డ్డీ చెల్లిస్తారు. రిడెంప్ష‌న్ స‌మ‌యంలో ధ‌ర అధికంగా ఉన్న‌ట్ట‌యితే పెట్టుబ‌డి లాభాలు కూడా అందుతాయి.
- ఈ బాండ్ల‌ను రుణాలు తీసుకునేందుకు కొల్లేట‌ర‌ల్ గా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. భౌతిక బంగారం వ‌లెనే ఇవి కూడా ఎప్పుడు కావాల‌నుకుంటే అప్పుడు న‌గ‌దుగా మార్చుకునే వెసులుబాటు క‌లిగి ఉంటాయి. 

No comments:

Post a Comment

ఉపాధి, వేత‌న వృద్ధి రెండింటిలోనూ బెంగ‌ళూరే టాప్‌

నూత‌న ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌, వేత‌న వృద్ధి రెండింటిలోనూ దేశంలోని న‌గ‌రాల‌న్నింటిలోనూ బెంగ‌ళూరు అగ్ర‌స్థానంలో నిలిచింది. చెన్నై, ఢిల్లీ త‌ర్...