Monday, March 2, 2020

ఏడో రోజూ కొన‌సాగిన న‌ష్టాలు

స్టాక్ మార్కెట్ లో వ‌రుస‌గా ఏడో రోజున కూడా న‌ష్టాలు త‌ప్ప‌లేదు. ఉద‌యం సాధించిన ర్యాలీ సంద‌ర్భంగా ఏర్ప‌డిన లాభం అంత‌టినీ తుడిచిపెట్టుకుని బిఎస్ఇ సెన్సెక్స్ చివ‌రికి 153 పాయింట్ల న‌ష్టంతో ముగిసింది. ఆర్థిక వృద్ధిరేటుకు సంబంధించిన ఆందోళ‌న‌ల‌తో ఫైనాన్షియ‌ల్‌, స్టీల్‌, ఎఫ్ఎంసిజి విభాగాల షేర్లు న‌ష్ట‌పోయాయి. ఈ కార‌ణంగా సెన్సెక్స్ 153.27 పాయింట్ల న‌ష్టపోయి 38144.02 పాయింట్ల వ‌ద్ద క్లోజ‌యింది. నిఫ్టీ 69 పాయింట్ల న‌ష్టంతో 11132.75 పాయింట్ల వ‌ద్ద ముగిసింది.

ఉద‌యం ప‌రుగు
విలువ ఆధారిత కొనుగోళ్ల‌తో ఉద‌యం సెష‌న్ లో మార్కెట్ మంచి ర్యాలీ సాధించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 786 పాయింట్లు లాభ‌ప‌డి 39083.17 పాయింట్ల గ‌రిష్ఠ స్థాయి వ‌ర‌కు దూసుకుపోయింది. నిఫ్టీ ఇంట్రాడేలో 11433 పాయింట్ల గ‌రిష్ఠ స్థాయిని తాకింది. ఈ స‌మ‌యంలోనే దేశంలో  కొత్త‌ క‌రోనా వైర‌స్ కేసులు మ‌రో రెండు బ‌య‌ట‌ప‌డిన‌ట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డంతో దేశీయ ఇన్వెస్ట‌ర్లు అమ్మ‌కాల జోరు పెంచారు. ఈ కార‌ణంగా సెన్సెక్స్ డే గ‌రిష్ట స్థాయిల నుంచి 1300 పాయింట్లు న‌ష్ట‌పోయింది.
- సెక్టార్ల వారీగా బిఎస్ఇ మెట‌ల్‌, ఆయిల్‌-గ్యాస్‌, బేసిక్ మెట‌ల్స్, యుటిలిటీస్‌, ఎన‌ర్జీ, టెలికాం ఇండెక్స్ లు 2.05 శాతం మేర‌కు న‌ష్ట‌పోయాయి. ఐటి, టెక్నాల‌జీ ఇండెక్స్ లు మాత్ర‌మే లాభాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు కూడా 0.77 శాతం మేర‌కు న‌ష్ట‌పోయాయి.
- సెన్సెక్స్ షేర్ల‌లో ఎస్ బిఐ, టాటా స్టీల్‌, హీరోమోటోకార్ప్, బ‌జాజ్ ఆటో, ఒఎన్ జిసి, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ భారీగా న‌ష్ట‌పోయాయి. హెచ్ సిఎల్ టెక్‌, నెస్లె ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్ లాభాల్లో ముగిశాయి.

50 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి
ఫారెక్స్ మార్కెట్ లో అమెరిక‌న్ డాల‌ర్ మార‌కంలో రూపాయి 50 పైస‌లు న‌ష్ట‌పోయి 72.74 వ‌ద్ద ముగిసింది. ఉద‌యం 72.09 వ‌ద్ద ప్రారంభ‌మై గ‌రిష్ఠ స్థాయి 72.04ని తాకిన రూపాయి త‌దుప‌రి ద‌శ‌లో క‌నిష్ఠ స్థాయి 72.74ని కూడా తాకి చివ‌రికి అక్క‌డే ముగిసింది.

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...