Friday, March 27, 2020

మూడు రోజుల ర్యాలీకి బ్రేక్‌

131 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్
భార‌త స్టాక్ మార్కెట్ లో మూడు రోజులుగా సాగుతున్న అద్భుత‌మైన ర్యాలీకి బ్రేక్ ప‌డింది. కోవిడ్‌-19 ప్ర‌భావం నుంచి కాపాడేందుకు అల్పాదాయ వ‌ర్గాల‌కు రూ.17 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజిని ఆర్థిక‌మంత్రి నిర్ణ‌యించ‌డం, శుక్ర‌వారం ఆర్ బిఐ ఆక‌స్మికంగా రెపోరేటును భారీ స్థాయిలో 0.75 శాతం మేర‌కు త‌గ్గించ‌డం వంటి సానుకూల ప‌రిణామాల నేప‌థ్యంలో కూడా మార్కెట్ స్వ‌ల్పంగా ప‌త‌నం కావ‌డం విశేషం. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డం ల‌క్ష్యంగా ప్ర‌ధాని ప్ర‌క‌టించిన మేర‌కు జాతీయ స్థాయిలో 21 రోజుల లాక్ డౌన్ అమ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో వ‌చ్చే త్రైమాసికం వృద్ధిరేటు ప్ర‌భావితం అవుతుంద‌ని, దాని ప్ర‌భావం వ‌ల్ల ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధిరేటు భారీగా దెబ్బ తింటుంద‌ని మూడీస్ ఇన్వెస్ట‌ర్ స‌ర్వీసెస్ ప్ర‌క‌టించ‌డం ఇన్వెస్ట‌ర్ సెంటిమెంట్ ను తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌డం మార్కెట్ న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌యింది. దీంతో సెన్సెక్స్ 131.18 పాయింట్ల న‌ష్టంతో 29815.59 పాయింట్ల వ‌ద్ద ముగియ‌గా నిఫ్టీ 18.80 పాయింట్ల న‌ష్టంతో 8660.25 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1179 పాయింట్లు పెరిగి 31126.03 పాయింట్ల వ‌ర‌కు వెళ్లింది. నిఫ్టీ 397.45 పాయింట్లు పెరిగి 9038.90 పాయింట్ల స్థాయిని తాకింది. 

విదేశీ మార్కెట్ల‌కూ న‌ష్టాలే...
ఎంత‌గా నిరోధ‌క చ‌ర్య‌లు తీసుకున్నా క‌రోనా వైర‌స్ పెరుగుతూనే ఉండ‌డం ఇన్వెస్ట‌ర్ల‌ను క‌ల‌త‌కు గురి చేయ‌డంతో యూరోపియ‌న్ మార్కెట్ల‌లో కూడా మూడు రోజుల ర్యాలీకి బ్రేక్ ప‌డింది. పాన్ యూరోపియ‌న్ స్టాక్స్ 600 ఇండెక్స్ 2% మేర‌కు న‌ష్ట‌పోయింది. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం లాభాల్లోనే న‌డిచాయి.

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...