Sunday, March 1, 2020

ఫిబ్ర‌వ‌రి జిఎస్ టి వ‌సూళ్లు రూ.1.05 ల‌క్ష‌ల కోట్లు

దేశంలో జిఎస్ టి వ‌సూళ్లు ఫిబ్ర‌వ‌రి నెల‌లో 1.05 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు. గ‌త ఏడాది ఇదే నెల‌తో పోల్చితే ఇది 8 శాతం అధికం. అయితే జ‌న‌వ‌రి, 2020 నెల‌లో వ‌సూలైన రూ.1.10 ల‌క్ష‌ల కోట్ల క‌న్నా త‌గ్గాయి. స్థూలంగా జిఎస్ టి వ‌సూళ్లు ఫిబ్ర‌వ‌రి నెల‌లో రూ.1,05,366 కోట్లు కాగా అందులో సిజిఎస్ టి రూ.20,569 కోట్లు, ఎస్ జిఎస్ టి రూ.27,348 కోట్లు, ఐజిఎస్ టి రూ.48,503 కోట్లు ఉన్నాయి. రూ.8947 కోట్ల మేర‌కు సెస్ వ‌సూల‌యింది. వాస్త‌వానికి దేశీయంగా జ‌రిగిన వ్యాపార లావాదేవీల ద్వారా వ‌చ్చిన వ‌సూళ్లు 12 శాతం పెరిగినా దిగుమ‌తుల ద్వారా వ‌చ్చిన వ‌సూళ్ల‌ను కూడా క‌లిపి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఆ వృద్ధిరేటు 8 శాతానికే ప‌రిమితం అయిన‌ట్టు ఆర్థిక శాఖ ప్ర‌క‌టించింది. 

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...