Tuesday, March 3, 2020

ల‌క్ష్యాల‌కే భార‌త మ‌హిళ అగ్ర‌పీఠం 

ప‌నిలో స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాలు ఏర్ప‌ర‌చుకోవ‌డ‌మే కీల‌క‌మ‌ని 89 శాతం మంది భార‌త మ‌హిళ‌లు భావిస్తున్నారు. ప్ర‌పంచ స‌గ‌టు 59 శాతం క‌న్నా ఇది అధికం. అమెరిక‌న్ ఎక్స్ ప్రెస్‌, న్యూయార్క్ వుమెన్స్ ఫౌండేష‌న్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యం తేలింది. భార‌త్ లో 89 శాతం మ‌హిళ‌లు ల‌క్ష్యానికే అగ్ర‌తాంబూలం ఇవ్వ‌గా అదే అభిప్రాయం ప్ర‌క‌టించిన వారి సంఖ్య మెక్సికోలో 82%, అమెరికాలో 68% ఉన్నాయి. ఈ విష‌యంలో ఫ్రాన్స్ (41%), జ‌పాన్ (28%) వెనుక వ‌రుస‌లో నిలిచాయి. ల‌క్ష్యాల‌పై గురి పెట్ట‌డం అంత తేలికైన ప‌నేమీ కాదు. విజ‌య‌వంత‌మైన కెరీర్, ఆర్థిక స్వ‌తంత్ర‌త‌, నైపుణ్యాలు, ఆరోగ్య‌వంతంగా ఉండ‌డం, ఆద‌ర్శ‌వంత‌మైన త‌ల్లులుగా నిల‌వ‌డం, శ‌క్తివంత‌మైన వ్య‌క్తిగ‌త బంధాలు క‌లిగి ఉండ‌డం అన్నీ అందులో భాగ‌మేన‌ని అమెరిక‌న్ ఎక్స్ ప్రెస్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా) మ‌నోజ్ అడ్లాఖా అన్నారు. భార‌త‌దేశంలో మ‌హిళ‌లు ఎప్పుడూ చోద‌క‌శ‌క్తులుగానే నిలుస్తార‌ని, స‌రైన అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యితే వారి ల‌క్ష్యాల‌ను నిరూపించ‌గ‌ల‌మ‌నే విశ్వాసం క‌లిగి ఉంటార‌ని, ప్ర‌పంచం యావ‌త్తుకు ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తార‌ని ఆయ‌న తెలిపారు. చ‌క్క‌ని ఆద‌ర్శ‌వంత‌మైన త‌ల్లులుగా ఉండ‌డం, బాంధ‌వ్యాలు, వ్య‌క్తిగ‌త ఆరోగ్యం వంటి వ్య‌క్తిగ‌త అంశాల్లో సుస్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాలు క‌లిగి ఉంటామ‌ని చెప్పిన‌ భార‌త మ‌హిళ‌ల సంఖ్య 91% ఉంది. అలాగే విజ‌య‌వంత‌మైన కెరీర్ కు ప్రాధాన్యం ఇస్తామ‌న్న వారు 78 శాతం, పురుషుల క‌న్నా అధికంగా శ్ర‌మించాల‌ని భావిస్తున్న వారి సంఖ్య 65 శాతం ఉంది. ఆశావ‌హమైన ల‌క్ష్యాలు క‌లిగి ఉండ‌డాన్ని గ‌ర్వంగా భావిస్తామ‌ని ప్ర‌క‌టించిన వారిలో భార‌త మ‌హిళ‌లు 70 శాతం ఉండ‌గా జ‌ర్మ‌న్ మ‌హిళ‌లు 35 శాతం, అమెరిక‌న్ మ‌హిళ‌లు 33 శాతం ఉన్నారు. ఉద్యోగాలు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డానికి నైపుణ్యాలు, అర్హ‌త ప్ర‌ధాన‌మ‌ని చెప్పిన వారి సంఖ్య‌లో మాత్రం 71 శాతంతో భార‌త మ‌హిళ‌లు రెండో స్థానంలో నిలిచారు. 75 శాతంతో మెక్సిక‌న్ మ‌హిళ‌లు ఇందులో ముందువ‌రుస‌లో ఉన్నారు.

No comments:

Post a Comment

ఐపిఓల సంద‌డి, నిధుల సేక‌ర‌ణ దండి

 ప్రైమ‌రీ  మార్కెట్లో  ఈ ఏడాది (2024)  ఐపీఓ సంద‌డి జోరుగా ఉంది. ఏడాది మొత్తం మీద 90 ప్ర‌ధాన ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1.6 ల‌క్ష‌ల కోట్లు స‌మ...