Tuesday, March 3, 2020

సిమెంట్ కంపెనీల సామ‌ర్థ్యాల వినియోగం 70% లొపే

దేశంలోని సిమెంట్ ప‌రిశ్ర‌మ‌లో కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో సామ‌ర్థ్యాల వినియోగం 70 శాతం లోపే ఉండ‌వ‌చ్చున‌ని రేటింగ్ ఏజెన్సీలు అంచ‌నా వేస్తున్నాయి. మౌలిక వ‌స‌తులు, అఫ‌ర్డ‌బుల్ హౌసింగ్ విభాగాలు సిమెంట్ డిమాండు వృద్ధికి చోద‌క శ‌క్తులుగా ఉన్న‌ప్ప‌టికీ 2020-21లో అద‌న‌పు సామ‌ర్థ్యాలు కూడా జోడ‌య్యే ఆస్కారం ఉన్నందు వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని ఏజెన్సీలు అంటున్నాయి. గ‌త ఏడాది సిమెంట్ డిమాండు 13 శాతం పెరిగి ద‌శాబ్దిలోనే అధిక వృద్ధిని న‌మోదు చేసిన‌ప్ప‌టికీ వినియోగం మాత్రం స్త‌బ్ధంగానే ఉంటుంద‌ని ఇక్రా, ఇండియా రేటింగ్స్, క్రిసిల్ అంచ‌నా వేశాయి. 

2020 ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి 9 నెల‌ల కాలంలో 24.74 ల‌క్ష‌ల ట‌న్నుల సిమెంట్ ఉత్ప‌త్తి జ‌రిగింది. గ‌త ఏడాది ఇదే స‌మ‌యంతో పోల్చితే అది 0.7 శాతం అధికం. 2019 సెప్టెంబ‌ర్ నెల నుంచి ఉత్ప‌త్తి నెల‌వారీగా పెరుగుతూనే ఉంది. సిమెంట్ డిమాండు కూడా గ‌త డిసెంబ‌ర్ లో 11.8 శాతం పెరిగింది అని ఇక్రా నివేదిక తెలుపుతోంది. కాగా అవ‌స‌రాన్ని మించిన స‌ర‌ఫ‌రా కార‌ణంగా లాభ‌దాయ‌క‌త‌లో కూడా వృద్ధి ప‌రిమితం అయ్యే ఆస్కారం ఉన్న‌ట్టు ఇండియా రేటింగ్స్ తెలిపింది. కాగా డిమాండు పెర‌గ‌డంతో వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో సిమెంట్ కంపెనీలు నిర్వ‌హ‌ణాప‌ర‌మైన లాభాల్లో 20 శాతం వృద్ధిని న‌మోదు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు క్రిసిల్ ప్ర‌క‌టించింది. అలాగే ప‌రిమాణంప‌రంగా కూడా సిమెంట్ డిమాండులో వృద్ధి ఈ ఏడాది అంచ‌నా 0.5-1 శాతం నుంచి వ‌చ్చే ఏడాదికి 5-6 శాతానికి పెర‌గ‌వ‌చ్చున‌ని పేర్కొంది. దేశంలో సిమెంట్ డిమాండులో 35-40 శాతం వాటా మౌలిక వ‌స‌తులు, అఫ‌ర్డ‌బుల్ హౌసింగ్ విభాగాల నుంచే ఉంద‌నిన క్రిసిల్ ప‌రిశోధ‌న విభాగం డైరెక్ట‌ర్ హితాల్ గాంధీ అన్నారు. కాగా తాము రేటింగ్ ఇస్తున్న సిమెంట్ కంపెనీల్లో లిక్విడిటీ బ‌లంగానే ఉంటుంద‌ని, త‌గిన‌న్ని న‌గ‌దు నిల్వ‌ల‌లో పాటు న‌గ‌దు ప్ర‌వాహం కూడా ప్రోత్సాహ‌క‌రంగా ఉంటుంద‌ని ఇండియా రేటింగ్స్ తెలిపింది. కాగా 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో సిమెంట్ ప‌రిశ్ర‌మ‌లో పెట్టుబ‌డి వ్య‌యాలు రూ.9000-రూ.11000 కోట్ల స్థాయిలో ఉండ‌వ‌చ్చున‌ని క్రిసిల్ అంచ‌నా. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...