మూడో రోజూ భారీ లాభాల్లో ఇండెక్స్ లు
3 రోజుల్లో రూ.11.12 లక్షల కోట్ల సంపద వృద్ధి
వరుసగా మూడు రోజులుగా సాగిన ర్యాలీలో ఇన్వెస్టర్ల సంపద రూ.11,12,088.88 కోట్లు పెరిగింది. దీంతో బిఎస్ఇలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.1,12,99,025.06 కోట్లకు చేరింది.
----------------------------------
దేశంలో కరోనా వైరస్ దారికొస్తున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. 4 వారాల పాటు వరుసగా అధిక సంఖ్యలో కేసులు పెరుగుతూ పోగా తొలి సారిగా బుధ, గురువారాల మధ్యన (25, 26 తేదీలు) 24 గంటల వ్యవధిలో తొలిసారిగా తక్కువ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 4 వారాలుగా కొత్తగా నమోదైన కేసుల సంఖ్య రోజుకి 70 నుంచి 80 వరకు ఉండగా తొలిసారిగా 24 గంటల్లో 43 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. మార్చి 26వ తేదీ నాటికి 26 రాష్ర్టాల్లో కరోనా కేసుల సంఖ్య 649కి చేరగా మృతుల సంఖ్య 13కి పెరిగింది.
- 26వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 197 దేశాల్లో 4,16,686 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా మృతుల సంఖ్య 18,589కి చేరింది. గతంలో సార్స్, మెర్స్ వంటి వైరస్ ల వ్యాప్తి సమయంలో ఏర్పడిన మరణాల సంఖ్యను కోవిడ్-19 మరణాలు దాటేశాయి. ఎబోలా వైరస్ సమయంలో మృతుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గరిష్ఠంగా 11300 మరణాలు నమోదయ్యాయి.
No comments:
Post a Comment