Tuesday, March 3, 2020

7 రోజుల న‌ష్టాల‌కు తెర

స్టాక్ మార్కెట్ ఏడు రోజుల న‌ష్టాల‌కు తెర దించింది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని త‌ట్టుకునేందుకు కేంద్రీయ బ్యాంకులు విధాన‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌నున్నాయ‌న్న వార్త‌లు గ‌త వారం రోజులుగా తీవ్ర క‌ల‌త‌కు గురి చేసిన మార్కెట్ల‌కు ఊపిరి పోశాయి. ప్ర‌పంచ మార్కెట్ల‌న్నీ రిక‌వ‌రీ బాట ప‌ట్ట‌డంతో భార‌త స్టాక్ మార్కెట్ కూడా అదే బాట‌లో ప‌య‌నించినా రోజంతా ట్రేడింగ్ భారీ ఆటుపోట్ల‌తో సాగింది. చివ‌రికి బిఎస్ఇ సెన్సెక్స్ 479.68 పాయింట్ల లాభంతో 38,623.70 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. సెన్సెక్స్ లోని 30 షేర్ల‌లో 28 లాభాల్లో న‌డిచాయి. నిఫ్టీ 170.55 పాయింట్ల లాభంతో 11,3030.30 వ‌ద్ద ముగిసింది. ఫైనాన్షియ‌ల్ మార్కెట్లు స‌జావుగా ప‌ని చేయ‌డానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆర్ బిఐ ప్ర‌క‌టించ‌డం మార్కెట్ సెంటిమెంట్ ను బ‌ల‌ప‌రిచింది. 
- సెన్సెక్స్ షేర్ల‌లో స‌న్ ఫార్మా గ‌రిష్ఠంగా 6.64 శాతం లాభ‌ప‌డ‌గా టాటా స్టీల్‌, ఒఎన్‌జిసి, అల్ర్టాటెక్ సిమెంట్‌, ఎన్ టిపిసి, ప‌వ‌ర్ గ్రిడ్‌, రిల‌య‌న్స్, కోట‌క్ బ్యాంక్ లాభాల బాట‌లో న‌డిచిన ప్ర‌ధాన షేర్ల‌లో అగ్ర‌గామిగా నిలిచాయి. అయితే ఐటిసి, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ షేర్లు మాత్రం న‌ష్టాల్లో ముగిశాయి.
- మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు కూడా మంచి ర్యాలీ సాధించాయి. అన్ని విభాగాల వారీ ఇండెక్స్ లు లాభాల్లోనే ముగిశాయి. బిఎస్ ఇ మెట‌ల్ ఇండెక్స్ గ‌రిష్ఠంగా 5.67 శాతం లాభ‌ప‌డింది. 
- 1234 స్ర్కిప్ లు లాభాల్లో ట్రేడ్ కాగా 1165 స్క్రిప్‌లు న‌ష్ట‌పోయాయి. 157 స్క్రిప్ లు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉండిపోయాయి. 

No comments:

Post a Comment

కొండెక్కిన బంగారం

ఏడాదిలో 32% వృద్ధి కొత్త రికార్డు రూ.82,900 న‌మోదు దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కి కూచున్నాయి. గురువారం (జ‌న‌వ‌రి 23, 2025) ఢిల్లీ మార్కెట్లో...